Gautam Gambhir: రోహిత్ అలా చెప్పాల్సింది కాదు..: గంభీర్

ప్రధాన కోచ్‌గా పొడిగింపుపై గంభీర్ వ్యాఖ్యలు

Courtesy: Twitter

Share:

Gautam Gambhir: ఎలాంటి విషయమైనా సూటిగా చెప్పడం టీమ్ఇండియా (Team India) మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్కు(Gautam Gambhir) అలవాటు. ప్రపంచ కప్ ఫైనల్సందర్భంగా రోహిత్ శర్మ (Rohit Sharma) చేసిన వ్యాఖ్యలపైనా.. రాహుల్ద్రవిడ్ (Rahul Dravid) కోచ్గా కొనసాగించాలనే నిర్ణయంపై గంభీర్స్పందించాడు.

ఇంటర్నెట్ డెస్క్‌: రాహుల్ద్రవిడ్ను (Rahul Dravid) ప్రధాన కోచ్గా కొనసాగించడంపై టీమ్ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్గంభీర్ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) భారత్ ఆడిన విధానమే ద్రవిడ్కు తన పదవిలో కొనసాగేందుకు అవకాశం కల్పించిందని గంభీర్ (Gambhir) క్రీడా ఛానెల్లో వ్యాఖ్యానించాడు. అదే విధంగా వరల్డ్కప్ ఫైనల్కు ముందు రోహిత్ చేసిన వ్యాఖ్యలపైనా గంభీర్స్పందించాడు.

‘‘టీమ్ఇండియా (Team India) వరల్డ్కప్‌ (World Cup) ఫైనల్లో ఓడిపోయింది. కానీ, భారత్ ఆడిన తీరు అద్భుతం. రాహుల్ద్రవిడ్‌(Rahul Dravid) పదవి ఆటోమేటిక్గా రెన్యూవల్కావడానికి కారణమదే. ద్రవిడ్ను వద్దు అనడానికి వీల్లేని పరిస్థితి. కేవలం ఒక్క మ్యాచ్లో ఓడిపోయినంత మాత్రాన కోచింగ్పై జడ్జ్చేయడం సరైంది కాదు. ఆటగాళ్లకు ఎలాంటి నియమం వర్తిస్తుందో.. కోచ్కూ అదే వర్తించాలి. ప్రతి ఆటగాడు, కోచ్తమ జట్టు విజయం సాధించాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతారు. కాబట్టి, ద్రవిడ్ను కొనసాగించాలని బీసీసీఐ అనుకోవడం మంచిది. ఇప్పటి వరకు ద్రవిడ్(Rahul Dravid) రెండేళ్ల పదవీకాలం నాకెంతో నచ్చింది. అలాగే అతడు వచ్చే రెండేళ్లూ కొనసాగితేనే బెటర్. తదుపరి వన్డే ప్రపంచ కప్లో రోహిత్, బుమ్రా, షమీ ఆడతారో లేదో తెలియదు. కాబట్టి జట్టును పునర్నిర్మించాలంటే తగినంత సమయం ద్రవిడ్కు(Rahul Dravid) ఇవ్వాలి’’ అని గంభీర్‌ (Gambhir) తెలిపాడు.

‘‘రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కోచింగ్తోపాటు మరొక విషయంపై స్పందించాలనుకుంటున్నా. మేం 2011 ప్రపంచకప్ఆడిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలే వచ్చాయి. ఇప్పుడు ఈసారి వరల్డ్కప్‌(World Cup) సందర్భంగానూ విన్నా. ప్రపంచకప్లేదా ఇతర కప్ఏదైనా సరే ఫలానా వ్యక్తి కోసం గెలిచామని చెప్పడం సరైన పద్ధతి కాదు. ఒకవేళ ఇలాంటివి చెప్పాలనుకుంటే మీడియాతో కాకుండా.. వ్యక్తిగతంగానే చెప్పాలి. అది ఎవరైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. వరల్డ్కప్ను భారత్కోసం గెలుస్తాం. దేశం కోసం మనం గెలుస్తామనేదే నిజం. ఇదే మాటను 2011 సందర్భంగానూ నన్ను అడిగారు. మీరు ఒకరి కోసం ప్రపంచ కప్ను గెలవాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదు నా దేశం కోసం గెలుద్దామని అనుకుంటున్నట్లు చెప్పా. ఎందుకంటే నా దేశం కోసమే నేను బ్యాట్పట్టా. కాబట్టి, రోహిత్ శర్మ(Rohit Sharma) కూడా వ్యక్తి (రాహుల్ద్రవిడ్ను ఉద్దేశించి) కోసం ప్రపంచ కప్గెలుద్దామని అనుకుంటున్నట్లు చేసిన వ్యాఖ్యలు నాకు నచ్చలేదు. అలాంటివి చేయకుండా ఉంటే బాగుండేది’’ అని గంభీర్‌ (Gambhir) వ్యాఖ్యానించాడు.

వన్డే ప్రపంచ కప్ఫైనల్కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రెస్కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. ‘‘క్లిష్ట సమయాల్లో ఆటగాళ్లకు మద్దతుగా నిలిచేందుకు కోచ్రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ఎల్లవేళలా ముందుంటాడు. గతేడాది టీ20 ప్రపంచ కప్నే తీసుకుంటే చాలా మంది ప్లేయర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. సెమీస్‌ (Semis) వరకు అద్భుత ఆటతీరును ప్రదర్శించాం. కానీ, కీలక సమయంలో ఓటమిపాలయ్యాం. అప్పుడు మాలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఎంతో కష్టపడ్డాడు. ఇలాంటి మెగా టోర్నీలో ఫైనల్కు చేరుకోవడానికి కోచ్గా అతడి కృషి వర్ణించలేం. తప్పకుండా అతడి కోసమైనా మేం విజయం సాధించాలి’’ అని రోహిత్ శర్మ (Rohit Sharma) తెలిపాడు. వ్యాఖ్యలపై తాజాగా గంభీర్‌ (Gambhir) కాస్త అసహనం వ్యక్తం చేశాడు. 2011 వరల్డ్కప్సందర్భంగానూ పలువురు ఆటగాళ్లు సచిన్కోసం ఈసారి గెలుస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఎందుకంటే క్రికెట్దేవుడికి అదే చివరి మెగా టోర్నీ.