'హనుమాన్' సినిమా అద్భుతం.. చాలా సంతోషంగా ఉంది: దర్శకుడు రాఘవేంద్ర రావు

Hanuman : టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో, తేజ సజ్జ(Teja Sajja) హీరోగా వ‌చ్చిన హనుమాన్ (Hanuman) మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది.

Courtesy: x

Share:

టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో, తేజ సజ్జ(Teja Sajja) హీరోగా వ‌చ్చిన హనుమాన్ (Hanuman) మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. విడుదలైన తొలి రోజే ఈ సినిమాకు మంచి టాక్ లభించింది. సినిమా నెక్స్ట్ లెవల్లో ఉందంటూ ఆడియన్స్ చెప్తున్నారు. తొలి రోజు సినిమా చూసిన ప్రేక్షకులంతా సినిమా అదిరిపోయిందంటూ కితాబిచ్చారు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందంటూ సినిమా చూసిన వారు చెబుతున్నారు. విజువల్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాని వేరే రేంజ్ కి తీసుకు వెళ్లాయని కామెంట్స్ చేస్తున్నారు. 

కొత్త డైరెక్టర్ అయినప్పటికీ ప్రశాంత్ వర్మ అద్భుతంగా మూవీని తెరకెక్కించారని, హీరోగా తేజ సజ్జ కూడా చాలా గొప్పగా నటించాడని ప్రేక్షకులు చెబుతుండడం విశేషం. సినిమా విడుదల అయిందో లేదో థియేటర్ల వద్ద ఎక్కడ చూసినా హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తుండడం చెప్పుకోవాల్సిన విషయం. దీంతో త్వరలో థియేటర్ల సంఖ్య పెంచనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ చిత్రంపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ  పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే సినిమా అద్భుతం అని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసించగా.. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. 

ప్రశాంత్ వర్మ దర్శకత్వం అద్భుతం

"సంక్రాంతి వేళ వచ్చిన హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు చాలా సంతోషం గా ఉంది. ఈ చిత్రంలో హీరో తేజ సజ్జా నటన, ప్రశాంత్ వర్మ దర్శకత్వం, విజువల్‌గా చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉన్నాయి. చిత్ర బృందానికి శుభాకాంక్షలు. అందరికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ” కే రాఘవేంద్ర రావు ఎక్స్ వేదిక‌గా రాసుకోచ్చాడు. కాగా ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. కాగా, రాఘవేంద్ర రావుకు హీరో తేజ సజ్జా రిప్లై ఇచ్చారు. థాంక్స్ ఎలాట్, మీన్స్ ఎలాట్ సర్ అంటూ తేజ రిప్లై ఇచ్చారు.

ఇప్పటికే ప్రశాంత్ వర్మను ప్రశంసించిన ఆర్జీవీ
ప్రముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ హనుమాన్ మూవీపై ప్రశంసలు కురిపించారు. "ముందుగా దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జకు నా అభినందనలు. హనుమాన్ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది, జై హనుమాన్" అంటూ రామ్‌గోపాల్‌వ‌ర్మ సోష‌ల్‌మీడియాలోని త‌న ఖాతాలో పోస్ట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ పెట్టిన పోస్టుకు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ స్పందించారు. థ్యాంక్యూ సర్, అని రిప్లై ఇచ్చారు.

హనుమాన్‌ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కే నిరంజన్‌ రెడ్డి తెరకెక్కించ‌గా.. కోలీవుడ్ భామ అమృతా అయ్యర్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి గౌరా హరి-అనుదీప్ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ సంయుక్తంగా మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందించారు. ఈ సినిమా మొదటి రోజే రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. స్టార్స్ లేని హనుమాన్ సినిమాకు ఈ రేంజ్ ప్రీమియర్స్ పడడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. కేవలం కంటెంట్ నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.21 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.