Animal Trailer: ‘యానిమల్’ ట్రైలర్ వచ్చేసింది.. రణబీర్ విశ్వరూపం

నాన్న‌ కోసం ఊచకోత కోస్తున్న రణబీర్..

Courtesy: Twitter

Share:

Animal Trailer: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor), దర్శకుడు సందీప్ వంగా(Sandeep Reddy Vanga) కాంబోలో వస్తున్న చిత్రం ‘యానిమల్’(Animal) . తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్(Trailer) విడుదల అయ్యింది.

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కాంబినేషన్ తో తెరకెక్కిన తాజా చిత్రం ‘యానిమల్(Animal). నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజ‌ర్‌, మ్యూజికల్ అప్ డేట్స్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను(Trailer) రిలీజ్ చేశారు మేకర్స్.

‘యానిమల్‘(Animal) ట్రైలర్ 3 నిమిషాల నిడివితో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ట్రైలర్(Trailer) అంతా తండ్రి, కొడుకుల మధ్య అనుబంధం చుట్టే తిరుగుతుంది. ఎమోషన్, యాక్షన్‌తో రక్తసిక్తం అయ్యింది. కత్తిపోట్లు, తుపాకీ తూటాల శబ్దంతో భయంకరంగా ఉంది. సినిమాలో పూర్తిగా బాలీవుడ్ (Bollywood) నటులే ఉన్నా, సౌత్‌కు(South) దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది. రణ్‌బీర్‌ కపూర్‌పై(Ranbir Kapoor) యాక్షన్‌ సన్నివేశాలు, ఎమోషనల్‌ సీన్స్‌ (Emotional scenes) సినిమాపై భారీగా అంచనాలు పెంచుతున్నాయి. సినీ అభిమానులు ట్రైలర్ తోనే సినిమా హిట్ అయ్యిందంటున్నారు. సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) మేకింగ్‌ స్టైల్‌ అద్భుతం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో అస‌లైన వైలెన్స్ ఎలా ఉంటుందో ‘యానిమాల్‌’(Animal)లో చూపిస్తానని సందీప్ (Sandeep) కామెంట్ చేశారు. దానికి తగినట్లుగానే ట్రైల‌ర్‌ బ్ల‌డ్ లో మునిగిపోయింది. ట్రైలర్ (Trailer) కొన్ని సీన్లు కట్టిపడేస్తాయి. తండ్రిపై కొడుక్కు ఉండే భయానక ప్రేమ ఆకట్టుకుంటోంది.  

‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) త‌ర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ మూవీపై అంచ‌నాలు విప‌రీతంగా ఉన్నాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డి ర‌ణబీర్‌ను ఎలా చూపిస్తారు? సందీప్ డైరెక్ష‌న్ ఎలా ఉంటుంది? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ట్రైలర్‌తో బొమ్మ అదుర్స్ అనిపించేలా చేశారు సందీప్. అండర్ వరల్డ్ క్రైమ్ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. తండ్రి, కొడుకుల మధ్య సెంటిమెంట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ క్లియరెన్స్ (Sensor clearance) తీసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ (A certificate) జారీ చేసింది. సినిమా రన్ టైమ్ (Cinima Run Time) 3 గంట‌ల 21 నిమిషాల 23 సెక‌న్లుగా ఫిక్స్ అయ్యింది. సందీప్ వంగా (Sandeep Vanga) దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో తెలుగులో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్(Bollywood) స్టార్స్ అనిల్ కపూర్(Anil Kapoor), బబ్లూ పృథ్వీరాజ్(Bablu Prithviraj), బాబీ డియోల్ (Bobby Deol) సహా పలువు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో రణబీర్, సందీప్ కలిసి బాలీవుడ్(Bollywood) బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

‘యానిమల్’ ‘(Animal) ప్రమోషన్స్‌లో (Promotions) భాగంగా ఇప్పటికే దుబాయ్‌లోని అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై (Burj Khalifa) మూవీ గ్లింప్స్‌ను ఒక నిమిషాం పాటు ప్లే చేసింది మూవీ టీమ్. బుర్జ్ ఖలీఫాపై(Burj Khalifa) స్క్రీనింగ్‌తో ‘యానిమల్’(Animal) ప్రమోషన్స్ ఊపందుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో రణబీర్ కపూర్, రష్మికతో పాటు అనిల్ కపూర్(Anil Kapoor), బాబీ డియోల్ (Bobby Deol) వంటి సీనియర్ నటులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా ‘యానిమల్’ (Animal) సినిమా కథ.. తండ్రి, కొడుకుల అనుబంధం చుట్టూ తిరుగుతుంది అని ఎప్పటినుండో సోషల్ మీడియాలో (Social Media) వార్తలు వైరల్ (Viral) అవుతుండగా.. అది నిజమే అనిపించేలా ‘పాపా మేరీ జాన్’(Papa Mary John) అంటూ తండ్రి సెంటిమెంట్‌పై సాగే ఒక పాటను మూవీ టీమ్ విడుదల చేసింది. దీంతో అసలు కథ ఏంటో తెలుసుకోవడానికి నవంబర్ 23వ తేదీన విడుదల కానున్న ట్రైలర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రష్మిక కూడా తనకు బాలీవుడ్‌(Bollywood)లో ఈ మూవీ పెద్ద బ్రేక్ ఇవ్వనుందని నమ్మకంతో ఉంది.