ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. కల్కి సినిమా రిలీజ్ అప్పుడే!

Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రభాస్‌ అభిమానులకు వైజయంతి మూవీస్‌ శుభవార్త చెప్పింది. ఆయన రాబోయే సినిమా ‘కల్కి 2998 ఏడీ’ (Kalki 2898AD) సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చింది.

Courtesy: x

Share:

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రభాస్‌ అభిమానులకు వైజయంతి మూవీస్‌ శుభవార్త చెప్పింది. ఆయన రాబోయే సినిమా ‘కల్కి 2998 ఏడీ’ (Kalki 2898AD) సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల డేట్ ను ప్రకటించారు మేకర్స్.  వేసవి కానుకగా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. 

‘‘6000 సంవత్సరాల క్రితం ముగిసిన కథ.. 2024 మే 9 నుంచి ప్రారంభం కానుంది’’ అని ట్వీట్‌ చేసింది. ప్రభాస్‌ కొత్త పోస్టర్‌ షేర్‌ చేసింది. దీనిపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగానే.. కల్కి సినిమా రిలీజ్ విషయంలో మెగాస్టార్ సెంటిమెంట్ ను వాడేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై వచ్చి సూపర్ హిట్ అయినా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజైన మే 9న కల్కి ని కూడా రిలీజ్ చేయనున్నారు.    

ఈ సందర్బంగా కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఆ లుక్ కల్కి సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ రిలీజ్‌ డేట్‌ ప్రమోషన్స్‌ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్‌. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలోనే ‘కల్కి 2898 ఏడీ’ రూపుదిద్దుకుంటోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దిశాపటానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా సెట్స్‌తో పాటు ఆయుధాలు, ఇతర వస్తువులు సరికొత్తగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకూ భారతీయ సినిమా పరిశ్రమ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక సంక్రాంతి పండుగా సందర్బంగా కల్కి టీజర్‌ను కూడా విడుదల చేసి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై కూడా అధికారిక ప్రకటన రానుంది. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ అనే భారీ బడ్జెట్ సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో డిసెంబర్ 22న రిలీజ్ అయ్యింది. ‘హోంబలే ఫిలింస్’ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు నమోదు చేసుకుంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందంలో ఉన్నారు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ మళ్లీ ఇన్ని రోజులకు భారీ హిట్ కొట్టడంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.  ఇటీవల సినిమా యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంది.