Ravichandran Ashwin: ఆస్ట్రేలియా ఫస్ట్ బౌలింగ్ చేయడానికి కారణం అదే

ప్రపంచకప్ అనుభవాలు పంచుకున్న అశ్విన్..

Courtesy: Twitter

Share:

Ravichandran Ashwin: ప్రపంచకప్(World Cup) ముగిసి నాలుగురోజులు దాటింది. కానీ వరల్డ్ కప్ మీద విశ్లేషణలు, కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. తాజాగా టీమిండియా(Team India) వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin).. ప్రపంచకప్(World Cup) తాలూకూ అనుభవాలను పంచుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ రోజు ఆస్ట్రేలియా(Australia) తొలుత ఎందుకు బౌలింగ్(Bowling) చేసిందో కూడా వివరించాడు. టీమిండియా ఓడిపోయిన నాటి ఫైనల్ తాలూకు అనుభవాలను యూట్యూబ్ వేదికగా అశ్విన్ వెల్లడించాడు.

వన్డే ప్రపంచకప్(World Cup) వరుస విజయాలతో టీమిండియా(Team India) సాగించిన జైత్రయాత్రకు ఫైనల్‌లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో ఎదురైన ఓటమితో బ్రేక్ పడింది. వరుసగా పది మ్యాచ్‌లలో విజయాలు సాధించి ఫైనల్ చేరిన టీమిండియా(Team India).. ఆసీస్ చేతిలో ఓడి ప్రపంచకప్‌ను పోగొట్టుకుంది. అయితే ఇదే టోర్నీలో ఆస్ట్రేలియాతో(Australia) జరిగిన ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. చెన్నైవేదికగా జరిగిన మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టి టోర్నీలో శుభారంభం చేసింది. నాటి మ్యాచ్‌లో ఆడిన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin).. ఆ తర్వాత రిజర్వ్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు.

ప్రపంచకప్‌లో(World Cup) భాగంగా టీమిండియా తర్వాత ఆడిన 10 మ్యాచ్‌లకు అశ్విన్‌కు(Ravichandran Ashwin) స్థానం దక్కలేదు. అక్షర్ పటేల్ గాయపడటంతో ప్రపంచకప్(World Cup) జట్టులోకి ఆఖరి సమయంలో ఎంట్రీ ఇచ్చిన అశ్విన్.. కేవలం మొదటి మ్యాచ్‌కే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రపంచకప్ అనుభవాలను అశ్విన్ పంచుకున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్‌లో ఏం జరిగిందీ వివరించాడు. ఆస్ట్రేలియా(Australia) వ్యూహాలను, వాటిని ఎలా అమలుచేసిందీ వివరించాడు.

2023 వన్డే ప్రపంచకప్‌లో(World Cup) తన ప్రయాణం ఒకే మ్యాచ్‌తో ముగిసిపోతుందని తాను ఊహించలేదని అశ్విన్ వెల్లడించాడు. తాను మంచి రిథమ్‌లో బౌలింగ్ చేసేవాడినన్న అశ్విన్.. కానీ జట్టు అవసరాల మేరకు తనకు స్థానం దక్కలేదన్నాడు. ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా అమలు చేసిన వ్యూహాలు తనను ఆశ్చర్యపరిచాయని రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాను(Australia) అద్భుతంగా నడిపించాడని కొనియాడాడు.

బౌలింగ్‌లో ప్యాట్ కమిన్స్(Pat Cummins) అద్భుతమైన స్పెల్ వేశాడన్న అశ్విన్.. కోహ్లి, అయ్యర్‌లను వెనక్కి పంపి కోలుకోలేని దెబ్బతీశాడని వివరించాడు. టోర్నీలో అప్పటి వరకూ సరిగా రాణించకపోయినా.. ఆఖరి నాలుగు మ్యాచ్‌లలో కమిన్స్ అద్భుతంగా పుంజుకున్నాడని చెప్పాడు. ఫైనల్‌లో(final) కమిన్స్ బౌలింగ్ చేసిన తీరును మెచ్చుకున్నాడు.

"ప్రపంచకప్(World Cup)  ఫైనల్ కమిన్స్ మాస్టర్ క్లాస్ వ్యూహాలకు ఓ నిదర్శనం. నలుగురు నుంచి ఐదు మంది ఫీల్డర్లను మోహరించి.. అతను ఆఫ్ స్పిన్నర్‌లా బౌలింగ్ చేశాడు. స్టంప్ లైన్ హిట్ చేస్తూ ఆఫ్ కట్టర్లు వేశాడు. స్టంప్ లైన్ దిశగా ఆరుమీటర్లలోపే బౌలింగ్(Bowling) చేస్తూ వచ్చాడు. బ్యాటర్లకు డ్రైవ్ షాట్లు ఆడే అవకాశం ఇవ్వలేదు. ఓవర్‌లో మూడు బాల్స్ అలాగే వేశాడు. ఇదే సమయంలో కమిన్స్ బౌలింగ్ చేస్తున్నంత సేపు మిడాఫ్‌లో ఫీల్డర్ కూడా పెట్టుకోలేదు. నిజంగా అతని బౌలింగ్ ఓ మాస్టర్ క్లాస్.. అంటూ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు.

మరోవైపు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆస్ట్రేలియా(Australia) చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీతో జరిగిన సంభాషణ గురించి కూడా అశ్విన్ బయటపెట్టాడు.

" ఆస్ట్రేలియా(Australia) నన్ను పూర్తిగా మోసం చేసింది. ఇన్నింగ్స్ మధ్యలో నేను జార్జ్ బెయిలీ దగ్గరకు వెళ్లా. ఎప్పుడూ ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లుగా ఈసారి ఎందుకు చేయడం లేదని అతణ్ని అడిగా. అతను దానికి ఏం చెప్పాడంటే.. మేము ఇక్కడ చాలా ద్వైపాక్షిక సిరీస్‌లు(Bilateral series) ఆడాం. అలాగే ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ఆడాం. ఎర్రమట్టి పిచ్ అయితే పగుళ్లు వస్తుంది. కానీ నల్లమట్టి అలా కాదు. అలాగే రాత్రివేళ మరింత మంచిగా ఉంటుంది. ఎర్రమట్టి పిచ్ మీద మంచు ప్రభావం ఉండదు. అయితే నల్లమట్టి మీద మధ్యాహ్నం బంతి స్పిన్ తిరుగుతుంది. కానీ రాత్రి సమయానికి అది కాంక్రీట్ మాదిరిగా మారిపోతుంది. ఇదే మా అనుభవం అని చెప్పాడు"..అంటూ అశ్విన్ తన అనుభవాన్ని పంచుకున్నాడు.

ప్రపంచకప్(Australia) ఫైనల్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా(Australia) తొలుత బ్యాటింగ్ తీసుకోగా.. స్లో అండ్ టర్నింగ్ పిచ్ మీద ఇండియన్ బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు. దీంతో 240 పరుగులకే ఆలౌటయ్యారు. అయితే ఆస్ట్రేలియా(Australia) బ్యాటింగ్ చేసే సమయంలో పిచ్ నుంచి బౌలర్లకు పెద్దగా సహకారం లభించలేదు. దీంతో సానుకూలంగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా(Australia) 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.