రకుల్ ప్రీత్ మ్యారేజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజునే ఆమె పెళ్లి అంటూ జోరుగా వార్తలు!

RakulPreet singh: ఆమె భగ్నానీతో ఎడడుగులు నడవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 22న గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరి పెళ్లి జరగనుందంటూ ప్రచారం జరుగుతోంది.

Courtesy: x

Share:

తెలుగు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్​ సింగ్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నట్లు సమాచారం. ఆమె ఎంతో కాలం నుంచి బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani)తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. తాజాగా, ఆమె భగ్నానీతో ఎడడుగులు నడవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 22న గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరి పెళ్లి జరగనుందంటూ ప్రచారం జరుగుతోంది. 

కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుందని, ఆ తర్వాత సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా విందు ఇవ్వనున్నారని పలు వార్తలు నెట్టింట్లో వైరల్​ గా మారాయి. దీంతో నెటిజన్లు, అభిమానులు రకుల్ ​కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయంపై రకుల్​ గానీ, జాకీ భగ్నానీ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. గతంలో పలు సందర్భాల్లో వీరి వివాహం గురించి ఇలాంటి వార్తలు వచ్చాయి. అయితే సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటామని అప్పుడు రకుల్‌ స్పష్టతనిచ్చారు.

బీటౌన్‌ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో తాను రిలేషన్‌లో ఉన్నానంటూ 2021లో రకుల్ ప్రకటించారు. అప్పటినుంచి సోషల్​ మీడియాలో ఇద్దరూ కలిసున్న ఫొటోలను షేర్​ చేసుకున్నారు. ఈ అమ్మడి పుట్టిన రోజు (అక్టోబర్ 10) సందర్భంగా జాకీ భగ్నానీ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్స్టాగ్రామ్ ​లో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తన స్పెషల్ పర్సన్​ అంటూ రకుల్ ​కు విషెస్​ చెప్పారు. ఇక త‌మ పెళ్లి డేట్‌ను ఈ జంట త్వర‌లోనే అఫీషియ‌ల్‌గా వెల్లడించే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ 'గిల్లి' అనే కన్నడ సినిమాతో నటిగా తెరంగేట్రం చేశారు. 2013లో విడుదలైన తెలుగు చిత్రం 'కెరటం'తో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుని నిర్మాతల కళ్లలో పడ్డారు. అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. తెలుగు సినీ రంగానికి సంబంధించిన పెద్ద పెద్ద హీరోల అందరి పక్కన నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది.ఆ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. అలా 'లౌక్యం', 'నాన్నకు ప్రేమతో', 'ధృవ',' కిక్ '2 లాంటి సినిమాలతో సౌత్​లో టాప్​ హీరోయిన్స్​ లిస్ట్​లోకి చేరారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఆమె నటించిన 'అయాలన్‌' సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.