Zomato: కోటిన్నర జీతం అన్నారు.. ఆ తర్వాత లేదన్నారు

జొమాటో మోసం చేసిందా

Courtesy: Twitter

Share:

Zomato: ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ((IIT)లో జొమాటో(Zomato) నియామకం పరిస్థితి సంచలనం రేపింది. ప్రారంభంలో, క్యాంపస్ ప్లేస్‌మెంట్ సీజన్‌లో అల్గారిథమ్స్ ఇంజనీర్ పాత్ర కోసం జొమాటో(Zomato) రూ. 1.6 కోట్ల అధిక వేతనాన్ని అందించడం ద్వారా దృష్టిని ఆకర్షించింది.

ఉద్యోగం వచ్చిదంటే జనాలు ఎగిరి గంతేస్తారు... అదే క్యాంపస్​ సెలక్ట్ మెంట్​ అంటే లైఫ్​ సెటిల్​ అయిందని భావిస్తారు. అందుకే ఇప్పుడు ఐఐటీ ఢిల్లీ (IIT Delhi) క్యాంపస్​ లకు ఎగబడుతున్నారు.  ఎంత కస్టమైనా సరే సీటు సంపాదించాలంటారు.  ఐఐటీ ఢిల్లీ (IIT Delhi)క్యాంపస్​ లో ఇంజనీరు విద్యార్థులను రూ. 1.6 కోట్ల శాలరీకి ఇస్తామని రిక్రూట్​ చేసిన కొద్ది రోజులకే ఆ ఉద్యోగాలను రద్దు చేస్తున్నామని జోమాటో(Zomato) సంస్థ ప్రకటింది.

భారతదేశంలో ఫుడ్ డెలివరీ (Food Delivery) సంస్థలు పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌ (Online)లో ఫుడ్ ఆర్డర్(Food Order) చేసే కస్టమర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది.  అలానే ఫుడ్​ డెలివరీ సంస్థలు ఉద్యోగులు కూడా పెరిగిపోతున్నారు.  చాలా మంది నిరుద్యోగులు ఫుడ్​ డెలివరీ సంస్థల్లో  జాబ్​ చేస్తున్నారు.  జొమాటో రూ. 1.6 కోట్ల వేతనం ఇస్తామని  ఐఐటీ ఢిల్లీ (IIT Delhi) క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ లో  రిక్రూట్​ చేసుకుంది.  ఆ తరువాత అదంతా తూచ్​ అని.. జొమాటో(Zomato) సంస్థ ట్విట్టర్​ లో పోస్ట్​ చేసింది.

జోమాటో (Zomato)తో సహా కొన్ని కంపెనీలు  అల్గారిథమ్స్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఢిల్లీ ఐఐటీ విద్యార్థులను ఎంపిక చేసి రూ. 1.6 కోట్ల వేతనం ఆఫర్​ కూడా ప్రకటించింది.  దీంతో విద్యార్థులు ఎంతో కుషీ అయ్యారు.  ఇంతలోనే జోమాటో(Zomato) ట్విట్టర్​ లో పెట్టిన పోస్టు చూసి  డీలా పడ్డారు.  ఈ ఆఫర్​ ను తమ సంస్థ  కేన్సిల్​ చేసిందని ట్వీట్​ చేసింది.  

దీనిని చూసిన నెటిజన్లు స్పందించారు.  జొమాటో(Zomato) సంస్థ ఢిల్లీ IIT క్యాంపస్​ లో  జాబ్ లను రిక్రూట్​ చేసుకొని భారీ జీతం ఇస్తానని చెప్పి.. ఆ తరువాత ఇవ్వనని చెప్పి మోసం చేసిందని  రీసెర్చ్ ఇంటర్న్ హృతిక్ తల్వార్ సోషల్​ మీడియాలో(Social Media) పోస్ట్​ చేశారు.  మరొకరు 16 లక్షలు కదా.. 1.6 కోట్లు అని తప్పుగా టైప్​ చేశారా కంపెనీని దూషించారు.  ఇంకొకరు  జొమాటో(Zomato) మార్కెటింగ్​ లో ఇది ఒక ట్రిక్​ అని... ఇలా మోసం చేసినందుకు సిగ్గుపడాలని కామెంట్​ చేశారు.

నియామక సమస్యలను(Recruitment issues) ఎదుర్కొంటున్న ఏకైక సంస్థ జోమాటో(Zomato) మాత్రమే కాదు. గూగుల్ మరియు మెటా వంటి పెద్ద టెక్ కంపెనీలు కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయి. జొమాటో(Zomato) గత కొంతకాలంగా నియామక సవాళ్లతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.ఈ ఏడాది జనవరిలో, మెటా(Meta) (ఫేస్‌బుక్‌ను కలిగి ఉన్న సంస్థ) తమ కోసం పని చేయడం ప్రారంభించబోతున్న కొంతమంది నుండి జాబ్ ఆఫర్‌లను వెనక్కి తీసుకుంది. మెటా ఇది చాలా కష్టమైన నిర్ణయమని, అయితే తాము మరింత ముఖ్యమైన ఉద్యోగాలపై(Jobs) దృష్టి పెట్టాలనుకుంటున్నామని చెప్పారు. ఇది వింతగా అనిపించవచ్చు ఎందుకంటే కంపెనీ మొదట ఈ వ్యక్తులను నియమించుకుంది మరియు తర్వాత తన మనసు మార్చుకుంది మరియు వారి ఉద్యోగ ఆఫర్లను (Job Offers) ఉపసంహరించుకుంది.

ఒక గూగుల్ ఇంజనీర్(Google Engineer) ఒక కఠినమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతను అమెజాన్‌లో(Amazon) చేరడానికి గూగుల్‌లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు, కానీ అమెజాన్‌లో ప్రారంభించడానికి కేవలం మూడు రోజుల ముందు, వారు తమ మనసు మార్చుకున్నారని మరియు అతనికి ఇక ఉద్యోగం లేదని అతనికి చెప్పబడింది. ఇది వృత్తిపరంగా కష్టతరమైన పరిస్థితి ఎందుకంటే అతను ఒక ఉద్యోగాన్ని మరొక ఉద్యోగానికి వదిలివేసి, ఆ తర్వాత రెండూ లేకుండా ముగించాడు.

Tags :