'హనుమాన్' సినిమా నెక్ట్స్ లెవెల్.. ఆడియన్స్ నోట ఇదే మాట!

Hanuman: టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజా సజ్జా కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘హనుమాన్’(HanuMan). భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Courtesy: x

Share:

టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజా సజ్జా కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘హనుమాన్’(HanuMan). భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. అలాగే తేజ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా కావడంతో టాలీవుడ్ స్టార్స్ అందరూ హనుమాన్‌కు సపోర్ట్‌ నిలిచి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేశారు. సినిమా నెక్స్ట్ లెవల్లో ఉందంటూ ఆడియన్స్ చెప్తున్నారు. ప్రశాంత్ వర్మ చాలా అద్భుతంగా చూపించాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. 

ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందంటూ సినిమా చూసిన వారు చెబుతున్నారు. విజువల్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాని వేరే రేంజ్ కి తీసుకు వెళ్లాయని కామెంట్స్ చేస్తున్నారు. హనుమాన్ మూవీ మేకర్స్ రిలీజ్ కు ఒకరోజు ముందే ప్రీమియర్స్ వేసిన విషయం తెలిసిందే. వాటికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు వచ్చిన హైప్ కి ఒక స్టార్ హీరో రేంజ్ ప్రీమియర్స్ పడ్డాయి. దేశవ్యాప్తంగా దాదాపు 1000కి పైగా ప్రీమియర్ షోలు పడ్డాయి. అందులో అన్ని ఫుల్ అవడం అనేది విశేషం. 

స్టార్స్ లేని హనుమాన్ సినిమాకు ఈ రేంజ్ ప్రీమియర్స్ పడడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. కేవలం కంటెంట్ నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక సినిమాలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు టైటిల్ కార్డ్ సీన్ గురించి మాట్లాడుతున్నారు. ఆ సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తుందని చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. హనుమాన్ మూవీ రూ.100 కోట్ల మార్క్ ను ఈజీగా అందుకునే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. హనుమాన్‌ సినిమా చూసిన ఆడియన్స్‌ చాలా పాజిటివ్‌గా రెస్పాన్స్‌ అవుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌ ఆడియన్స్‌కు ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు వస్తున్న టాక్‌తో పాటు ఇప్పుడు మరో విషయం కూడా వైరల్‌గా మారింది. హనుమాన్‌ సినిమాకు సీక్వెల్‌ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. జై హనుమాన్‌ పేరుతో సెకండ్‌ పార్ట్‌ వస్తుందని సమాచారం. 

సినిమా విడుదలకు ముందు తేజ ఎమెషనల్ ట్వీట్
‘హనుమాన్ డెలివరీ చేయబడింది. కొన్ని గంటల్లో మీరందరూ దీన్ని చూడబోతున్నారు. నా రెండున్నర సంవత్సరాల కష్టం. దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు, మరెన్నో అడ్డంకులను చూసి చివరి అంకానికి చేరుకున్నాం. మిక్స్‌డ్ ఫీలింగ్స్‌తో మనసంతా నిండిపోయింది. మీ అందరికీ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్’ అంటూ తేజ ఎమోషనల్ ట్వీట్ షేర్ చేసుకున్నాడు.

ఇప్పటికే భారీ ధరకు అమ్ముడుపోయిన ఓటీటీ రైట్స్
హనుమాన్‌ సినిమాపై విడుదల ముందు నుంచే భారీ క్రేజ్‌ ఏర్పడింది. ఓటీటీ హీందీ  వర్షన్‌ రూ. 5కోట్లు, తెలుగు వర్షన్‌ రూ. 11 కోట్లకు హనుమాన్‌కు సంబంధించిన హక్కులు అమ్ముడుపోయాయి. ప్రముఖ ఎంటర్‌టైనింగ్‌ సంస్థ 'Zee 5' ఈ హక్కుల్ని దక్కించుకుంది. ఓ యువ హీరో నాలుగో సినిమానే ఇంత భారీ ధర పలకటం విశేషమని అప్పట్లో సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాకు నిరంజన్‌ రెడ్డి నిర్మాతగా ఉన్నారు.