బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతున్న 'హనుమాన్'.. ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే షాకే!

Hanuman Movie: టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో, తేజ సజ్జ(Teja Sajja) హీరోగా వ‌చ్చిన హనుమాన్ (Hanuman) మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది.

Courtesy: x

Share:

టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో, తేజ సజ్జ(Teja Sajja) హీరోగా వ‌చ్చిన హనుమాన్ (Hanuman) మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. ఈ సినిమా ఇప్పటికే గ్లోబల్‌ లెవల్‌లో క్రేజ్‌ సంపాదించుకుంది. భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించినప్పటికీ.. ఈ సినిమా మొదటి రోజే రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. స్టార్స్ లేని హనుమాన్ సినిమాకు ఈ రేంజ్ ప్రీమియర్స్ పడడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. కేవలం కంటెంట్ నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌ ఆడియన్స్‌కు ఈ సినిమా బాగా ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.21 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. 

విడుదలైన తొలి రోజే ఈ సినిమాకు మంచి టాక్ లభించింది. సినిమా నెక్స్ట్ లెవల్లో ఉందంటూ ఆడియన్స్ చెప్తున్నారు. తొలి రోజు సినిమా చూసిన ప్రేక్షకులంతా సినిమా అదిరిపోయిందంటూ కితాబిచ్చారు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందంటూ సినిమా చూసిన వారు చెబుతున్నారు. విజువల్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాని వేరే రేంజ్ కి తీసుకు వెళ్లాయని కామెంట్స్ చేస్తున్నారు. కొత్త డైరెక్టర్ అయినప్పటికీ ప్రశాంత్ వర్మ అద్భుతంగా మూవీని తెరకెక్కించారని, హీరోగా తేజ సజ్జ కూడా చాలా గొప్పగా నటించాడని ప్రేక్షకులు చెబుతుండడం విశేషం. సినిమా విడుదల అయిందో లేదో థియేటర్ల వద్ద ఎక్కడ చూసినా హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తుండడం చెప్పుకోవాల్సిన విషయం. దీంతో త్వరలో థియేటర్ల సంఖ్య పెంచనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ చిత్రంపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ  పోస్టులు పెడుతున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజైన దీనికి నార్త్‌లోనూ మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్స్ అందరూ హనుమాన్‌కు సపోర్ట్‌ నిలిచి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేశారు. 

ప్రశాంత్ వర్మను ప్రశంసించిన ఆర్జీవీ
ప్రముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ హనుమాన్ మూవీపై ప్రశంసలు కురిపించారు. "ముందుగా దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జకు నా అభినందనలు. హనుమాన్ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది, జై హనుమాన్" అంటూ రామ్‌గోపాల్‌వ‌ర్మ సోష‌ల్‌మీడియాలోని త‌న ఖాతాలో పోస్ట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ పెట్టిన పోస్టుకు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ స్పందించారు. థ్యాంక్యూ సర్, అని రిప్లై ఇచ్చారు.

హనుమాన్‌ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కే నిరంజన్‌ రెడ్డి తెరకెక్కించ‌గా.. కోలీవుడ్ భామ అమృతా అయ్యర్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి గౌరా హరి-అనుదీప్ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ సంయుక్తంగా మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందించారు.