రూ.700 లకే మహీంద్రా థార్.. Anand Mahindra రియాక్షన్ చూడండి!

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ( Anand Mahindra) సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. తరచూ ఏదో ఒక అంశంపై తనదైన శైలిలో స్పందిస్తూ అందరి ద్రుష్టిని ఆకట్టుకుంటుంటారు. తాజాగా ఓ పిల్లాడికి సంబంధించిన వీడియో షేర్ చేసి మరోసారి నెటిజన్లను ఆకర్షించారు.

Courtesy: Top Indian News

Share:

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ( Anand Mahindra) సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. తరచూ ఏదో ఒక అంశంపై తనదైన శైలిలో స్పందిస్తూ అందరి ద్రుష్టిని ఆకట్టుకుంటుంటారు.  తాజాగా ఓ పిల్లాడికి సంబంధించిన వీడియో షేర్ చేసి మరోసారి నెటిజన్లను ఆకర్షించారు. ప్రస్తుతం ఆయన షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ఏంటి, దాని వెనక స్టోరీ ఇప్పుడు చూద్దాం. 

చీకూ అనే చిన్న పిల్లాడు తన తండ్రితో మహీంద్రా కారు గురించి మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ని థార్‌గా పొరబడిన ఆ చీకూ అనే పిల్లాడు, రెండూ ఒకటే అని భావించి, దాన్ని కొందామని తన తండ్రిని అడగడం ఆ వీడియోలో ఉంది. ఎక్స్‌యూవీ 700 లో 700 ఉంది కాబట్టి దాని ధర రూ.700 అని చీకూ భావించాడు. దీంతో బయటికి వెళ్లినపుడు రూ.700 తో ఆ ఎక్స్‌యూవీ 700 కారును కొనేద్దామని తన తండ్రితో అనడం ఆ వీడియోలో కనిపిస్తోంది. అయితే దానికి సంబంధించిన వీడియోను చీకూ తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌ అయింది. అది కాస్తా చివరికి ఆనంద్ మహీంద్రా ద్రుష్టికి వచ్చింది. దీంతో ఆయన సోషల్ మీడియాలోనే దానికి తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. 

ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. "చీకూ వీడియోలను చాలానే చూసాను, ఇప్పుడు అతడంటే ఇష్టం ఏర్పడింది. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే.. థార్‌ను 700 రూపాయలకు విక్రయిస్తే.. మేము త్వరలో దివాళా తీయాల్సి ఉంటుంది" అని మహీంద్రా రాసుకొచ్చారు. 

అయితే ఆ చిన్నారి మాట్లాడిన మాట తీరు ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఇక ఈ వీడియోను ఆనంద్‌ మహీంద్రాకు ఆయన స్నేహితుడు ఒకరు పంపించినట్లు ఆనంద్ మహీంద్రా ఎక్స్ వేదికగా  తెలిపారు. అయితే ఆ వీడియోతోపాటు చీకూకు చెందిన మరికొన్ని వీడియోలు చూసిన తర్వాత తాను కూడా అతడ్ని ఇష్టపడడం మొదలుపెట్టినట్లు చెప్పారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే.. వేలమంది వీక్షించారు, కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేశారు. చీకూ అమాయకత్వానికి చాలా మంది ముగ్దులైపోయారు. మరికొందరు చీకు మాటలు నిజమవుతాయని సమర్ధించారు. లక్షల విలువైన కారు కేవలం వందల రూపాయలకే కొనుగోలు చేయవచ్చనే అమాయకత్వం చాలా మందిని ఆకర్శించారు.