Nawaz Modi: గౌతమ్ సింఘానియాపై భార్య సంచలన ఆరోపణలు..

ఆ రోజు అంబానీలే కాపాడారు

Courtesy: Twitter

Share:

Nawaz Modi: ప్రముఖ బిలియనీర్, రేమండ్(Raymond) గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా (Gautam Singhania) కొద్ది రోజుల కిందట తన భార్య నవాజ్ మోదీకి (Nawaz Modi) విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తొలిసారిగా మాట్లాడారు నవాజ్. గౌతమ్ సింఘానియా(Gautam Singhania) తనను దారుణంగా హింసించాడని తీవ్ర ఆరోపణలు చేశారు.

దిగ్గజ వ్యాపారవేత్త, రేమండ్స్ గ్రూప్ ఛైర్మన్ అండ్ ఎండీ గౌతమ్ సింఘానియా(Gautam Singhania).. తన భార్య నుంచి విడిపోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. 32 ఏళ్ల తమ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పారు. అయితే క్రమంలో తాజాగా గౌతమ్ భార్య నవాజ్ మోదీ (Nawaz Modi).. సంచలన ఆరోపణలు చేశారు. సింఘానియా తనను శారీరకంగా హింసించినట్లు, సమయంలో అంబానీలు(Amabani) వచ్చి కాపాడారంటూ నేషనల్ మీడియాకు వెల్లడించారు. తనను దీపావళి పార్టీకి (Dipawali Party) అనుమతించలేదని కూడా చెప్పారు. ఇంకా ఆమె ఏమేం మాట్లాడారో చూద్దాం.

'తొలుత సెప్టెంబర్ 10 ఉదయం మా మైనర్ కుమార్తెపై, నాపై గౌతమ్(Gautam Singhania). తీవ్ర దాడి చేశారు. 15 నిమిషాలు కనికరం లేకుండా కొట్టారు. సెప్టెంబర్ 9 ఆయన పుట్టినరోజు వేడుకల తెల్లవారు జామున ఘటన జరిగింది. మా ఇద్దరు పిల్లలు, వారి స్నేహితులు కూడా అక్కడే ఉన్నారు. మాపై దాడి చేసిన తర్వాత ఆయన అక్మడినుంచి అకస్మాత్తుగా వెళ్లిపోయారు. ఆయన గన్ లేదా వేరే ఆయుధాలు తెచ్చేందుకు వెళ్లాడనిపించింది. వెంటనే నేను నా కుమార్తె ప్రాణాలు కాపాడాలని ఒక గదిలోకి తీసుకెళ్లి లాక్ చేసేశా.' అని వివరించారు నవాజ్(Nawaz Modi).

రెండుసార్లు హెర్నియా సర్జరీలు జరిగాయని తెలిసినా గౌతమ్(Gautam Singhania) తనపై దాడి చేసినట్లు చెప్పుకొచ్చారు నవాజ్ మోదీ(Nawaz Modi). తనతో పాటు తన కుమార్తె ఒకరినొకరం కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు వెల్లడించారు. 'నేను నా స్నేహితురాలు అనన్య గోయెంకాకు(Ananya Goenka) ఫోన్ చేశా. అప్పటికే పోలీసులెవరూ మా ఇంటికి రాకుండా.. గౌతమ్(Gautam Singhania) మేనేజ్ చేసినట్లు అనన్యకు అర్థమైంది. ఆమె అందుకే పోలీస్ స్టేషన్కు వెళ్తానని చెప్పింది. ఇంకోవైపు నా కుమార్తె తన ఫ్రెండ్ విశ్వరూప్కు(Vishwarup) (సింఘానియా దగ్గరి బంధువు) ఫోన్ చేసి పెద్దవాళ్లను తీసుకురమ్మని చెప్పింది. అతడు నా పిల్లలకు స్నేహితుడు. సమయంలోనే నీతా అంబానీ(Neetha Ambani), అనంత్ అంబానీ(Ananth Ambani) నాతో ఫోన్లో మాట్లాడారు. వారి కుటుంబం మొత్తం రంగంలోకి దిగింది. వాస్తవానికి పోలీసులు రాకుండా గౌతమ్ ఆపాడు.. కానీ అంబానీలు రంగంలోకి దిగి పోలీసులు మా వద్దకు వచ్చేలా చేశారు.' అని చెప్పారు.

ఆరోపణలపై స్పందించేందుకు సింఘానియా(Singhania) నిరాకరించారు. 'నా ఇద్దరు పిల్లల భవిష్యత్ దృష్ట్యా.. నా కుటుంబ గౌరవం దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. నా గోప్యతకు గౌరవం ఇవ్వండి.' అని కోరారు గౌతమ్ సింఘానియా(Gautam Singhania). ఇక దీపావళి పార్టీకి తనకు ఆహ్వానం ఉన్నా.. తనను లోపలికి రానివ్వలేదని ఆరోపించారు నవాజ్. సంబంధిత వీడియో వైరల్ అయిన నిమిషాల వ్యవధిలో విడాకులపై(Divorce) ప్రకటన వచ్చింది. సింఘానియాకు దాదాపు రూ. 11 వేల కోట్ల సంపద ఉంది. 1999లో ఇరువురికీ వివాహం కాగా.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే విడాకుల సెటిల్మెంట్లో భాగంగా నవాజ్.. సింఘానియా ఆస్తి నుంచి 75 శాతం భరణంగా కోరినట్లు వార్తలొచ్చాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద సూట్ ఫాబ్రిక్ (Suit Fabric) ఉత్పత్తిదారులలో ఒకటైన రేమండ్(Nawaz Modi) లిమిటెడ్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా(Gautam Singhania) వివాదం నేపథ్యంలో పెట్టుబడిదారులలో ఆందోళన నెలకొంది. దీంతో వరుసగా ఏడో రోజు కూడా భారీ అమ్మకాలు వెల్లువెత్తాయి. బుధవారం నాడు షేర్లు 4.4శాతం కుప్పకూలాయి. నవంబర్ 13 నుండి షేరు మొత్తంగా 12శాతం పతనమైంది. నవాజ్మోడీ(Nawaz Modi) కూడా బోర్డు సభ్యురాలు కాబట్టి ఇది కార్పొరేట్గవర్నెన్స్సమస్య అనీ, ఇది కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదని ఐసిఐసిఐ(ICICI) సెక్యూరిటీస్ లిమిటెడ్ విశ్లేషకుడు వరుణ్ సింగ్(Varun Singh) అన్నారు.

మరోవైపు సెటిల్మెంట్లో భాగంగా నవాజ్మోడీ(Nawaz Modi) 1.4 బిలియన్డాలర్ల సంపదలో 75శాతం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది.అయితే దీనిపై రేమండ్ గ్రూప్ ప్రతినిధి ఇంకా అధికారికంగా స్పందించలేదు. రేమండ్ లిమిటెడ్ మార్కెట్(Raymond Ltd. Market) క్యాపిటలైజేషన్ రూ.11,658 కోట్లు. రేమండ్వ్యాపారంలో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్వాటానే ఎక్కువ. దక్షిణ ముంబైలోని జేకే హౌస్ ఆస్తి అత్యంత విలువైందిగా అంచనా. దీని విలువ దాదాపు రూ. 6,000 కోట్లు ఉంటుందని సమాచారం. దీంతోపాటు లంబోర్ఘిని గల్లార్డో LP570 సూపర్లెగ్గేరా, లంబోర్ఘిని ముర్సిలాగో, లోటస్ ఎలిస్ కన్వర్టిబుల్, నిస్సాన్ స్కైలైన్ GTR, హోండా S2000, ఫెరారీ 458 ఇటాలియా, ఆడి క్యూ7 లగ్జరీ కార్లు కూడా సింఘానియా సొంతం.