Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు బెస్ట్ ఫీల్డర్ అవార్డు

టీమ్ ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) మరోసారి బెస్ట్ ఫీల్డర్ అవార్డు(Best Fielder Award) అందుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌(World Cup)లో టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమ ఫీల్డింగ్ కనబర్చిన ఆటగాడికి ‘బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్’(Best Fielder of the Match) అవార్డును అందజేస్తున్న విషయం తెలిసిందే. గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక(Srilanka)పై భారత్ భారీ విజయం సాధించడంతోపాటు సెమీస్‌కు అర్హత సాధించింది.  వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌(World Cup)లో అన్ని విభాగాల్లోనూ టీమ్ఇండియా(Team […]

Share:

టీమ్ ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) మరోసారి బెస్ట్ ఫీల్డర్ అవార్డు(Best Fielder Award) అందుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌(World Cup)లో టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమ ఫీల్డింగ్ కనబర్చిన ఆటగాడికి ‘బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్’(Best Fielder of the Match) అవార్డును అందజేస్తున్న విషయం తెలిసిందే. గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక(Srilanka)పై భారత్ భారీ విజయం సాధించడంతోపాటు సెమీస్‌కు అర్హత సాధించింది. 

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌(World Cup)లో అన్ని విభాగాల్లోనూ టీమ్ఇండియా(Team India) అద‌ర‌గొడుతోంది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. వ‌రుస‌గా ఏడు మ్యాచుల్లోనూ గెలిచి సెమీ ఫైన‌ల్(Semi final) కు చేరుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్ విభాగాల గురించి కాసేపు ప‌క్క‌న బెడితే ఫీల్డింగ్‌లో మెరుపు వేగంతో క‌దులుతున్నారు. క‌ష్ట‌త‌ర‌మైన ఒక‌టి రెండు మిన‌హా దాదాపు అన్ని క్యాచ్‌ల‌ను అందుకున్నారు. ప్ర‌పంచ‌క‌ప్ ముందు వ‌ర‌కు కాస్త పేల‌వంగా ఉన్న భార‌త ఫీల్డింగ్‌, మెగా టోర్నీలో మాత్రం అదుర్స్ అనిపిస్తోంది. దీని వెనుక బెస్ట్ ఫీల్డ‌ర్ మెడ‌ల్(Best Fielder Medal) విధాన‌మే కార‌ణం అని చెప్పొచ్చు.

వన్డే ప్రపంచకప్‌ 2023లోని ప్రతి మ్యాచ్‌లో మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే భారత ఆటగాళ్లకు టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ టి. దిలీప్‌(Dileep) ‘బెస్ట్‌ ఫీల్డర్‌’ మెడల్‌ను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డును రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ గెలుచుకోగా.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ల శ్రేయస్‌ గెలుచుకున్నాడు. రెండు అద్భుత క్యాచ్‌లు అందుకున్నందుకుగాను శ్రేయస్‌ను ఈ అవార్డు వరించింది. శ్రేయస్‌ ఈ అవార్డును గెలుచుకోవడం రెండోసారి. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి బెస్ట్‌ ఫీల్డర్‌ అవార్డు(Best Fielder Award)ను అందుకున్నాడు.

Also Read: Rohit Sharma: యాంక‌ర్ ప్ర‌శ్న‌కు బిత్త‌ర‌పోయిన రోహిత్ శ‌ర్మ‌

ప్రతి మ్యాచ్‌ అనంతరం సరికొత్త రీతిలో బెస్ట్‌ ఫీల్డర్‌ మెడల్‌ విన్నర్‌ను అనౌన్స్‌ చేయించే ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌.. ఈసారి ఓ స్పెషల్‌ పర్సన్‌తో అనౌన్స్‌ చేయించాడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌(Sachin Tendulkar) వీడియో కాల్ ద్వారా శ్రేయస్‌ అయ్యర్‌ను విజేతగా ప్రకటించాడు. ఈ క్ర‌మంలో స‌చిన్ టెండూల్క‌ర్ మాట్లాడుతూ.. 2003 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ అనుభ‌వాల‌ను ప్లేయ‌ర్ల‌తో పంచుకున్నాడు. ఆ స‌మ‌యంలో సాధించిన మ‌రుపురాని విజ‌యాల‌ను గుర్తు చేసుకున్నాడు విరాట్ కోహ్లీ(Virat Kohli), రవీంద్ర జడేజా(Ravindra Jadeja)లను కాదని శ్రేయస్‌ విజేతగా నిలిచాడు. ఇక బెస్ట్‌ ఫీల్డర్‌ మెడల్‌ను ప్రకటించడంతో పాటు అద్భుత విజయం సాధించిన భారత జట్టును సచిన్ అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

భారీ ఛేద‌న‌లో ఆది నుంచి త‌డ‌బడిన కుశాల్ మెండిస్(Kusal Mendis) సేన ష‌మీ, సిరాజ్‌ దెబ్బ‌కు 55 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దాంతో,  శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 302 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ విజయంతో రోహిత్ సేన అధికారికంగా సెమీస్‌ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. గిల్‌ (92), కోహ్లీ (88), శ్రేయస్‌ (82) హాఫ్ సెంచరీలు చేశారు. లంక బౌలర్లలో దిల్షన్‌ మధుశంక 5 వికెట్స్ తీశాడు. ఇప్ప‌టివ‌రకూ ఆడిన ఏడు మ్యాచుల్లో రోహిత్ సేన ఏడింట విజ‌యం సాధించి ఫేవ‌రేట్ ట్యాగ్ నిల‌బెట్టుకుంది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను భారత పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మొహమ్మద్‌ షమీ (5-1-18-5), మొహమ్మద్‌ సిరాజ్‌ (7-2-16-3), జస్ప్రీత్‌ బుమ్రా (5-1-8-1), రవీంద్ర జడేజా (0.4-0-4-1) ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా..14 పరుగులు చేసిన కసున్‌ రజిత టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.