CWC Final: ఇండియన్ ఫ్యాన్స్ కు ఫైనల్ రంది..

కారణం అతడే..

Courtesy: twitter

Share:

CWC Final: మరి కొద్ది సేపట్లో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ (CWC Final) మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్  (Match) కోసం కేవలం ఇండియా, ఆస్ట్రేలియా దేశాల క్రికెట్ అభిమానులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ (Cricket) అభిమానులందరూ తయారయ్యారు. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో అని అప్పుడే అంచనాలు (Predictions) వేయడం మొదలుపెట్టారు. టాస్ గెలిస్తే ఏం తీసుకోవాలి, ఏ ప్లేయింగ్ జట్టుతో బరిలోకి దిగాలి. ఎటువంటి మార్పులు (Changes) చేయాలనే విషయం గురించి అనేక సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఫైనల్ (CWC Final) మ్యాచ్ గెలిచి ఇండియాకు కప్పు అందించాలని దేశ వ్యాప్తంగా అభిమానులు పూజలు  చేస్తున్నారు. కానీ ఇటువంటి తరుణంలో ఓ వార్త ఇండియన్ ఫ్యాన్స్ (Indian Fans) ను తెగ కలవరానికి గురి చేస్తుంది. అదే ఫైనల్ (CWC Final) మ్యాచ్ ఎంపైరింగ్. 

మళ్లొచ్చాడర్రా బాబూ.. 

రిచర్డ్ కెటిల్ బరో.. (Richard Kettleborough) ఈ పేరు వింటేనే భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. అంతలా రిచర్డ్ మన ఇండియన్ టీం (Indian Team) ను ఇబ్బంది పెట్టాడు. అతడు కావాలని ఇబ్బంది పెట్టకపోయినా కానీ అతడు ఉన్నాడంటే మాత్రం మనకు ఇబ్బందులు తప్పవనే భావన ఇండియన్ ఫ్యాన్స్ (Indian Fans) అందరిలో ఏర్పడింది. ఇప్పటి వరకు మనం నాకౌట్ మ్యాచెస్ (Knock Out Matches) ఆడినపుడు కనుక రిచర్డ్ ఎంపైరింగ్ చేస్తే ఇండియా ఆ మ్యాచ్ తప్పక ఓడిపోతుందనే అభిప్రాయం అభిమానుల్లో బలంగా పాతుకుపోయింది. మరి నేడు కూడా రిచర్డ్ కెటిల్ బరోనే ఎంపైరింగ్ చేస్తున్నాడు. మరి ఈ పోరులో (CWC Final) అయినా ఇండియా గెలుస్తుందో లేదా సాంప్రదాయ బద్ధంగా కెటిల్ బరో ఎంపైరింగ్ చేశాడు కాబట్టి ఎప్పటిలాగే మనోళ్లు ఓడిపోతారో (Lost) వేచి చూడాలి. 

అనేక సార్లు.. 

రిచర్డ్ కెటిల్ బరో ఎంపైరింగ్ చేసిన నాకౌట్ మ్యాచెస్ లో ఇండియా (India) ఒక్కసారి కాదు…ఇప్పటికే అనేక సార్లు పరాజయం పొందింది. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ (Indian Fans) ఒకటి బలంగా ఫిక్స్ (Fix)  అయిపోయారు. రిచర్డ్ కనుక ఎంపైరింగ్ కు వస్తే ఆ మ్యాచ్ మనం ఓడిపోవడం కామన్ అని వారు బ్లైండ్ గా ఫిక్స్ అయ్యారు. అందుకోసమే ఈ మ్యాచ్ రిజల్ట్ (Result) గురించి కూడా అభిమానులు తీవ్ర బెంగ పెట్టుకున్నారు. ప్రపంచ కప్ 2023 ఫైనల్‌ (CWC Final) కు ఆన్-ఫీల్డ్ ఎంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్‌ వర్త్ మరియు రిచర్డ్ కెటిల్‌ బరోలను నియమించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్ణయం (Decision) తీసుకుంది. ఈ నిర్ణయంతో మన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఊసురుమంటున్నారు. అరే రిచర్డ్ ను అనవసరంగా ఎంపైరింగ్ (Umpiring) కు తీసుకొచ్చారో అని కామెంట్లు చేస్తున్నారు. రిచర్డ్ ది ఇంగ్లండ్ (England). ఇంగ్లండ్ టీమ్ (England Team) ఓడిపోయి ఇంటికి పోయినపుడు రిచర్డ్ కూడా వెళ్తే అయిపోవు అని అతడు ఇంకా ఎందుకు ఇండియాలోనే ఉన్నాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో (Social Media) కామెంట్లు చేస్తున్నారు. అతడు ఎంపైరింగ్ చేసిన 2015 వరల్డ్ కప్, 2014 టీ20, 2015 వరల్డ్ కప్, 2019 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచెస్, 2016 టీ20 వరల్డ్ కప్, 2017 చాంపియన్స్ ట్రోఫీలలో నిర్వహించిన నాకౌట్ మ్యాచ్ లలో ఇండియా ఓడిపోయింది. వీటిల్లో కొన్ని ఫైనల్ మ్యాచెస్ కూడా ఉన్నాయి. మళ్లా ఈ రోజు నాకౌట్ మ్యాచ్ ఫైనల్ కావడం విశేషం. ఈ మ్యాచ్ కు కూడా రిచర్డ్ కెటిల్ బరో ఎంపైర్ గా రావడం యాధృచ్ఛికమో లేక ఇండియా ఓడిపోవాలని రాసి పెట్టి ఉండి ఇలా జరిగిందో అంటూ ఫ్యాన్స్ నిరాశ (Disappoint) చెందుతున్నారు. 

బాధలో ఇండియన్ ఫ్యాన్స్ 

ఇప్పటి వరకు వరల్డ్ కప్ (World Cup) లో ఓటమి అంటూ లేకుండా జైత్రయాత్ర కొనసాగిస్తున్నా కానీ ఫైనల్ మ్యాచ్ లో కెటిల్ బరో ఎంపైరింగ్ అంటూ ఇండియన్ ఫ్యాన్స్ ఘోరంగా భయపడుతున్నారు. ఇన్ని రోజులు ఓటమి లేకుండా విజయం (Win) సాధించాం కానీ ఫైనల్ లో మాత్రం ఏమవుతుందో అని బాధపడుతున్నారు. గతంలో కెటిల్ బరో ఎంపైరింగ్ (Umpiring) చేసినపుడు మనం నాకౌట్ మ్యాచెస్ లో ఓడిన సమయంలో ఇండియన్ ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం. మరి ఈ రోజు మన రోహిత్ సేన ఆ బాధను తీరుస్తుందో మరో సారి ఫ్యాన్స్ ను బాధపెడుతుందో (Sadness) చూడాలి.  

ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. 

రిచర్డ్ కెటిల్ బరోను ఫైనల్ మ్యాచ్ కు ఐసీసీ ఎంపైర్ గా నియమించడంపై ఫ్యాన్స్ ఫైర్ (Fire) అవుతున్నారు. సోషల్ మీడియాలో ఐసీసీతో (ICC) పాటు రిచర్డ్ కెటిల్ బరోను కూడా ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter)  లో ఒక అభిమాని ఇలా కామెంట్ చేశాడు. “హే భగవాన్, ఈ వ్యక్తి ఇంకా భారతదేశంలో ఎందుకు ఉన్నాడు? అతను ఈలోగా ఇంగ్లీష్ టీమ్‌ తో వెళ్లి ఉండాల్సింది కదా? అని అన్నాడు. ఇలా రకరకాల కామెంట్లతో (Comments) అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ రోజు మ్యాచ్ కు రిచర్డ్ కెటిల్ బరో కాకుండా వేరే వ్యక్తి ఎంపైర్ గా వస్తే బాగుండేదని అంతా అనుకుంటున్నారు. అసలే ఆసీస్ (Ausies) మీద మనకు 20 సంవత్సరాల పగ ఉంది. 20 సంవత్సరాల పగను తీర్చుకోవాలని అనుకుంటే ఐసీసీ ఇలా రిచర్డ్ కెటిల్ బరోను ఎంపైర్ గా నియమించింది. ఈ నియామకం ఫ్యాన్స్ ఆశల మీద నీళ్లు చల్లేలానే కనిపిస్తోందని అంతా కామెంట్లు చేస్తున్నారు. మరి కొద్ది సేపట్లో అహ్మదాబాద్ (Ahmedabad) లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ పోరు మొదలు కానుంది. ఫైనల్ పోరు కోసం అహ్మదాబాద్ స్టేడియం ఇప్పటికే ముస్తాబయింది. కేవలం స్టేడియం ముస్తాబవడమే కాదు.. అనేక మంది ప్రముఖులు కూడా ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు అహ్మదాబాద్ కు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఇండియన్ రైల్వేస్ ఈ మ్యాచ్ కోసం పలు స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేసింది. ఫైనల్‌ మ్యాచ్ కు జోయెల్ విల్సన్ థర్డ్ అంపైర్ గా, ఫోర్త్ అంపైర్ గా క్రిస్ గఫానీ మరియు మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్‌  వ్యవహరించనున్నారు. వీరంతా కూడా సెమీ-ఫైనల్‌ మ్యాచెస్ లో అఫిషియేటింగ్ జట్లలో భాగమయ్యారు.