Shubman Gill: రిటైర్డ్ హర్ట్ ఆఫ్ అయిన తర్వాత గిల్ తిరిగి బ్యాటింగ్‌కి ఎలా వచ్చాడు ..?

రూల్స్ ఏం చెప్తున్నాయ్?

Courtesy: Canva

Share:

Shubman Gill: ఇండియా(India), న్యూజిలాండ్(New Zealand) మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ పోరులో(Semi-Final Battle) అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్(Shubman Gill) మంచి ఊపు మీద ఉన్న సమయంలో రిటైర్డ్ హర్ట్గా(Retired Hurt) వెనుదిరిగాడు. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులతో పాటుగా.. టీవీల ముందు ఉన్న ఫ్యాన్స్ కూడా షాక్ తిన్నారు. అయితే ఆఖర్లో గిల్ మళ్లీ బ్యాటింగ్కు రావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే మైదానాన్ని వీడి బయటకు వెళ్లిన బ్యాటర్.. మళ్లీ బ్యాటింగ్కు రావొచ్చా అనే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీనిపై ఎంసీసీ రూల్స్(MCC Rules) ఏం చెప్తున్నాయంటే..

వన్డే ప్రపంచకప్ 2023లో(World Cup 2023) భాగంగా న్యూజిలాండ్తో(New Zealand) జరుగుతున్న సెమీఫైనల్లో(Semi-Final)అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓపెనర్గా బరిలోకి దిగి హాఫ్ సెంచరీ కొట్టిన ప్రిన్స్ శుభ్మన్ గిల్.. మ్యాచ్మధ్యలోనే రిటైర్ట్ హర్ట్గా(Retired Hurt) వెనుదిరిగాడు. అయితే.. ఆఖర్లో మళ్లీ బ్యాటింగ్కు వచ్చిన గిల్.. 80 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అయితే దూకుడైన ఆటతీరుతో సెంచరీ దిశగా సాగుతున్న గిల్ అర్ధాంతరంగా ఎందుకు మైదానాన్ని వీడాడు.. మళ్లీ ఎందుకు బ్యాటింగ్ వచ్చాడు.. అసలు ఎంసీసీ రూల్స్లో(MCC Rules) ఏముందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మ్యాచ్లో టాస్ గెలిచి ఇండియా(Inida) బ్యాటింగ్ ఎంచుకోగా.. రోహిత్ శర్మ(Rohit Sharma), శుభ్మన్ గిల్(Shubman Gill) ఇండియాకు(India) అదిరే ఆరంభాన్ని అందించారు. క్రమంలోనే 41 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన గిల్.. టోర్నీలో మొదటి సెంచరీ చేసేలా కనిపించాడు. విరాట్కోహ్లితో కలిసి భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు. కానీ ఇన్నింగ్స్ 23 ఓవర్లో గిల్ అర్ధాంతరంగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. తీవ్ర ఉక్కపోత కారణంగా కండరాలు పట్టేయడంతో శుభ్మన్ గిల్(Shubman Gill) తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. వికెట్ల మధ్య పరుగు తీయలేక అవస్థలు పడ్డాడు.

చివరకు టీమ్ ఫిజియో(Team Physio) గ్రౌండ్లోకి వచ్చి గిల్ను పరీక్షించాల్సి వచ్చింది. క్రాంప్స్ కారణంగా పరిగెత్తే పరిస్థితి లేకపోవటంతో ఫిజియో సూచన మేరకు చివరకు శుభ్మన్ గిల్((Shubman Gill)) మైదానాన్ని వీడాడు. మైదానాన్ని వీడే సమయానికి గిల్ ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 65 బంతుల్లోనే 79 పరుగులు చేసి సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. మ్యాచ్లో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో.. శుభ్మన్ గిల్ మైదానాన్ని వీడటంతో ఫ్యాన్స్ కలవరపడ్డారు. మళ్లీ మైదానంలోకి వస్తాడో రాడోనని ఆందోళన చెందారు. అయితే ఇన్నింగ్స్ ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ఔట్ కావటంతో శుభ్మన్ గిల్ మళ్లీ క్రీజులోకి వచ్చాడు . ఆఖరి ఓవర్లో ఒక బాల్ ఆడిన గిల్ 80 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.న్యూజిలాండ్ బ్యాటింగ్ సందర్భంగానూ గిల్ ఫీల్డింగ్కు రావటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఎంసీసీ నిబంధనల ప్రకారం రిటైర్డ్ హర్ట్గా(Retired Hurt)) వెనుదిరిగిన ఆటగాడు తర్వాత ఎప్పుడైనా మళ్లీ బ్యాటింగ్కు రావచ్చు. అయితే వికెట్ పడిన తర్వాతే క్రీజులోకి అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఎంసీసీ రూల్స్లోని 25.4.1 సెక్షన్ ప్రకారం.. బ్యాటర్ తన ఇన్నింగ్స్ సందర్భంగా ఎప్పుడైనా రిటైర్డ్ హర్ట్గా మైదానాన్ని వీడొచ్చు. అయితే అందుకు గల కారణాన్ని అంపైర్కు తెలియజేయాల్సి ఉంటుంది. ఇక ఎంసీసీ రూల్స్లోని 25.4.2 సెక్షన్ ప్రకారం బ్యాటర్.. అనారోగ్యం, లేదా గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్గా(Retired Hurt) వెనుదిరిగితే.. వికెట్ పడిన తర్వాత మళ్లీ వచ్చి ఆటను కొనసాగించే వీలు ఉంటుంది. ఏదైనా కారణంతో ఇది సాధ్యపడకపోతే స్కోరు బోర్డులో అతన్ని రిటైర్డ్ నాటౌట్గా (Retired Not Out) ప్రకటిస్తారు.

టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీస్లో 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై గెలిచింది. కోహ్లి (117; 113 బంతుల్లో 9×4, 2×6), శ్రేయస్అయ్యర్‌ (105; 70 బతుల్లో 4×4, 8×6) శతకాలు బాదడంతో మొదట భారత్‌ 4 వికెట్లకు 397 పరుగుల భారీ స్కోరు సాధించింది. శుభ్మన్గిల్‌ (80 నాటౌట్‌; 66 బంతుల్లో 8×4, 3×6), రోహిత్శర్మ (47; 29 బంతుల్లో 4×4, 4×6), రాహుల్‌ (39 నాటౌట్‌; 20 బంతుల్లో 5×4, 2×6) కూడా అదరగొట్టారు. ‘మ్యాన్ఆఫ్ మ్యాచ్‌’ షమి (7/57) అద్భుతంగా బౌలింగ్చేయడంతో ఛేదనలో కివీస్‌ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ (134; 119 బంతుల్లో 9×4, 7×6), విలియమ్సన్‌ (69; 73 బంతుల్లో 8×4, 1×6) పోరాడారు. టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్ఫైనల్చేరడం ఇది నాలుగోసారి.