'ది రాజాసాబ్' గా ప్రభాస్.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే

'The Raja saab': సంక్రాంతి పండగ వేళ ప్రభాస్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా కొత్త చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Courtesy: x

Share:

సంక్రాంతి పండగ వేళ ప్రభాస్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా కొత్త చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా టైటిల్‌ని తాజాగా ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రభాస్- మారుతి క్రేజీ కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి 'ది రాజాసాబ్‌' అనే టైటిల్‌ ఖారారు చేశారు. ఈ టైటిల్ తో వచ్చిన ప్రభాస్ ఫస్ట్‌లుక్‌ నెక్స్ట్ లెవల్లో ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రభాస్ ఫుల్ ఆన్ ఎనర్జిటిక్ మోడ్ లో కనిపిస్తున్న ఈ పోస్టర్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 

ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకుండానే షూటింగ్ కూడా మొదలెట్టేశారు మేకర్స్. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి సంక్రాంతి కానుకగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

కామెడీ అండ్ హారర్ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే అంచనాలే ఏర్పడుతున్నాయి. సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా నేపథ్యం, టైటిల్‌పై పలు రూమర్స్‌ వచ్చాయి. రెండు భాగాలుగా తెరకెక్కే అవకాశాలున్నాయనే టాక్‌ కూడా వినిపించింది. కథానాయికల వివరాలను గోప్యంగానే ఉంచారు. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ నటిస్తున్నారని సమాచారం. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. 

ఇప్పటికే సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రభాస్‌ అభిమానులకు వైజయంతి మూవీస్‌ కూడా శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. ఆయన రాబోయే సినిమా ‘కల్కి 2998 ఏడీ’ (Kalki 2898AD) సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల డేట్ ను ప్రకటించారు మేకర్స్.  వేసవి కానుకగా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ అనే భారీ బడ్జెట్ సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో డిసెంబర్ 22న రిలీజ్ అయ్యింది. ‘హోంబలే ఫిలింస్’ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు నమోదు చేసుకుంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందంలో ఉన్నారు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ మళ్లీ ఇన్ని రోజులకు భారీ హిట్ కొట్టడంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.  ఇటీవల సినిమా యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంది.