వేడుకగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ వివాహం..

అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్, ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరే వివాహం బుధవారం ముంబయి తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో వేడుకగా జరిగింది.

Courtesy: Top Indian News

Share:

అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్, ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరే వివాహం బుధవారం ముంబయి తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో వేడుకగా జరిగింది. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఐరా, నూపుర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ముంబైలోని ఓ హోటల్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది. వివాహం అనంతరం అదే హోటల్‌లో రిసెప్షన్‌ జరిగింది. ఇక ఈ వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహానికి అమీర్ మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు ఇద్దరు కొడుకులు జునైద్ ఖాన్, ఆజాద్ ఖాన్ కూడా అటెండ్ అయ్యారు. వేదికపై అతిథుల మధ్య కోర్టు పత్రాలపై సంతకం చేయడం ద్వారా తమ పెళ్లిని చట్టబద్ధంగా రిజిస్టర్ చేసుకున్నారు.

అయితే వివాహం అనంత‌రం మాజీ భార్య కిర‌ణ్ రావును ప‌ల‌క‌రించిన అమీర్ ఖాన్.. కిర‌ణ్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని చెంప‌పై ముద్దిచ్చారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. సినీ నిర్మాత కిరణ్ రావును అమీర్ ఖాన్ (Aamir Khan) పదిహేనేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. 2021లో వీరిద్ద‌రూ విడాకులు తీసుకున్నారు. ఇదిలావుంటే.. ఈనెల 8వ తేదీన ఐరా ఖాన్, నుపుర్ శిఖరేలు మరోసారి వివాహ వేడుక జరుపుకోనున్నారు. ఆ తర్వాత జనవరి 13వ తేదీన ముంబైలో గ్రాండ్‌గా వివాహ విందు ఏర్పాటు చేయనున్నారు.

ఎవరీ నూపుర్ శిఖరే?
రీనా దత్త కూతురుగా ఐరా ఖాన్‌ సినీ ప్రియులకు సుపరిచితమే. ‘మెంటల్‌ హెల్త్‌ సపోర్ట్‌ ఆర్గనైజేషన్‌’ సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో అయిన ఐరా.. తరచూ మానసిక ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుంటారు. గత కొన్నేళ్లుగా ఆమిర్‌ ఖాన్‌కు నుపుర్‌ వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా ఉన్నారు. దీంతో ఐరా సైతం నుపుర్‌ వద్ద ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 

నూపూర్ శిఖరే విషయానికి వస్తే.. యంగ్ ఏజ్‌లో అథ్లెట్ గా రాణించాడు. ఆ తర్వాత ఫిజికల్ ట్రైనర్‌ వృత్తిలో స్థిరపడ్డారు. పూణేకు చెందిన నూపూర్ ముందుగా సుస్మిత సేన్ లాంటి సినీ ప్రముఖులకు ట్రైనర్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలో ఐరా ఖాన్‌తో జరిగిన పరిచయం పెళ్లి వరకు వెళ్లింది. డేటింగ్ సమయంలో ఐరా ఖాన్, నూపూర్ ఇద్దరు చేసిన ఫొటోలు మీడియాలోను, సోషల్ మీడియాలోను వైరల్ అయ్యాయి. వారిద్దరి రొమాంటిక్ టూర్లు అందర్ని ఆకట్టుకొన్నాయి. దాంతో ముంబైలో వారిద్దరి బంధంపై ప్రత్యేకమైన దృష్టిపడింది.