సినిమాల్లోకి పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ SPY టీం కీలక నిర్ణయం

Bigboss season 7 SPY: బిగ్ బాస్ సీజన్ 7 కు చెందిన SPY (శివాజీ, ప్రశాంత్, యావర్) టీం అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఈ స్పై టీం సినిమా తీయబోతున్నట్లు వెల్లడించింది.

Courtesy: Top Indian News

Share:

బిగ్ బాస్ సీజన్ 7 కు చెందిన SPY (శివాజీ, ప్రశాంత్, యావర్) టీం అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఈ స్పై టీం సినిమా తీయబోతున్నట్లు వెల్లడించింది. ఈ సీజన్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచినా విషయం తెలిసిందే. అయితే సీజన్ 7లో శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ ఈ ముగ్గురి బాండ్ జనాలను ఎంతో ఆకట్టుకుంది. బిగ్ బాస్ లో ఎంతో స్నేహపూర్వకంగా ఉన్న వీరు బయటకు వచ్చాక కూడా వారి స్నేహం అలాగే కొనసాగుతోంది. ఇటీవల యావర్, పల్లవి ప్రశాంత్ కలిసి శివాజీ ఇంటికి వెళ్లి లంచ్ కూడా చేశారు. అక్కడ చాలా ఎమోషనల్ మూమెంట్స్ కూడా జరిగాయి. అందులో భాగంగానే, స్పై బ్యాచ్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు నటుడు శివాజీ. 

ఈ ప్రాజెక్టు గురించి ఆయన మాట్లాడుతూ.. త్వరలో స్పై టీం సభ్యులు యావర్‌, ప్రశాంత్‌లతో ఓ మూవీ చేస్తున్నాను. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందన్నారు. "ఆ సినిమా టైటిల్‌ కూడా స్పై. నా 25 ఏళ్ల సినీ కెరీర్‌లో ప్రశాంత్‌, యావర్‌ల అంత బాండింగ్‌ ఎవరితోనూ ఏర్పడలేదు. కేవలం వాళ్ళకోసమే ఈ సినిమా చేస్తున్నాను. ఈ విషయం ప్రశాంత్, యావర్‌లకు కూడా చెప్పాను. యావర్‌ని సిక్స్ ప్యాక్ బాడీ కోసం వర్కౌట్ చేయమని చెప్పాను.. ప్రశాంత్‌కి కూడా చెప్పాను. ఈ ప్రాజెక్ట్ కోసం వర్కౌట్ చేస్తున్నా. నా ప్రయత్నం నేను చేస్తున్నా. అయితే.. అది షార్ట్‌ ఫిలిమా, ఫుల్‌ సినిమానా అనేది త్వరలో వెల్లడిస్తాము. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్తుంది" అంటూ చెప్పుకొచ్చారు శివాజీ. ఈ విషయం తెలుసుకున్న స్పై బ్యాచ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

"ప్రశాంత్‌ని రెండు ముఖాలని అంటున్నారు.. ఈ సమాజంలో రెండు ముఖాలు లేని వాడు ఎవడు? వాడు గెలిచాడు కాబట్టి అంటున్నారు. ఇక్కడ ఎవడూ ఎవడి లైఫ్‌ని డిసైడ్ చేయలేరు. ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడని.. లైఫ్ మొత్తం అయిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. వాడి లైఫ్ పోయిందని చెప్పడానికి మీరెవరు? ప్రశాంత్ అనే వాడు మంచి ఆర్టిస్ట్ అవుతాడు మీరే చూడండి. బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లిన తరువాతే.. శివాజీ అంటే ఏంటో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు నాకు తోచింది చేశా.. ఇప్పుడు బయటకు వచ్చిన తరువాత కూడా చేస్తాను. వాళ్లతో సినిమా తీయబోతున్నాను.. SPY సినిమా గురించి మిగిలిన విషయాలు త్వరలో చెప్తాను" అని శివాజీ వెల్లడించారు.