సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 7 బ్యూటీ!

Bigboss season 7: ఈ భామ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. యశ్వంత్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు తన అఫీషియల్ యూట్యూబ్‌ ఛానెల్‌లో ఒక వీడియోను అప్‌లోడ్‌ చేసింది.

Courtesy: X

Share:

బిగ్ బాస్ ఏడో సీజన్‌లో టాప్‌ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టిన కన్నడ బ్యూటీ శోభా శెట్టి తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా, ఆమె ఇప్పటికే ‘మా’ టీవీలో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్‌లో విలన్ పాత్రలో మోనితగా అందరికీ సుపరిచితురాలే. బిగ్ బాస్ హౌస్‌లో అబ్బాయిలతో సమానంగా ఆడుతూ.. తన సత్తా చాటింది. కానీ ఫైనల్ వరకు వెళ్లలేకపోయింది. కానీ శోభా ఆటతీరు, మాటతీరు, అందంతో బుల్లితెర ఆడియన్స్‌ను అలరించింది. ముఖ్యంగా శివాజీ, పల్లవి ప్రశాంత్‌, ప్రిన్స్‌ యావర్‌ తో సై అంటే సై అని పోటీ పడింది. మాటకు మాట చెబుతూ వారికి చుక్కలు చూపించింది. అయితే ఈ ముద్దుగుమ్మకు ఇదే కాస్త నెగెటివిటీని తెప్పించింది. దీని ప్రభావమే ఓటింగ్‌పైనా పడిందంటూ కామెంట్లు వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే..  ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. 

సీక్రెట్ గా యశ్వంత్ తో ఎంగేజ్ మెంట్
ఆమె ఇప్పటికే బిగ్ బాస్ హౌస్‌లో తన ప్రేమ విషయం పంచుకుని ఒక్కసారిగా అందరికీ షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. కార్తీక దీపం సీరియల్‌లో తనతో పాటు నటించిన యశ్వంత్ రెడ్డితో లవ్‌లో ఉన్నానని చెప్పింది. అయితే తాజాగా ఈ భామ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. యశ్వంత్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు తన అఫీషియల్ యూట్యూబ్‌ ఛానెల్‌లో ఒక వీడియోను అప్‌లోడ్‌ చేసింది. దీనిని చూసిన వారందరూ షాక్‌ అవుతున్నారు. ఈ వీడియోలో ఇద్దరూ పూల దండలు మార్చుకున్నారు. తర్వాత ఉంగరాలు మార్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఒక టీవీ ప్రోగ్రాం కోసమే శోభ, యశ్వంత్‌లు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

దీనిపై శోభా మాట్లాడుతూ.. ‘యశ్వంత్ నాకోసం సర్‌ప్రైజ్ ఇవ్వడానికి టీవీ షోకు వస్తాడని అసలు ఊహించలేదు. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. షో వేదికపైనే మాకు నిశ్చితార్థం కూడా చేయించారు. యశ్వంత్‌ రింగ్ తీసుకొచ్చాడు. దండలు కూడా మార్చుకున్నాం. అలాగే ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాడు. నేను, యశ్వంత్ ఇద్దరం కలిసి ఒక టీవీ షోలో కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్. నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ శోభా శెట్టి చెప్పుకొచ్చింది. దీనికి యశ్వంత్‌ స్పందిస్తూ.. ‘ఇలా ప్లాన్‌ చేస్తున్నామంటే వచ్చాను. కేవలం 10 నిమిషాలే మీరు సర్‌ ప్రైజ్‌ ఇస్తే బాగుంటుంది అన్నారు. నేను కూడా నీకు ఎప్పుడూ సర్‌ ప్రైజ్‌ ఇవ్వలేదు కదా అందుకే ఇలా మొదటిసారి ట్రై చేద్దామని భావించాను. ఇదే ఫస్ట్. మళ్లీ ఎప్పుడూ ఇలా రాను’ అని అన్నాడు.