Semi-Final: ప్రపంచ పోరులో సెమీస్ చేరేదెవరు?

Semi-Final: వరల్డ్ కప్-2023 (World Cup) లో చాలా మ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి. అయినా కానీ సెమీస్(Semis) బెర్తుల విషయంలో ఇంకా గందరగోళం నెలకొంది. కేవలం రెండంటే రెండు బెర్తులే ఫిల్ అయ్యాయి. మిగతా రెండు బెర్తుల కోసం మరో 6 జట్లు పోటీ పడుతున్నాయి. రెండు టీమ్స్  (Teams)సెమీస్ కు వెళ్లాయి. అలాగే రెండు టీమ్స్ అఫీషియల్ గా రేసు నుంచి నిష్క్రమించాయి (Out).  కాబట్టి ఇంకా మిగతా జట్లు సెమీస్ రేసు కోసం పోటీపడుతున్నాయి. […]

Share:

Semi-Final: వరల్డ్ కప్-2023 (World Cup) లో చాలా మ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి. అయినా కానీ సెమీస్(Semis) బెర్తుల విషయంలో ఇంకా గందరగోళం నెలకొంది. కేవలం రెండంటే రెండు బెర్తులే ఫిల్ అయ్యాయి. మిగతా రెండు బెర్తుల కోసం మరో 6 జట్లు పోటీ పడుతున్నాయి. రెండు టీమ్స్  (Teams)సెమీస్ కు వెళ్లాయి. అలాగే రెండు టీమ్స్ అఫీషియల్ గా రేసు నుంచి నిష్క్రమించాయి (Out).  కాబట్టి ఇంకా మిగతా జట్లు సెమీస్ రేసు కోసం పోటీపడుతున్నాయి. ఈ టోర్నీని మరింత రసవత్తంగా మారుస్తున్నాయి. ఆల్రెడీ రెండు టీమ్స్ సెమీస్ కి, రెండు టీమ్స్ ఎలిమినేట్ అయ్యాయి. కనుక మిగతా ఆరు జట్లకు చాన్సెస్ ఏ విధంగా ఉన్నాయో మీరు కింద చూసి తెలుసుకోండి. 

డిఫెండింగ్ చాంపియన్ అయినా

ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్ (England) డిఫెండింగ్ చాంపియన్. అంతే కాకుండా వన్ ఆఫ్ ద ఫేవరేట్ టీమ్ కూడా. కానీ ఈ టోర్నీలో ఇంగ్లండ్ (England) ప్రదర్శన మరీ పేలవంగా మారింది. ఆడిన అన్ని మ్యాచుల్లో ఓడుతూ తన స్థానానికి తానే ఎసరు పెట్టుకుంది. దీంతో అసలు సెమీస్ సంగతి పక్కన పెడితే తర్వాత ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తుందా? లేదా అనే అనుమానం అందరిలో కలుగుతోంది. ఇంగ్లండ్(England) వంటి అగ్రశ్రేణి జట్టు ఇలా దారుణంగా ఆడడం మాత్రం మరీ ఘోరం. చిన్న జట్టుగా పేరున్న అఫ్ఘనిస్తాన్ చేతిలో ఇంగ్లండ్(England) జట్టు దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక దీంతో ఇంగ్లండ్ ఫ్యాన్స్ గుండెలవిసేలా రోదించారు. 

సఫారీలకు షాకిచ్చిన డచ్ బృందం

సౌతాఫ్రికా (South Africa) ఈ టోర్నీలో ఆల్రెడీ సెమీస్ చేరింది కానీ వారికి పసికూనలు డచ్ (నెదర్లాండ్స్) ఆటగాళ్లు షాకిచ్చారు. అరవీర భయంకర హిట్టర్లున్న సఫారీలను (South Africa) కంగుతినిపించారు. ఏంటి సఫారీలకు కూడా ఇంత చిన్న జట్టులో భంగపాటు తప్పలేదా? అని అందరూ అనుకున్నారు. ఇక ఈ టోర్నీలో సఫారీల పని గోవిందా. అని అనుకుంటుండగా.. సఫారీలు తిరిగి పుంజుకుని సెమీస్ బెర్తును సాధించారు. 

Also Read: World Cup: కివీస్ తో ఓడిపోతే పాక్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుందా?

బుస కొట్టలేకపోయిన ‘నాగినీలు’

ఐసీసీ (ICC) ఈవెంట్లలో పెద్ద జట్లకు అనుకోని షాకులిచ్చే జట్టుగా బంగ్లాదేశ్ (Bangladesh) కు పేరుంది. కానీ ఈ టోర్నీలో మాత్రం బంగ్లా ఆ విషయంలో పూర్తిగా విఫలం అయింది. తమ కంటే చిన్న జట్లయిన అఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్ జట్లు అగ్రశ్రేణి జట్లకు షాకులిస్తుండగా.. బంగ్లాదేశ్ మాత్రం అంచనాలు అందుకోవడం విఫలం అయింది. ఇలా విఫలం అవుతూ.. టోర్నీ నుంచి అఫీషియల్ గా ఎలిమినేట్ అయిన మొదటి జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. 

ఎవరికి ఎలా అంటే.. 

సెమీస్  (Semis)చేరాలని ప్రతి జట్టు భావిస్తుంటుంది. దురదృష్టవశాత్తు కొన్ని జట్లు పోటీ నుంచి ఇప్పటికే ఎలిమినేట్ అయ్యాయి. అసలు ఏ టీమ్ కు అవకాశం ఎలా ఉందో ఓ సారి లుక్కేస్తే.. 

ఇండియా.. 

భారత్ (India) ఇప్పటికే ప్రపంచకప్ సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది.

సౌతాఫ్రికా

సౌతాఫ్రికా(South Africa) కూడా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది

ఆస్ట్రేలియా.. .

తన చివరి మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా కంగారూలకు (Australia) సెమీస్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి. వారు ఇప్పుడు తమ తదుపరి రెండు మ్యాచ్‌ లలో విజయం సాధించాలి. వారు తదుపరి రెండింటినీ ఓడిపోతే ఇక వారు చేసేదేమీ ఉండదు. టోర్నీలో మిగతా జట్ల నెట్ రన్ రేట్ (NRR) మీద ఆధారపడాల్సి వస్తుంది. 

న్యూజిలాండ్.. 

ఒకానొక దశలో టేబుల్ టాపర్ (Points Table) గా కొనసాగిన న్యూజిలాండ్ తర్వాత వరుసగా విఫలమవుతూ అసలు వరల్డ్ కప్ సెమీస్ బెర్తు అవకాశాలనే సంక్లిష్టం చేసుకుంది.  చివరి మ్యాచ్ లో పాక్ తో కూడా ఓడిపోవడంతో వారికి అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. ఇక వారికి మిగిలిన దారి అంటూ ఒక్కటే ఉంది. వారు తమ తదుపరి మ్యాచ్ లో లంకను ఓడించి ఆస్ట్రేలియా, పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ జట్ల ఫలితాలు మరియు నెట్ రన్ రేట్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఒకప్పుడు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న జట్టు ఇప్పుడు సెమీస్ బెర్తు కోసమే కష్టపడడం చూసి ఎవరూ నమ్మలేకపోతున్నారు. కివీస్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) గైర్హాజరవడంతో పాటు అనేక కారణాలు వారికి వరుస ఓటములు తెచ్చిపెడుతున్నాయి.

పాకిస్తాన్

ఇండియాకు దాయాదిగా పాకిస్తాన్ (Pakistan) కు ఎంతో పేరుంది. ఇండియా పాకిస్తాన్(Pakistan) పోరును మరో సారి చూసేందుకు ప్రపంచం మొత్తం సిద్ధంగా ఉంది. కానీ అందుకు అవకాశాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. అఫ్ఘనిస్తాన్ వంటి చిన్న జట్టు చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ తర్వాత పుంజుకుని విజయాలు సాధిస్తోంది.  తన చివరి మ్యాచ్ లో పటిష్టంగా కనిపిస్తున్న న్యూజిలాండ్ ను మట్టికరిపించింది. ఈ గెలుపుతో పాక్ సెమీస్ బెర్తు అవకాశాలు మరింత మెరుగుపడ్డాయి. న్యూజిలాండ్‌ పై భారీ విజయం పాకిస్తాన్ సెమీ-ఫైనల్‌ కు అర్హత సాధించే అవకాశాలను పెంచింది. అయినా కానీ వారి నెట్ రన్ రేట్ (NRR) ఏమంత ఇంక్రీస్ కాలేదు. వారి నెట్ రన్ రేట్ మెరుగుపడేదేమో కానీ వరణుడు వారి అవకాశాలను దెబ్బతీశాడు. ఇక ఈ విజయంతో న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్‌ లతో సమానంగా పాకిస్థాన్‌ కు కూడా 8 పాయింట్లు వచ్చి చేరాయి. అయినా వారు మాత్రం సెమీస్ చేరాలంటే తర్వాత ఆడబోయే ఇంగ్లండ్ ను భారీ తేడాతో ఓడించాలి. అంతే కాకుండా ఇతర జట్ల ఫలితాల మీద వారి నెట్ రన్ రేట్ మీద ఆధారపడాలి. 

అఫ్ఘనిస్తాన్

పసికూనగా పిలవబడే అఫ్ఘనిస్తాన్ (Afghanistan) జట్టు ఈ టోర్నీలో ఇంగ్లండ్ (England), పాకిస్తాన్ (Pakistan) వంటి పెద్ద జట్లకు ఊహించని షాకులిచ్చింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ను కూడా అఫ్ఘన్ జట్టు తన స్పిన్ మాయాజాలంతో ఓడించింది. అంతే కాకుండా మాజీ చాంపియన్స్ అయిన పాకిస్తాన్ కు కూడా షాకిచ్చింది. ఇలా పెద్ద జట్లుకు షాకులిచ్చే అఫ్ఘన్ జట్టు సెమీస్ రేసులో నిలిచింది. ఇక అఫ్ఘనిస్తాన్ కు తదుపరి రెండు మ్యాచ్ లు పెద్ద జట్లతోనే ఉన్నాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి జట్లతో అఫ్ఘన్లు అమీ తుమీ తేల్చుకోనున్నారు. 

శ్రీలంక

శ్రీలంక (Sri Lanka) భారత్‌తో 302 పరుగుల భారీ ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి వారి సెమీస్ అవకాశాలకు భారీగా గండికొట్టింది. అయితే చూసుకుంటే లంక ఇప్పటికి కూడా సెమీస్ బెర్తును కన్ఫామ్ చేసుకోగలదు. లంక బంగ్లాదేశ్ మరియు న్యూజిలాండ్‌ లపై తమ మిగిలిన రెండు గేమ్‌లను గెలవడం ద్వారా గరిష్టంగా 8 పాయింట్లకు చేరుకునే చాన్స్ ఉంది. ఈ రెండు మ్యాచుల్లో లంకేయులు గెలవడంతో పాటు మిగతా జట్లు ఓడిపోతేనే వారు సెమీస్ కు చేరుకుంటారు. 

నెదర్లాండ్స్ 

నెదర్లాండ్స్ (Netherlands) ఆటగాళ్లు సెమీస్ కు చేరుకునే అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నా కానీ ఈ టోర్నీ వారికి ఎప్పటికీ గుర్తుండి పోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వారు పటిష్ట సౌతాఫ్రికాకు అనుకోని షాక్ ఇచ్చారు. వారు ప్రస్తుతం 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఉన్నారు. వారు సెమీస్ బెర్తుకు చేరుకోవాలంటే తమకు మిగిలి ఉన్న గేమ్స్ లలో భారీ తేడాతో విజయం సాధించాలి. అది మాత్రమే కాకుండా మిగతా జట్లు ఓడిపోవాలని నెదర్లాండ్స్ వాసులు కోరుకోవాలి.

బంగ్లాదేశ్.. 

బంగ్లా టైగర్స్ సెమీఫైనల్‌ కు అర్హత సాధించలేకపోయారు. అయితే వారు ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కించుకునేందుకు టాప్ 7లో నిలిచేందుకు పోరాడాలని భావిస్తున్నారు.

ఇంగ్లండ్

శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 33 పరుగుల తేడాతో ఓడి టోర్నీ రేసు నుంచి నిష్క్రమించింది.