Shraddha: ఆసక్తికర విషయాలు పంచుకున్న జెర్సీ హీరోయిన్

వెంకటేష్ గురించి ఏం చెప్పిందంటే..

Courtesy: Twitter

Share:

Shraddha: జెర్సీ సినిమా (Cinema)తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రద్ధా (Shraddha) శ్రీనాథ్ ఫిల్మోగ్రఫీ ఆకట్టుకుంది. నటి వెంకటేష్ (Venkatesh) 'సైంధవ్ (Saindhav)'తో సహా ఆసక్తికరమైన చిత్రాలలో కనిపించబోతోంది. హైదరాబాద్‌లో ఓ సినిమా (Cinema) షూటింగ్‌లో ఉన్న నటిని డెక్కన్ క్రానికల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. శ్రద్ధా (Shraddha) తన కెరీర్ గురించి, బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకోవడం జరిగింది. అవేంటో ఈరోజు చూసేద్దాం.. 

కన్నడలో లోనుంచి టాలీవుడ్ లో, బాలీవుడ్‌ లోకి ఎందుకు షిఫ్ట్ అయ్యారు?: 

నిజంగా సినిమా (Cinema)లో పనిచేయడం అనేది తన కల అని, కేవలం ఒకే భాషలో వర్క్ చేస్తూ వెళుతూ ఉంటే కావలసిన నాణ్యత పరంగా అంతేకాకుండా రెమ్యూనరేషన్ పరంగా వెనకబడే అవకాశం ఉందని, అయితే కెరీర్ గ్రోత్ ఉండాలి అనుకుంటే తప్పకుండా తెలుగు, తమిళ్ లో పని చేయాల్సిన అవసరం ఉందని తెలుసుకున్నట్లు వెల్లడించింది శ్రద్ధా (Shraddha). అయితే నిజానికి కన్నడ తనకి జీవితాన్ని అందించినప్పటికీ తాను ఇంకా చూడాల్సిన విషయాలు చాలా ఉన్నాయని.. ఒక దగ్గరే ఉండిపోవడం తనకి ఇష్టం లేదని చెప్పింది శ్రద్ధా (Shraddha). కన్నడా నుంచి పూర్తిగా వచ్చేయలేదని, తాను అక్కడ కూడా ప్రాజెక్టులు చేయడానికి ఇప్పటికీ ఆసక్తిగా ఉన్నట్లు మాట్లాడింది శ్రద్ధా (Shraddha). షిఫ్ట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేదే అని, ఒక భాషలో పని చేస్తూ మరొక భాషలో పని చేయకూడదు అని నియమం లేదు కాబట్టి ఎవరిష్టం వాళ్లది అంటూ, మన టాలెంట్ పెంచుకుంటూ ముందుకు వెళుతూ పని చేయడమే తనకి ఇష్టం అంటూ వెల్లడించింది శ్రద్ధా (Shraddha).

రకరకాల పాత్రలను ఎందుకు ఎంచుకుంటున్నారు?: 

నిజానికి రకరకాల పాత్రలలో పోషించడం నిజంగా ఒక ప్రయత్నమని, ముఖ్యంగా హీరోయిన్లు అందం, అభినయం ఉన్న పాత్రలకు మక్కువ చూపిస్తున్నప్పటికీ.. అది కొంత వరకే పని చేస్తుందని, వ్యక్తిగతంగా ప్రేక్షకులకు దగ్గర అవ్వాలి అంటే ఎక్కువ పాత్రల్లో ప్రయత్నిస్తూనే ఉండాలి అంటూ శ్రద్ధా (Shraddha) చెప్పుకొచ్చింది. ఒకే రకమైన చిత్రాలు చేస్తూ ఉంటే.. ఒకే రకమైన సినిమా (Cinema)లకు అలవాటు పడిపోతామని అది తనకు ఇష్టం లేదు కాబట్టి రకరకాల పాత్రలలో నటించేందుకు మక్కువ చూపిస్తున్నట్లు వెల్లడించింది శ్రద్ధా (Shraddha). అంతేకాకుండా కొత్త పాత్రలను పోషిస్తే ఎక్కువమంది చూసే అవకాశం ఉంది కాబట్టి, ఎక్కువగా గుర్తింపు వచ్చే అవకాశం ఉందని శ్రద్ధా (Shraddha) తెలివిగా ఆలోచించిన విధానాన్ని వెల్లడించింది. తన గురించి తాను తెలుసుకోవడానికి విభిన్నమైన పాత్రల్లో కనిపించడం తనకి బాగా సహాయపడుతుందని కూడా శ్రద్ధా (Shraddha) వెల్లడించింది. అంతేకాకుండా జెర్సీలో ఒక అమ్మగా ఒక భార్యగా కనిపించిన తాను వేరే సినిమా (Cinema)లలో తన భిన్నమైన షేడ్స్ చూడటం వల్ల మరింత ఆదరణ పొందే అవకాశం ఉందని, అయితే ఒకే రకమైన ఆఫర్లు రావడానికి సమయం పట్టినప్పటికీ, భిన్నమైన పాత్రలలో నటించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శ్రద్ధా (Shraddha) తన కెరీర్ విషయాల గురించి మాట్లాడింది.

పెద్ద హీరోల గురించి మాట్లాడిన శ్రద్ధా: 

పెద్ద హీరోలతో పనిచేయడం నిజంగా సంతోషకరమైన విషయం అని, వెంకటేష్ (Venkatesh) తో కలిసి పని చేయడం తనకి నిజంగా ఆనందంగా అనిపించిందని ఇప్పటివరకు తాను కలిసిన పెద్ద హీరోలలో, వెంకటేష్ (Venkatesh) నిజంగా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని, ప్రతి ఒక్కరిని గౌరవించే మనస్సు కలిగిన వ్యక్తి వెంకటేష్ (Venkatesh) అంటూ, వెంకటేష్ (Venkatesh) తో నటించిన 'సైంధవ్ (Saindhav)' సినిమా (Cinema) విషయాలు మాట్లాడింది శ్రద్ధా (Shraddha). తమ షూటింగ్లో ఉన్న సమయంలో ఎక్కువగా ఆహారం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చాలా బాగా మాట్లాడుకున్నామని చెప్పుకొచ్చింది శ్రద్ధా (Shraddha). బహుముఖ వ్యక్తిత్వం అంటూ చాలా ప్రశాంతంగా కనిపించే వ్యక్తి అంటూ వెంకటేశ్ గురించి చాలా బాగా మాట్లాడింది శ్రద్ధా (Shraddha).