WeWork: ఒక‌ప్ప‌టి కోట్ల విలువైన వీ వ‌ర్క్.. నేడు దివాలా అంచున‌

WeWork: స్టార్టప్ (Start Up) ను స్టార్ట్ చేయడం ఎంత ఈజీయో దానిని రన్ చేయడం అంత కష్టం. ఒక్కోసారి అంతా బాగుందనకున్న సమయంలో కూడా బ్యాడ్ లక్ (Bad Luck) వెంటాడుతుంది. అగ్రశ్రేణి (Top) సంస్థగా సేవలందించినా కానీ ఒకానొక సమయంలో పాతాళానికి పడిపోవడం కామన్. అటువంటి సమస్యనే ఎదుర్కొంటోంది వుయ్ వర్క్ (Wework) స్టార్టప్(Start Up). ఒకప్పుడు ఎంతో మంది ఇన్వెస్టర్ల నమ్మకాన్ని చూరగొన్న ఈ కంపెనీ ఇప్పుడు దివాలా (Bankruptcy) ప్రక్రియను స్టార్ట్ […]

Share:

WeWork: స్టార్టప్ (Start Up) ను స్టార్ట్ చేయడం ఎంత ఈజీయో దానిని రన్ చేయడం అంత కష్టం. ఒక్కోసారి అంతా బాగుందనకున్న సమయంలో కూడా బ్యాడ్ లక్ (Bad Luck) వెంటాడుతుంది. అగ్రశ్రేణి (Top) సంస్థగా సేవలందించినా కానీ ఒకానొక సమయంలో పాతాళానికి పడిపోవడం కామన్. అటువంటి సమస్యనే ఎదుర్కొంటోంది వుయ్ వర్క్ (Wework) స్టార్టప్(Start Up). ఒకప్పుడు ఎంతో మంది ఇన్వెస్టర్ల నమ్మకాన్ని చూరగొన్న ఈ కంపెనీ ఇప్పుడు దివాలా (Bankruptcy) ప్రక్రియను స్టార్ట్ చేసింది. ఇందుకు సంబంధించి అమెరికా కోర్టులో (America Court) ప్రక్రియను మొదలుపెట్టింది.  వుయ్ వర్క్ సంస్థకు , సాఫ్ట్‌ బ్యాంక్ (SoftBank) గ్రూప్-ఆధారిత స్టార్టప్ అనే పేరు ఉంది. ఇక దీంతోనే ఈ సంస్థ అనతి కాలంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించింది. కానీ అక్కడి నుంచి కిందకి పడిపోయేందుకు ఎక్కువ కాలం పట్టలేదు. ఈ సంస్థ క్రమంగా దిగజారుతూ వచ్చింది. ఇక ప్రస్తుతం అయితే ఈ సంస్థ ఏకంగా దివాలా ప్రక్రియనే దాఖలు చేసిందంటేనే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సంస్థ చేపట్టిన చర్య వ్యాపార వర్గాల్లో అందర్నీ ఒక్కసారిగా షాక్ కు (Shock) గురి చేసింది. 

60 శాతం సాఫ్ట్ బ్యాంక్ దే

ఈ స్టార్టప్ (Start Up) లో దాదాపు 60 శాతం వాటాను జపనీస్ టెక్నాలజీ గ్రూప్ అయిన సాఫ్ట్ బ్యాంక్ (SoftBank) సొంతం చేసుకుంది. దీంతో ఈ బ్యాంక్ కంపెనీలో మిలియన్ డాలర్స్ (Dollars) పెట్టుబడి పెట్టింది. దీంతో వుయ్ వర్క్ స్టార్టప్ (Start Up) కు నిధుల కొరత అనేది లేకుండా ముందుకు సాగింది. కానీ సడెన్ గా ఏమయిందో ఏమో తెలియదు కానీ ఈ సంస్థ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కోల్పోయింది. క్రమంగా వుయ్ వర్క్ (Wework) షేర్ వాల్యూ పడిపోతూ వచ్చింది. ఇక చివరికి ఈ సంస్థ దివాలా (Bankruptcy) ప్రక్రియను స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. వుమ్ వర్క్ (Wework) కంపెనీ దాని ప్రస్తుత నిధుల రుణాన్ని భారీగా తగ్గించడానికి కీలకమైన వాటాదారులతో పునర్నిర్మాణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. వుయ్ వర్క్ షేర్లు ఇప్పటికే రికార్డు స్థాయిలో పడిపోయాయి. ఈ కంపెనీ షేర్లు దాదాపు 98.5 శాతం మేర పడిపోయాయి.

లాభాలు కష్టమే.. 

వుయ్ వర్క్ (Wework) కంపెనీకి ఈ సమయంలో లాభాలు రావడం కష్టమే అని తెలుస్తోంది. దీనికి కూడా ఒక కారణం ఉంది.. వుయ్ వర్క్ కంపెనీ దాని ఖరీదైన లీజులతో మరియు కార్పొరేట్ క్లయింట్లు రద్దు చేయడంతో కొంతమంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారు. 2023 రెండవ త్రైమాసికంలో వుయ్ వర్క్ కంపెనీ ఆదాయంలో దాదాపు 74 శాతం ఆదాయాన్ని స్థలం కోసం చెల్లించడం గమనార్హం. న్యూజెర్సీ (New Jersey) దివాలా కోర్టులో దాఖలు చేసిన ఫైల్‌ లో, వుయ్ వర్క్ 10 బిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 50 బిలియన్ అమెరికన్ డాలర్ల పరిధిలో అంచనా వేయబడిన ఆస్తులు మరియు లయబులిటీస్ ను జాబితా చేసింది. వుయ్ వర్క్ భారమైన లీజుల నుంచి బయటపడటానికి అమెరికా దివాలా (Bankruptcy) కోడ్ యొక్క నిబంధనలను ఉపయోగించుకోవచ్చునని న్యాయ సంస్థ ఒకటి ఆగస్టులో తన వెబ్‌ సైట్‌ లో పేర్కొంది. నేటి ఫైలింగ్‌ లో భాగంగా, వుయ్ వర్క్ కొన్ని స్థానాల లీజులను తిరస్కరించే సామర్థ్యాన్ని అభ్యర్థించింది. అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

గతమెంతో ఘనం.. 

వుయ్ వర్క్ (Wework) కంపెనీ గతం చూసుకుంటే ఎంతో ఘనంగా ఉంది. కంపెనీ స్థాపించిన కొద్ది రోజుల్లోనే బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. అనతి కాలంలోనే షేర్ హోల్డర్ల (Share Holders) నమ్మకాన్ని కంపెనీ సాధించింది. దీంతో వుయ్ వర్క్ షేర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు ఆడమ్ న్యూమాన్ సారధ్యంలో కంపెనీ గణనీయమైన పురోగతి సాధించింది. కొద్ది రోజుల్లో ఈ కంపెనీ 47 బిలియన్ అమెరికన్ డాలర్ల కంపెనీగా అభివృద్ది చెందింది.

ఇది స్టార్టప్ (Start Up) కూడా కావడం విశేషం. స్టార్టప్ రంగంలో ఈ కంపెనీ ఒక కొత్త ట్రేడ్ మార్క్ ను సెట్ చేసింది. ఇది సాఫ్ట్‌ బ్యాంక్ (SoftBank) మరియు వెంచర్ క్యాపిటల్ సంస్థ బెంచ్‌మార్క్‌ తో సహా బ్లూచిప్ పెట్టుబడిదారుల నుంచి పెట్టుబడులను ఆకర్షించింది, అలాగే జేపీ మోర్గాన్ చేజ్‌ తో సహా ప్రధాన వాల్ స్ట్రీట్ బ్యాంక్‌ (Wall Street Bank) ల మద్దతును కూడా పొందింది. సాఫ్ట్‌ బ్యాంక్ సంస్థ వుయ్ వర్క్ లో తన పెట్టుబడిని రెట్టింపు చేసింది. అంతే కాకుండా రియల్ ఎస్టేట్ అనుభవజ్ఞుడైన సందీప్ మాత్రానిని ఈ స్టార్టప్ (Start Up) కు కొత్త సీఈవోగా ఎంపిక చేసింది. 

2021లో సాఫ్ట్‌ బ్యాంక్ 8 బిలియన్ అమెరికన్ డాలర్ల వాల్యుయేషన్‌ తో బ్లాంక్-చెక్ అక్విజిషన్ కంపెనీతో విలీనం ద్వారా వుయ్ వర్క్ పబ్లిక్‌ గా తీసుకునే ఒప్పందాన్ని తగ్గించింది. ఇక అప్పుడే కరోనా మహమ్మారి (covid Pandemic) కూడా రావడంతో వుయ్ వర్క్ (Wework) సంస్థ కు కోలుకోలేని దెబ్బ పడింది. అసలుకే నష్టాల్లో ఉన్న కంపెనీని కరోనా మరింత దిగజార్చింది. అప్పటికే స్థలాల లీజు విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న వుయ్ వర్క్ సంస్థకు సమస్యలు మరింత అధికం అయ్యాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణం (Inflation) పెరగడం, లాభాలు తగ్గడం వంటి అనేక విషయాలు కంపెనీని మరింత కష్టాల్లోకి నెట్టాయి.