Rohit-Kohli: రోహిత్, కోహ్లీ టీ20 భవిష్యత్‌పై పాకిస్థాన్ లెజెండ్ కీలక వ్యాఖ్యలు

అందరి చూపు టీ20 ప్రపంచకప్ పైనే

Courtesy: Twitter

Share:

Rohit-Kohli: దాదాపు 2 నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన వన్డే ప్రపంచకప్ (World Cup) ముగిసింది. ఇప్పట్లో మరో ప్రపంచకప్ ఏదైనా ఉందంటే అది టీ20 ప్రపంచకప్ మాత్రమే. దీంతో ఇప్పుడు అందరి చూపు జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ (T20 World Cup) పైనే ఉంది. అయితే ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టులో స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆడతారా లేదా అనే దానిపై సందిగ్దత నెలకొంది.

దాదాపు 2 నెలల పాటు క్రికెట్(Cricket) అభిమానులను అలరించిన వన్డే ప్రపంచకప్ (ODI World Cup) ముగిసింది. ఇప్పట్లో మరో ప్రపంచకప్ ఏదైనా ఉందంటే అది టీ20 ప్రపంచకప్ (T20 World Cup) మాత్రమే. దీంతో ఇప్పుడు అందరి చూపు జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ పైనే ఉంది. అయితే ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టులో స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆడతారా లేదా అనే దానిపై సందిగ్దత నెలకొంది. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్ ఆడలేదు. వన్డేలు(ODI), టెస్టులకే(Test) పరిమితం అయ్యారు. గతేడాది నుంచి టీ20 జట్టుకు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రోహిత్(Rohit), కోహ్లీ(Kohli) దుమ్ములేపారు.

రోహిత్(Rohit) అయితే టీ20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. కోహ్లీ ఈ టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. దీంతో రానున్న టీ20 ప్రపంచకప్‌లో వీరిద్దరు కూడా ఆడాలనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కూడా స్పందించాడు. రానున్న టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) రోహిత్, కోహ్లీ కూడా ఆడాలని అభిప్రాయపడ్డాడు.

"టీ20 ప్రపంచకప్‌నకు(T20 World Cup) కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ఈ ప్రపంచకప్‌లో ఆడటానికి నేను రోహిత్, కోహ్లీ ఇద్దరిని ఎంచుకుంటాను. వారు భారత్‌కు ప్రధాన ఆటగాళ్లు అవుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. టీ20లో కాస్త అనుభవం కావాలి. మీరు యువకులపై మాత్రమే ఆధారపడలేరు" అని వసీం అక్రమ్(Wasim Akram) వ్యాఖ్యానించాడు. వసీం అక్రమే కాకుండా మరికొంతమంది మాజీ క్రికెటర్లు కూడా రానున్న టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడితే బాగుటుందని సూచిస్తున్నారు.

అయితే టీ20లు ఆడేది లేనిపై కోహ్లీ, రోహిత్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా వచ్చే ఏడాది జూన్ 4 నుంచి 30 వరకు వెస్టిండీస్, అమెరికా(America) వేదికగా టీ20 ప్రపంచకప్ (T20 World Cup) జరగనుంది. 36 ఏళ్ల రోహిత్ శర్మకు, 35 ఏళ్ల విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్‌లో కావాల్సినంత అనుభవం ఉంది. వీరిద్దరు 100కు పైగా టీ20 మ్యాచ్‌లు ఆడారు. 115 టీ20 మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ 4008 పరుగులు చేయగా.. 148 టీ20లు ఆడిన రోహిత్ శర్మ 3853 పరుగులు చేశాడు.

‘‘సూర్యకుమార్‌ యాదవ్ (Suryakumar Yadav) 360 డిగ్రీల ఆటగాడు. మైదానానికి అన్ని వైపులా షాట్లు కొట్టగలడు. ఇదే బౌలర్ల పాలిట కష్టంగా మారుతుంది. వారు అనుకున్న ప్రణాళిక ప్రకారం బౌలింగ్‌(Bowling) చేయలేరు. కొత్త ప్రదేశాల్లో ఫీల్డింగ్‌ ఉంచాల్సిన పరిస్థితి. పొట్టి ఫార్మాట్‌లో సూర్య చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేస్తాడు. టీ20ల్లో పిచ్‌లు కూడా ఎక్కువగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. అందుకే సూర్యకుమార్‌ యాదవ్(Suryakumar Yadav) డేంజరస్‌ బ్యాటర్‌ అవుతాడు. డీప్‌ ఫైన్‌లెగ్‌ వైపుగా అతడు భారీషాట్లు కొట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. మిడాన్‌లో సర్కిల్‌ లోపలే ఫీల్డర్‌ ఉంటాడు. ఒకవేళ స్లో బంతులను వేద్దామని ప్రయత్నిస్తే.. దానిని కూడా ఫైన్‌ లెగ్‌ వైపు సిక్స్‌గా మలిచే సత్తా ఉంది’’ అని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా (ఆకాశ్ చోప్రా) విశ్లేషించాడు.