ఈ సినిమా చూశాక ఫ్యాన్స్ 'నా సామిరంగ' అనాల్సిందే: నాగార్జున

Na Saamiranga: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హీరోగా, విజయ్ బిన్ని దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై చిట్టూరి శ్రీనివాసరావు నిర్మాతగా నిర్మించిన చిత్రం 'నా సామిరంగ' కూడా ఈనెల 14న సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.  

Courtesy: x

Share:

ఈ సంక్రాంతికి తెలుగు సినీ అభిమానులకు పండగ మరింత ప్రత్యేకంగా ఉండబోతోంది. ఓ వైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం', మరోవైపు విక్టరీ వెంకటేశ్ హీరోగా 'సైంధవ్' సినిమాలు సంక్రాంతికి విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హీరోగా, విజయ్ బిన్ని దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై చిట్టూరి శ్రీనివాసరావు నిర్మాతగా నిర్మించిన చిత్రం 'నా సామిరంగ' కూడా ఈనెల 14న సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.  ఈ సందర్భంగా బుధవారం ప్రీ రిలీజ్‌‌‌‌ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నాగార్జున మాట్లాడారు. 

‘సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. ఆరోజు సినిమాలు చూడటం తెలుగు ప్రేక్షకులకు ఆనవాయితీ. ఈ సంక్రాంతికి వచ్చే నాలుగు సినిమాలు కూడా చూస్తారు. నటుడిగా పాతికేళ్లు పూర్తి చేసుకుని, ‘గుంటూరు కారం’తో వస్తున్న మహేష్‌‌‌‌కు, 75 సినిమాలు పూర్తి చేసుకుని ‘సైంధవ్‌‌‌‌’తో వస్తున్న వెంకీకి, ‘హనుమాన్‌‌‌‌’తో వస్తున్న తేజకు ఆల్ ద బెస్ట్‌‌‌‌. సినిమా నచ్చితే ఎంతలా ఆదరిస్తారో రెండు పండుగలకు చూశా.  ఈ సినిమా కూడా ఫ్యాన్స్ కు నచ్చుతుందని, ఈ పండుగకు కూడా అలాగే ఆదరిస్తారని ‘నా సామిరంగ’తో వస్తున్నా. మూడు నెలల్లో సినిమా చేయడం అంత ఈజీ కాదు. టీమ్ అంతా ఎంతో కష్టపడ్డారు. వాళ్లందరి గురించి సక్సెస్‌‌‌‌ మీట్‌‌‌‌లో చెబుతాను. ఈసారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు.. బాక్సాఫీస్ హిట్ కొడుతున్నాడు’ అని నాగార్జున  చెప్పారు. 

"మా సినిమాకు స్టార్ కీరవాణి. కేవలం పాటలు ఇవ్వడమే కాదు, ఈ సినిమాను 3 నెలల్లో పూర్తిచేసేలా మా వెనక ఉండి, మమ్మల్ని ముందుకు నడిపించారు. ఈ సినిమా చేయాలి, సంక్రాంతికి అందించాలని అనుకున్నప్పుడు మా అందరికంటే ముందు పని స్టార్ట్ చేశారు. సినిమా స్టార్ట్ అవ్వకముందే 3 పాటలు రెడీ చేసి, మా ముందుపెట్టారు. పాటలే కాదు, సినిమాలో ఫస్ట్ ఫైట్ కు మేమింగా ఫైట్ తీయకుండానే, ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసిపెట్టారు." అని కీరవాణిని పొగడ్తలతో ముంచెత్తారు నాగార్జున.

నాగార్జున గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉందని హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ అన్నారు. కొరియోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న తనను దర్శకుడిని చేసిన నాగార్జున గారికి లైఫ్ అంతా రుణపడి ఉంటాను అని విజయ్ బెన్ని చెప్పాడు. కీరవాణి మాట్లాడుతూ ‘కొత్త దర్శకులను గుర్తించి ప్రోత్సహించడంలో నాగార్జున  ముందుంటారు. ఇందులోని పాటతో సంగీత్ వేడుకలన్నీ ఇకపై ‘దుమ్ము దుకాణం’ ఫంక్షన్స్‌‌‌‌గా మారిపోతాయి’ అన్నారు. ‘ఇందులో నాలుగు మంచి పాటలు రాశాను. చాలా ఆనందంగా ఉంది’ అన్నారు చంద్రబోస్‌‌‌‌. హీరోయిన్స్‌‌‌‌ ఆషికా రంగనాధ్, రుక్సర్, మిర్నా, నిర్మాత శ్రీనివాస చిట్టూరితో పాటు టీమ్ అంతా పాల్గొన్నారు. 

సంక్రాంతి బరిలో దిగిన నా సామిరంగ సినిమాకు గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ సినిమాల నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 16.5 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అధిగమించాల్సి ఉంటుంది.