OpenAI: AI కంపెనీ సంవత్సరానికి రూ.83 కోట్లు ఇస్తారట

గూగుల్, మెటా ఎంప్లాయిస్ మక్కువ..

Courtesy: Twitter

Share:

OpenAI: Meta, Google వంటి టెక్ దిగ్గజాల నుండి అత్యుత్తమ ఉద్యోగులను ఓపెన్ AI (OpenAI) ఉద్యోగాలు (Job) ఇస్తామంటూ, కోట్లలో సాలరీ (Salary) ఇస్తామంటూ టెంప్ట్ చేస్తోంది. ఇప్పుడు, ఎక్కువ మందిని ఆకర్షించడానికి కంపెనీ (Company) సంవత్సరానికి రూ.83 కోట్ల వరకు జీతాలు అందిస్తోంది. దీనితో, ఓపెన్ AI (OpenAI) వారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ కోసం గూగుల్, రీసెర్చ్ సైంటిస్టులను, అగ్ర టెక్ దిగ్గజాలను తమ కంపెనీ (Company)లకు ఆహ్వానిస్తుంది. నివేదికల ప్రకారం, Google, Metaలో గతంలో పనిచేసిన కనీసం 93 మందిని కంపెనీ (Company) ఇప్పటికే నియమించుకున్నట్లు సమాచారం. 

 

సంవత్సరానికి రూ.83 కోట్లు ఇస్తారట: 

 

ప్రపంచం రోజు రోజుకు ముందుకు దూసుకుపోతోంది. మనుషులు చేయాల్సిన పనులు సుమారుగా అన్నీ మిషన్లు చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అవతరించిన తర్వాత అన్ని పనులలో రోబోట్స్ సహాయం ఎక్కువైనట్లే కనిపిస్తోంది. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు రోబోట్స్ తయారీలో తమదైన శైలిని చూపిస్తున్నారు. ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తనదైన శైలిలో సత్తా చూపిస్తోంది.

జాన్ లీకే, OpenAI అధిపతి మాట్లాడుతూ, మరి ముఖ్యంగా ఓపెన్ AI (OpenAI) సంస్థలో చేరేందుకు ప్రత్యేకించినా అర్హతలు అవసరం లేదని మీకు టాలెంట్ ఉంటే సరిపోతుంది అంటూ కంపెనీ (Company) వాళ్ళు వెల్లడించారు. అండర్ గ్రాడ్యుయేట్స్ లేదంటే కాలేజ్ మధ్యలోనే ఆపేసిన వాళ్ళు కూడా ఇటువంటి జాబ్స్ కి అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఒకవేళ మీకు ఆసక్తిగా ఉండి, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌లు (APIలు), కొన్ని అద్భుతమైన ఉత్పత్తులను రూపొందించడం, ఓపెన్ సోర్స్ వనరులకు సహకరించడం వంటివి మీరు చేయగలిగితే చాలు, ఆపై [email protected]కు ఇమెయిల్ చేయడం ద్వారా మీకు జోక్ తప్పకుండా వస్తుంది అంటున్నారు జాన్ లీకే, OpenAI అధిపతి. 

 

చాట్ GPT నిపుణుల‌కు కోటిన్నర ఆఫర్: 

 

ఇదిలా ఉండగా మరోవైపు, ఉద్యోగ (Job) ఖాళీలు ఉన్న 91 శాతం కంపెనీ (Company)లు చాట్‌జీపీటీ నైపుణ్యం కలిగిన నిపుణులను నియమించుకోవాలని కోరుకుంటున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. ఇప్పుడొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్స్ అనేది ఉత్పాదకతను పెంచుతుందని, సమయాన్ని ఆదా చేస్తుందని మరియు కంపెనీ (Company) పనితీరును పెంచుతుందని ప్రతివాదులు భావిస్తున్నారు.

ChatGPT 2022లో ప్రవేశపెట్టబడినప్పటి నుండి టెక్ ప్రపంచంలో ఇది చాలావరకు చర్చనీయాంశమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ మానవుని తరహాలో ప్రతిస్పందించగల సామర్థ్యంతో మరియు ఎటువంటి సవాళ్లు కైనా సమాధానం చెప్పగల సామర్థ్యంతో వచ్చింది కాబట్టి విపరీతమైన ప్రజాదరణ పొందింది. కథలు ఉపన్యాసాలు రాయడం నుండి సంగీతం కంపోజ్ చేయడం వరకు, జనరేటివ్ AI చాట్‌బాట్‌ను ఉపయోగించడానికి జనం ఎక్కువగా మక్కువ చూపిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. 

కాలక్రమేణా, టెక్ స్పేస్‌లో ChatBOT మరింత అవసరంగా మారుతోంది మరియు AI చాట్‌బాట్‌ను ఉపయోగించడంలో నిపుణులైన వ్యక్తులకు ఉద్యోగాల (Job) విషయానికి వస్తే చాలా ఆప్షన్స్ ఉన్నట్లు కనిపిస్తున్నాయి. Resume Builder చేసిన ఒక అధ్యయనం ప్రకారం, ఉద్యోగ (Job) ఖాళీలు ఉన్న 91 శాతం కంపెనీ (Company)లు ChatGPT నైపుణ్యం కలిగిన నిపుణులను నియమించాలనుకుంటున్నాయి. అధ్యయనం ప్రకారం, AI ఉత్పాదకతను పెంచుతుందని, సమయాన్ని ఆదా చేస్తుందని మరియు కంపెనీ (Company) పనితీరును పెంచుతుందని ప్రతివాదులు భావిస్తున్నారు.ChatGPT నిపుణులకు రూ. 1.5 కోట్ల వరకు శాలరీ (Salary) ఇవ్వబడుతుందని కంపెనీ (Company)లు పేర్కొన్నాయి. అంతేకాకుండా

చాట్‌జిపిటిని ఉపయోగించడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తులకు లింక్డ్‌ఇన్‌లోని కంపెనీ (Company)లు సంవత్సరానికి USD 185,000 (సుమారు రూ. 1.5 కోట్లు) వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయని బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక పేర్కొంది. ఉదాహరణకు, రిక్రూటింగ్ ఫ్రమ్ స్క్రాచ్, USలో ఉన్న HR కంపెనీ (Company), సీనియర్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ఆడియో మరియు ఉద్యోగానికి (Job) అవసరమైన నైపుణ్యాలలో 'ప్రస్తుత AI టూల్స్ మరియు ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్కువ ప్రామిణ్యం ఉన్నవారికి - ChatGPT, మిడ్‌జర్నీ మరియు ఇతర కంపెనీ (Company)లలో' ఓపెనింగ్స్ ఉన్నందువలన రిక్రూట్ చేసుకుంటుంది.

Tags :