Suryakumar: 222 పరుగుల టార్గెట్‌ను కాపాడేందుకు మా ప్లాన్‌ అదే: సూర్య కుమార్‌

కానీ విఫలమైంది

Courtesy: Twitter

Share:

Suryakumar: మ్యాక్స్‌వెల్(Maxwell) సుడిగాలి ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను భారత్‌ నుంచి లాగేసుకున్నాడు. అతను దూకుడుగా ఆడటంతో తమ ప్రణాళికలన్నీ వృథాగా మారిపోయానని టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్యకుమార్‌(Suryakumar) తెలిపాడు. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్-ఆసీస్‌ (IND vs AUS) జట్లు 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే ఆసీస్‌పై టీ20 సిరీస్‌(IND vs AUS)ను నెగ్గేద్దామని భావించిన టీమ్‌ఇండియా(Team India) ఆశలకు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) రూపంలో బ్రేకులు పడ్డాయి. భారత్‌ (India) నిర్దేశించిన 223 పరుగుల లక్ష్యఛేదనలో అద్భుత శతకంతో మ్యాక్సీ ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చాడు. మ్యాక్స్‌వెల్ దూకుడుగా ఆడటంతో తమ ప్రణాళికలన్నీ వృథాగా మారిపోయానని టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్యకుమార్‌ తెలిపాడు. మ్యాక్స్‌వెల్(Glenn Maxwell) కేవలం 47 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. దీంతో అత్యంత వేగవంతమైన శతకం బాదిన ఆసీస్‌ బ్యాటర్ల జాబితాలో ఆరోన్‌ ఫించ్‌, జోష్ ఇంగ్లిస్‌తో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.

‘‘మ్యాక్స్‌వెల్ (Maxwell) మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకొన్నాడు. మా ప్రణాళికలన్నీ వృథా అయ్యాయి. మ్యాక్సీని త్వరగా పెవిలియన్‌కు పంపాలని భావించాం. 222 పరుగులను కాపాడుకోవడంలో మంచు ప్రభావం కూడా కీలకంగా మారింది. బౌలర్లకు సరైన పట్టు లభించలేదు. తిరువనంతపురం (Thiruvananthapuram) మ్యాచ్‌ గుర్తుకొచ్చింది. కానీ, అప్పుడు ఆసీస్‌ బ్యాటర్లను త్వరగా ఔట్‌ చేయడంతో మ్యాచ్‌పై పట్టు సాధించాం. ఈసారి అది సాధ్యం కాలేదు. చేతిలో వికెట్లు ఉండటంతో వారికీ మ్యాచ్‌ను గెలిచే అవకాశాలు మెరుగ్గు ఉన్నట్లే. డ్రింక్స్‌ బ్రేక్‌లోనూ మా బౌలర్లకు ఒకటే చెప్పా. మ్యాక్స్‌వెల్‌ను (Maxwell) (Maxwell) త్వరగా ఔట్ చేస్తేనే మ్యాచ్‌ మనం గెలుస్తాం. అందుకోసమే ప్రయత్నించాలని సూచించా’’ అని సూర్య తెలిపాడు.

‘‘కీలక సమయంలో అక్షర్‌ పటేల్‌కు (Akshar Patel) 19వ ఓవర్‌ ఇచ్చా. అప్పటికే మంచు ప్రభావం తీవ్రంగా ఉంది. స్పిన్నర్‌కైతే బంతిపై పట్టు చిక్కే అవకాశం ఉంటుందని అనిపించింది. అంతేకాకుండా అక్షర్‌ పటేల్‌కు(Akshar Patel) గతంలో 19, 20వ ఓవర్‌ వేసిన అనుభవం ఉంది. అందుకే అతడి వైపు మొగ్గు చూపా. అద్భుతంగా బ్యాటింగ్ చేశాం. మరీ ముఖ్యంగా రుతురాజ్‌ గైక్వాడ్ (Ruthuraj Gaikwad) నుంచి సూపర్‌ ఇన్నింగ్స్‌ వచ్చింది. నేను ఔటైన తర్వాత పరుగులు వేగం మరింత పెరగడానికి కారణం రుతురాజే. ఫ్రాంచైజీ క్రికెట్‌ సందర్భంగా నేనెప్పుడూ ఒక విషయం చెబుతుంటా. రుతురాజ్‌ గైక్వాడ్(Ruthuraj Gaikwad) స్పెషల్‌ ప్లేయర్. అతడు బ్యాటింగ్‌ చేసే తీరు విభిన్నంగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో మరోసారి దానిని చూశాం’’ అని సూర్యకుమార్‌ వెల్లడించాడు.

టీమ్‌ఇండియాకు (Team India) విలన్‌ మ్యాక్స్‌వెలే. చెలరేగి ఆడిన అతడు దాదాపు ఒంటి చేత్తో మ్యాచ్‌ను లాగేశాడు. ఇతర బ్యాటర్లను అడ్డుకున్నా.. అతడినొక్కడిని నియంత్రించలేక గువాహటిలో భారత జట్టు దెబ్బతింది. ఛేదనలో ఆసీస్‌కు మెరుపు ఆరంభమే లభించింది. హెడ్‌ చెలరేగడంతో నాలుగు ఓవర్లలోనే స్కోరు 46. కానీ 22 పరుగుల వ్యవధిలో.. హెడ్‌ వికెట్‌ సహా మూడు వికెట్లు పడగొట్టి భారత్‌ పుంజుకుంది. అయితే ఆసీస్‌ను ఒత్తిడి నుంచి బయటపడేస్తూ భారత బౌలర్లపై మ్యాక్స్‌వెల్‌(Maxwell) ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. స్పిన్నర్లు అక్షర్‌, బిష్ణోయ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో స్టాయినిస్‌ పరుగులు చేయడానికి కష్టపడ్డా.. మ్యాక్స్‌వెల్‌(Maxwell) దూకుడు కొనసాగించాడు. 13వ ఓవర్లో స్కోరు 128/3. ఆసీస్‌కు అందుబాటులోనే లక్ష్యం. కానీ 8 పరుగుల తేడాలో స్టాయినిస్‌ (17)ను అక్షర్‌, డేవిడ్‌ (0)ను బిష్ణోయ్‌ ఔట్‌ చేయడంతో భారత్‌ ఊపిరిపీల్చుకుంది. కానీ అది కొద్దిసేపే. వేడ్‌ సహకారంతో మ్యాక్స్‌వెల్‌ జోరు కొనసాగించడంతో ఆసీస్‌ లక్ష్యం దిశగా సాగింది. పేసర్లు అర్ష్‌దీప్‌(Arshdeep), అవేష్‌ (Avesh) భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

మ్యాక్స్‌వెల్‌ (Maxwell) అంత ఊపులో ఉన్న దశలోనూ ప్రసిద్ధ్‌(Prasiddh Krishna) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆరు పరుగులే ఇచ్చి ఆకట్టుకున్నాడు. ఆసీస్‌ చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు చేయాల్సిన పరిస్థితి. భారత్‌కే మంచి అవకాశాలు ఉన్నాయప్పుడు. కానీ గతి తప్పిన బౌలర్లు పేలవ బౌలింగ్‌తో తేలిపోవడంతో మ్యాచ్‌ చేజారిపోయింది. వేడ్‌ రెండు ఫోర్లు, సిక్స్‌ బాదడం, 4 బైస్‌ రావడంతో 19వ ఓవర్లో అక్షర్‌ 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖరి ఓవర్లో ప్రసిద్ధ్‌ కాస్తయినా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయలేకపోయాడు. వేడ్‌ ఓ ఫోర్‌ కొట్టి, సింగిల్‌ తీయగా.. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్‌ (Maxwell) అలవోకగా రెచ్చిపోయాడు. వరుసగా 6, 4, 4, 4తో ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు.