దేశంలో క్రమంగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఏ నగరంలో ఎంతంటే

Gold and Silver prices : దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దాంతో దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.63,200 వద్ద ఉంది.

Courtesy: Top Indian News

Share:

దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దాంతో దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.63,200 వద్ద ఉంది. గుడ్‌రిటర్న్స్ ప్రకారం, మంగళవారం భారతదేశంలో 22 క్యారెట్ల బంగారం ధరలు గ్రాముకు రూ.5,780 వద్ద ఉండగా, 24 క్యారెట్ల ధర గ్రాము ధర రూ.6,305గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.57,800 గా ఉంది. 

మరోవైపు, వెండి ధర క్రమంగా పెరుగుతోంది. వెండి ధర గ్రాము రూ.76.40 కాగా, 10 గ్రాములు రూ.766గా ఉంది.  సోమవారం కిలో వెండి ధర రూ.73,695 ఉండగా, మంగళవారం రూ.112 పెరిగి రూ.73,807కు చేరుకుంది.

ప్రధాన నగరాల్లో..
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు గురువారం ఈ కింది విధంగా ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,950గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,200 గా ఉంది. దిల్లీలో కిలో వెండి ధర రూ.76,400 గా ఉంది. కోల్ కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,800 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​ రూ.63,050 గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 

హైదరాబాద్ లో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.57,750: 
హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.57,800 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,050 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. కాగా, చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ.58,300 గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ.63,200 గా ఉంది. విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,273కు తగ్గింది. కిలో వెండి ధర రూ.73,807కు చేరుకుంది. విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,273గా ఉంది. కిలో వెండి ధర రూ.73,8075గా ఉంది.

హైదరాబాద్ లో  వెండి ధర : 
దేశంలో వెండి ధరలు మంగళవారం పెరిగాయి. కేజీ వెండిపై రూ.112 పెరుగుదల నమోదైంది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ.77,800 పలుకుతోంది. వెండి ధరలు కోల్​ కతాలో రూ.​76,400, బెంగళూరులో రూ.74,000గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​ లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.