Muttiah Muralitharan: కోహ్లిలా ఉంటే రోహిత్‌ మరో వరల్డ్‌కప్‌ ఆడటం ఖాయం

మెరుగైన స్ట్రైక్‌రేటుతో అతడి బ్యాటింగ్‌ అమోఘం

Courtesy: Twitter

Share:

Muttiah Muralitharan:రోహిత్ శర్మ (Rohit Sharma) కెరీర్‌పై శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) మాట్లాడాడు. రోహిత్ శర్మకు మరో ప్రపంచకప్‌ ఆడే సత్తా ఉందన్నాడు.

రోహిత్ శర్మ సారథ్యంలో అజేయంగా వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌కు(ODI World Cup Final) చేరుకున్న టీమ్‌ఇండియా(Team India).. చివరి మెట్టుపై బోల్తా పడింది. దీంతో రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రపంచకప్‌ కల నెరవరలేదు. సొంతగడ్డపై తప్పక అందుతుందనుకున్న ట్రోఫీ చేజారడంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) సహా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(Virat Kohli), ఇతర ఆటగాళ్లంతా నిరాశలో కూరుకుపోయారు. 36 ఏళ్ల రోహిత్ 2027 ప్రపంచకప్‌(World Cup) వరకు వన్డేల్లో కొనసాగుతాడో లేదో తెలియని పరిస్థితి. ఇదిలా ఉంటే.. 2024లో టీ20 ప్రపంచకప్‌(T20 World Cup) జరగనుంది. ఈ టోర్నీలోనైనా రోహిత్(Rohit) ఆడతాడా లేదా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 2022 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌లో ఓటమి అనంతరం రోహిత్, కోహ్లీ భారత్ తరఫున ఒక్క టీ20 ఆడలేదు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెరీర్‌పై శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) మాట్లాడాడు. రోహిత్ శర్మకు మరో ప్రపంచకప్‌ ఆడే సత్తా ఉందన్నాడు. విరాట్ కోహ్లీలా(Virat Kohli) ఫిట్‌నెస్ కాపాడుకుంటే 2024 టీ20 ప్రపంచకప్‌లో కచ్చితంగా ఆడతాడని పేర్కొన్నాడు.

‘‘రోహిత్ శర్మ(Rohit Sharma) వన్డే ప్రపంచ కప్(ODI World Cup) ప్రదర్శన అద్భుతంగా ఉంది. మంచి ఆరంభాలు ఇచ్చాడు. మంచి స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. అతను టోర్నమెంట్‌లో ఎప్పుడూ విఫలం కాలేదు. రోహిత్‌కింకా 36 ఏళ్లే. అంటే యువకుడని అర్థం. కోహ్లీలా అతను తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటే మరొక ప్రపంచ కప్ ఆడగలడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతనికెంతో అనుభవం ఉంది. ఏ ఆటగాడైనా 35 ఏళ్ల తర్వాత ఆడాలనుకుంటే ఫిట్‌నెస్‌ను (Fitness) కాపాడుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసి రోహిత్‌ మరో ప్రపంచకప్‌ ఆడటానికి కచ్చితంగా సిద్ధమవుతాడు’’ అని ముత్తయ్య మురళీధరన్ వివరించాడు. 

భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌(Gautam Gambhir) కూడా ఇటీవల రోహిత్ టీ20 కెరీర్‌పై మాట్లాడిన సంగతి తెలిసిందే. హిట్‌మ్యాన్‌ టీ20 ప్రపంచకప్‌లో ఆడాలనే నిర్ణయం తీసుకోవాలని, ఆ వరల్డ్ కప్‌కు(World Cup) రోహిత్‌నే కెప్టెన్‌గా ఎంపిక చేయాలని సూచించాడు. రోహిత్‌కు టీ20ల్లో మంచి రికార్డే ఉంది. ఇప్పటివరకు 148 అంతర్జాతీయ టీ20లు ఆడి 139.25 స్ట్రైక్‌రేట్‌తో 3,853 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 29 అర్ధ సెంచరీలున్నాయి. ఈ ఫార్మాట్‌లో కోహ్లీ (4008) తర్వాత అత్యధిక పరుగులు (3853) చేసిన ఆటగాడిగా ఉన్నాడు.

టీమిండియా సీనియర్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ(Rohit Sharma), విరాట్‌ కోహ్లీ (Virat Kohli) లు చివరి వరల్డ్‌ కప్‌ ఆడేశారా..?  భారత్‌ వేదికగా ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్‌ – 2023 తర్వాత అభిమానుల్లో ఇదే చర్చ సాగుతోంది.  వయసు, ఇతరత్రా కారణాల రీత్యా వీళ్లు 2027లో జరుగబోయే వన్డే ప్రపంచకప్‌ ఆడేది అనుమానమే అయినా  కనీసం వచ్చే టీ20 వరల్డ్‌ కప్‌ వరకైనా ఆడాలని దిగ్గజ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. యువ భారత్‌ను నడిపించేందుకు వీళ్ల అనుభవం కావాలని చెబుతున్నారు.

ఇదే విషయమై వసీం అక్రమ్‌(Wasim Akram) స్పోర్ట్స్‌ కీడాతో మాట్లాడుతూ..‘టీ20 వరల్డ్‌ కప్‌ మరో ఆరేడు నెలలలో మొదలుకానుంది.  నేనైతే ఆ ఇద్దరూ  (రోహిత్‌,  కోహ్లీ) ఈ మెగా టోర్నీ ఆడాలని కోరుకుంటున్నా. భారత జట్టుకు ఇప్పుడు వాళ్లిద్దరూ చాలా కీలకం. పొట్టి క్రికెట్‌లో దూకుడు కంటే అనుభవం కూడా చాలా ప్రధానం. అందరూ యువ ఆటగాళ్లతోనే ఆడితే అది మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది’ అని అన్నాడు.