Rachin: పేరు అలా పెట్టలేదు..

క్లారిటీ ఇచ్చిన రచిన్ రవీంద్ర తండ్రి

Courtesy: Twitter

Share:

Rachin: న్యూజిలాండ్ (New Zealand) యువ కెరటం రచిన్ రవీంద్ర (Rachin Ravindra)  గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ ఇయర్ వరల్డ్ కప్ (World Cup) ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికీ రచిన్ (Rachin Ravindra) గురించి తప్పకుండా తెలుస్తుంది. అతడు న్యూజిలాండ్ (New Zealand) తరఫున రెచ్చిపోయి ఆడుతున్నాడు. కేవలం బ్యాటింగ్ (Batting) మాత్రమే కాకుండా బౌలర్ (Bowler) గా కూడా జట్టు విజయాలలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. న్యూజిలాండ్ సెమీస్ (Semis) కు రావడంలో రచిన్ కీలక పాత్ర పోషించాడు. రచిన్ 9 మ్యాచుల్లో కలిపి 565 పరుగులు చేశాడు. ఈ ప్రపంచ కప్ (World Cup) లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రచిన్ నిలిచాడు. ఇందులో రచిన్ మూడు సెంచరీలు (Century) రెండు హాఫ్ సెంచరీలు బాదాడు. రచిన్ 70.62 సగటుతో దూసుకుపోతున్నాడు. అటువంటి రచిన్ ఈ రోజు సెమీ ఫైనల్ లో ఎలా ఆడుతాడని అంతా ఎదురు చూస్తున్నారు. రచిన్ కనుక బ్యాట్ ఝలిపిస్తే ఈ రోజు కివీస్ గెలవడం ఖాయమని అంతా కామెంట్ చేస్తున్నారు. 

పేరు చూస్తే అలానే వచ్చిందని.. 

రచిన్ రవీంద్ర (Rachin Ravindra) పేరు చూసిన ఎవరైనా సరే.. అతడి పేరు క్రికెట్ దిగ్గజాలు సచిన్ (Sachin) టెండూల్కర్ మరియు రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)ల పేర్ల నుంచి పెట్టారని అంతా అనుకుంటారు. మొన్నటి వరకు చాలా మంది ఇదే నిజం అని అనుకున్నారు. అంతే కాకుండా రచిన్ రవీంద్ర (Rachin Ravindra)ఇండియన్ మూలాలున్న వ్యక్తి కూడా కావడంతో అందరూ ఇదే నిజం అని అనుకున్నారు. కానీ అది నిజం కాదని రచిన్(Rachin Ravindra) తండ్రి రవి క్రిష్ణమూర్తి రీసెంట్ గా మీడియాకు వివరించారు. రచిన్ (Rachin Ravindra) పుట్టిన సమయంలో తాము పేరు గురించి ఇలా ఆలోచించలేదని తెలిపాడు. సచిన్, రాహుల్ పేర్లను కలిపి రచిన్ అని అతడికి నామకరణం చేయలేదని క్రిష్ణమూర్తి(Krishna Murty) వెల్లడించాడు. కానీ ఇప్పుడు అందరూ అలా అనుకోవడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తుందని తెలిపాడు. రచిన్ (Rachin Ravindra) కుటుంబం ఇండియాలోనే ఉండేది. కానీ వాళ్లు చాలా రోజుల క్రితం అక్కడికి వెళ్లి స్థిరపడ్డారు. దీంతో రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తరఫున ఆడుతున్నాడు.   

ఆ పేరును నా భార్య సూచించింది.. 

రచిన్ (Rachin Ravindra) పుట్టినపుడు ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తున్నపుడు ఆ పేరును తన భార్య (Wife) సూచించిందని రచిన్ తండ్రి క్రిష్ణమూర్తి పేర్కొన్నాడు. ఆ పేరు బాగుంది మరియు ఉచ్చరించడం కూడా  సులభం అనే ఉద్దేశంతోనే ఆ పేరును పెట్టినట్లు ఆయన వెల్లడించారు. అంతే కానీ అందరూ అనుకున్నట్లు సచిన్, రాహుల్ ల పేరు మీద రచిన్ అని నామకరణం చేయలేదని వెల్లడించాడు. కానీ ఇప్పుడు రచిన్ రవీంద్ర మాత్రం సచిన్ (Sachin) రికార్డులను కూడా కొల్లగొడుతున్నాడు. 

అర్హత సాధించిందే రచిన్ వల్ల.. 

రచిన్ రవీంద్ర (Rachin Ravindra) ఈ టోర్నీలో దుమ్మురేపుతున్నాడు. అతడు ఇప్పటికే  500+ పరుగులు చేశాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు(Highest Runs) చేసిన మూడో వ్యక్తిగా అతడు కొనసాగుతున్నాడు. ఈ లిస్టులో ఉన్న విరాట్ కోహ్లీకి టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. రచిన్ కేవలం బ్యాటింగ్ మాత్రమే కాకుండా బౌలింగ్ లో కూడా రాణిస్తున్నాడు. స్పిన్ బౌలింగ్ (Spin Bowling) వేస్తూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు. అతడి వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. అత్యంత పిన్న వయసులో వరల్డ్ కప్ లో ఇలా ఈ విధంగా 500+ రన్స్ కొట్టిన వారిలో రచిన్ (Rachin Ravindra) మొదటి స్థానం కైవసం చేసుకున్నాడు. ఇక న్యూజిలాండ్ సెమీస్ కు వస్తుందా? రాదా? అని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. అతడే శ్రీలంక మీద 42 పరుగులు చేసి జట్టును సెమీస్ చేర్చాడు.  ఈ రోజు జరిగే సెమీఫైనల్లో రచిన్ రాణించాలని న్యూజిలాండ్ క్రికెట్ అభిమానులు కోరుకుంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. 

బంతితో కూడా.. 

రచిన్(Rachin Ravindra) కేవలం బ్యాట్ తోనే కాకుండా బంతితో కూడా ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు. అతడు స్పిన్ బౌలింగ్ వేస్తూ కెప్టెన్ (Captain) కు అదనపు వనరుగా మారుతున్నాడు. ఒక నిఖార్సైన ఆల్ రౌండర్ ఎలా ఉండాలో అలా రచిన్ దూసుకుపోతున్నాడు. కివీస్ జట్టు నేడు సెమీస్ కు చేరిందంటే అందులో రచిన్ ది కీలకపాత్ర అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు వెలకట్టలేని ఆస్తి అని మాజీలు చెబుతున్నారు. కేవలం న్యూజిలాండ్ క్రికెట్ కు చెందిన మాజీలు మాత్రమే కాకుండా అనేక మంది రచిన్ రవీంద్రను కొనియాడుతున్నారు. అతడు న్యూజిలాండ్ క్రికెట్ కు దొరికిన ఆస్తి అని అంటున్నారు. అటువంటి ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ కు ఎంతైనా ఉందని క్రికెట్ ఫ్యాన్స్ (Fans) అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.