భగ్గుమంటున్న బంగారం ధరలు.. 10 గ్రాముల తాజా ధర ఎంతో తెలుసా?

Gold prices update: భారతదేశంలో 22 క్యారెట్ల బంగారం ధరలు గ్రాముకు రూ.5,775 వద్ద ఉండగా, 24 క్యారెట్ల ధర గురువారం గ్రాము ధర రూ.6,300గా ఉంది.

Courtesy: Top India News

Share:

దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. గత కొన్ని నెలలుగా పసిడి ధరలు పెరగడమే తప్ప, ఏ మాత్రం తగ్గడం లేదు. దాంతో 24 క్యారెట్ల తులం బంగారం రికార్డు స్థాయిలో రూ. 63 వేలను తాకింది. నిన్న స్థిరంగా ఉన్న బంగార ధరలు నేడు భారీగా పెరిగాయి. గుడ్‌రిటర్న్స్ ప్రకారం, భారతదేశంలో 22 క్యారెట్ల బంగారం ధరలు గ్రాముకు రూ.5,775 వద్ద ఉండగా, 24 క్యారెట్ల ధర గురువారం గ్రాము ధర రూ.6,300గా ఉంది. 

10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ.350 పెరిగి, రూ.57,750 కి చేరింది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ.5,77,500 కి చేరింది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర రూ.380 పెరిగి రూ.63,000 కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,30,000 గా ఉంది.అదే సమయంలో, వెండి ధర గ్రాము రూ. 78.50 కాగా, 10 గ్రాములు రూ. 785గా ఉంది.

ప్రధాన నగరాల్లో..
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు గురువారం ఈ కింది విధంగా ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,900గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,150 గా ఉంది. కోల్ కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,750 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​ రూ.63,000 గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ లో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,750: 
హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,750 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,000 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. కాగా, చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,250 గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,650 గా ఉంది. ఇక పుణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,750 గాను, 24 క్యారెట్ల పసిడి రూ.63,000 గాను ఉంది.


అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,800 గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 63,050 గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 57,750 గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,000 గా ఉంది.

హైదరాబాద్ లో  కేజీ వెండిపై రూ. 700 పెరుగుదల: 
దేశంలో వెండి ధరలు గురువారం పెరిగాయి. కేజీ వెండిపై రూ.700 పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ. 7,920 గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ.79,200 కి పెరిగింది.  హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ.80,700 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​79,200, బెంగళూరులో రూ.76,500గా ఉంది.