లేడీ సూపర్ స్టార్ నయనతారపై కేసు నమోదు.. ఎందుకో చూడండి!

Nayantara: నీలేశ్‌ కృష్ణ దర్శకత్వంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల అన్నపూరణి (Annapoorani) అనే సినిమాలో నటించింది.

Courtesy: x

Share:

నీలేశ్‌ కృష్ణ దర్శకత్వంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల అన్నపూరణి (Annapoorani) అనే సినిమాలో నటించింది. అయితే, ఈ సినిమా విషయంలో నయనతారపై కేసు నమోదైంది. ఇందులో కొన్ని సన్నివేశాలు ఒక మతానికి చెందిన మనోభావాలను కించ పరిచేలా ఉన్నాయని, లవ్ జిహాద్ ను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ముంబయికి చెందిన ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో పోలీసులు నయనతారపై విచారణ జరిపారు. జై, నీలేశ్‌లతోపాటు నిర్మాతలు జతిన్‌ సేథీ, ఆర్‌ రవీంద్రన్‌, పునీత్‌ గోయెంకాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.  రీసెంట్గా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 

అన్నపూరణి సినిమాపై మాజీ శివసేన నేత రమేశ్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సన్నివేశాలు శ్రీరాముడిని కించపరిచేలా ఉన్నాయంటూ సోలంకి రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా..లవ్ జిహాద్ను ప్రోత్సహించేలా సీన్స్ ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ  మేరకు ఫిర్యాదు చేసిన విషయాన్ని తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అన్నపూరణి సినిమాను నిర్మించిన నిర్మాతలతో పాటు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్, దర్శకుడు నీలేష్ కృష్ణ, హీరోయిన్ నయనతార,జై ఇలా పలువురి మేకర్స్ పై తగిన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. అంతేకాకుండా..వీరందరిపై త్వరగా తగిన చర్యలు తీసుకోవాలని.. స్ట్రీమింగ్ ఆపేయాలని మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను అభ్యర్థించారు. అయితే ఇప్పటివరకు ఈ ఫిర్యాదుపై అన్నపూరణి మేకర్స్ నుంచి ఎవరు స్పందించలేదు. 

సౌత్‌ ఇండియా లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార తన కెరియర్‌లో  బెంచ్‌మార్క్‌ చిత్రంగా 'అన్నపూరణి' చిత్రం డిసెంబర్ 1, 2023న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. తన సినీ జీవితంలో 75వ సినిమాగా డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'అన్నపూరణి' ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో జై, సత్యరాజ్, కేఎస్‌ రవికుమార్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. నిలేష్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ కేవలం తమిళంలో మాత్రమే రిలీజైంది. కానీ ఓటీటీలో మాత్రం తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది.