Babar Azam: రిజైన్ చేసిన పాకిస్తాన్ క్రికెట్ ఆటగాడు బాబర్

బౌలింగ్ కోచ్‌లుగా మరో ఇద్దరు ఆటగాళ్లు..

Courtesy: Twitter

Share:

Babar Azam: పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ టీం కెప్టెన్ (Captain) బాబర్ ఆజం (Babar Azam), కెప్టెన్ (Captain)సీకి రాజీనామా అనంతరం, పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ ఆటగాడు షాన్ మసూద్‌ను టెస్ట్ కెప్టెన్ (Captain)‌గా నియమించడం జరిగింది. మరోవైపు షహీన్ అఫ్రిది T20 జట్టుకు కెప్టెన్ (Captain)‌గా నియమితుడయ్యాడు, మాజీ కెప్టెన్ (Captain) మహ్మద్ హఫీజ్ జట్టు డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. అంతేకాకుండా  సంబంధించి ఆస్ట్రేలియాలో జరగనున్న టెస్ట్ మ్యాచ్ల కోసం, న్యూజిలాండ్‌లో జరగబోయే T20I ప్రధాన కోచ్‌గా కూడా వ్యవహరించనున్నాడు.. మరో ఇద్దరు పాకిస్తాన్ (Pakistan) జట్టుకు బౌలింగ్ కోచ్‌లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. 

పాకిస్తాన్ జట్టు కోచ్‌లు: 

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జాతీయ జట్టుకు బౌలింగ్ కోచ్‌లుగా మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు ఉమర్ గుల్, సయీద్ అజ్మల్‌లను నియమించింది. గుల్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా, అజ్మల్ స్పిన్ బౌలర్లను నిర్వహిస్తాడు. న్యూజిలాండ్‌లో ఐదు T20Iల తర్వాత మూడు టెస్ట్ మ్యాచ్‌ల కోసం, ఈ ఇద్దరి బౌలింగ్ కోచ్‌లు  జట్టుతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్ళనున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో, స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన పాకిస్తాన్ (Pakistan) వైట్-బాల్ సిరీస్‌లో గుల్ కోచ్‌గా ఉన్నారు. అతను గత సీజన్‌లో పాకిస్తాన్ (Pakistan) సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు కోచ్‌గా కూడా పనిచేశాడు. 

2022లో చివరి T20 ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. గుల్ 2003-16 మధ్య 47 టెస్ట్ మ్యాచ్‌లు, 130 ODIలు, అంతేకాకుండా 60 T20లలో పాకిస్తాన్ (Pakistan)‌కు ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు అజ్మల్ అన్ని ఫార్మాట్లలో కలిపి 447 అంతర్జాతీయ వికెట్లు సాధించాడు. మాజీ నెం. 1 ODI బౌలర్, అజ్మల్ పాకిస్తాన్ (Pakistan) తరపున 35 టెస్ట్ మ్యాచ్‌లు, 113 ODIలు, అంతే కాకుండా 64 T20లు ఆడాడు. అతని 'దూస్రా' ట్రిక్ అనేది చాలా పాపులర్. నిజానికి ఇది ఆఫ్ స్పిన్నర్ బాలింగ్ డెలివరీ.

10 జట్ల టోర్నమెంట్‌లో పాకిస్థాన్ ఐదో స్థానంలో నిలిచి భారత్‌లో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ నుండి ముందుగానే బయటికి వెళ్లిపోయింది. పిసిబి చేసిన కొత్త మార్పులలో గుల్ మరియు అజ్మల్ కూడా ఉన్నారు. కెప్టెన్ (Captain) బాబర్ ఆజం (Babar Azam) అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేయగా, ప్రస్తుతం షాన్ మసూద్‌ను టెస్ట్ కెప్టెన్ (Captain)‌గా ఇవి వ్యవహరిస్తున్నారు. 

డిసెంబర్ 14 నుండి పెర్త్‌లో ప్రారంభమయ్యే మొదటి టెస్ట్‌లో పాకిస్తాన్ (Pakistan) ఆస్ట్రేలియాతో ఆడుతుంది. డిసెంబర్ 26 నుండి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్ట్‌కు మెల్‌బోర్న్ ఆతిథ్యం ఇస్తుంది, జనవరి 3-7 వరకు సిడ్నీ చివరి టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుంది. 

మాజీ కెప్టెన్ మీద విమర్శలు: 

జరిగిపోయిన క్రికెట్ (Cricket) ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌ (Match)లో పాకిస్తాన్ (Pakistan) భారత్‌తో తలబడి విజయాన్ని సాధించలేకపోయింది. పాకిస్థాన్ అభిమానులు తమ జట్టు ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేని సందర్భంలో, వారి కెప్టెన్ (Captain) బాబర్ ఆజం (Babar Azam), భారత ఆటగాడు విరాట్ కోహ్లీ(Kohli) కలిసి, క్రికెట్ (Cricket) గ్రౌండ్ లో కనిపించిన ఒక విజువల్స్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కోహ్లి బాబర్ ఆజం (Babar Azam)‌కు రెండు టీమ్ ఇండియా షర్టులను ఇవ్వడాన్ని చూసి పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ (Wasim Akram) తనదైన శైలిలో స్పందించడం జరిగింది.

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ప్రకారం, బాబర్ ఆజం (Babar Azam) నిజానికి క్రికెట్ (Cricket) మైదానంలో, కెమెరాల ముందు, ప్రపంచవ్యాప్తంగా టెలికాస్ట్ అవుతున్న టెలివిజన్ సెట్‌లలో పదేపదే ప్లే అవుతున్న విజువల్స్ లో,కోహ్లీ(Kohli) నుంచి టీ-షర్టులు తీసుకోడాన్ని అక్రమ్ విమర్శించారు. ఒకవేళ బాబర్ ఆజం (Babar Azam) కోహ్లీ(Kohli)ని షర్టులు అడగాల్సి వచ్చినా, అది కెమెరాలకు దూరంగా, డ్రెస్సింగ్ రూమ్‌లో చేసి ఉండాల్సిందని అక్రమ్ అన్నాడు. అంతేకాకుండా, ఒకవేళ నిజానికి మీ అంకుల్ వాళ్ళ కొడుకు విరాట్ కోహ్లీ(Kohli) షర్ట్ కావాలంటే.. డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి విరాట్ కోహ్లీ(Kohli)ని అడిగితే సరిపోయేది అని, ప్రపంచావ్యాప్తంగా టెలికాస్ట్ అవుతున్న క్రికెట్ (Cricket) మ్యాచ్ గ్రౌండ్ లో, ఇలా విరాట్ కోహ్లీ(Kohli) దగ్గర నుంచి టీ షర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు వసీం అక్రమ్ (Wasim Akram).