Varun Tej-Lavanya: లావ‌ణ్య వ‌రుణ్‌ల వివాహ వీడియో రైట్స్ నెట్‌ఫ్లిక్స్‌కి?

Varun Tej-Lavanya: టాలీవుడ్ (Tollywood) లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి (Varun Tej- Lavanya)ల పెళ్లి (Marriage) గురించే చర్చ నడుస్తోంది. ఈ జంట ప్రేమించుకుంటున్నట్లు ఎక్కడ కూడా బయటపడలేదు. సడెన్ గా వీరు పెళ్లి చేసుకునే సరికి అందరూ షాక్ అయ్యారు. వీరి పెళ్లి ఇటలీలో (Italy) గ్రాండ్ గా జరిగింది. ఇటలీకి కొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్లారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ (Destination Wedding) అనేవి […]

Share:

Varun Tej-Lavanya: టాలీవుడ్ (Tollywood) లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి (Varun Tej- Lavanya)ల పెళ్లి (Marriage) గురించే చర్చ నడుస్తోంది. ఈ జంట ప్రేమించుకుంటున్నట్లు ఎక్కడ కూడా బయటపడలేదు. సడెన్ గా వీరు పెళ్లి చేసుకునే సరికి అందరూ షాక్ అయ్యారు. వీరి పెళ్లి ఇటలీలో (Italy) గ్రాండ్ గా జరిగింది. ఇటలీకి కొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్లారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ (Destination Wedding) అనేవి మన దగ్గర ఎప్పటి నుంచో ట్రెండింగ్ (Trend) లో ఉంటున్నాయి. కావున ఈ జంట కూడా  డెస్టినేషన్ వెడ్డింగ్ తోనే ఒక్కటయింది. ఈ జంట ఇప్పటికే అనేక సినిమాలలో కూడా నటించింది. అయినా కానీ వీరి ప్రేమ గురించి ఎక్కడా ఒక్క వార్త కూడా రాలేదు. ఇక ఇటలీలో నవంబర్ 1వ తేదీన పెళ్లి చేసుకున్న ఈ జంట తర్వాత హైదరాబాద్ (Hyderabad) లో సినీ ప్రముఖులకు గ్రాండ్ గా రిసెప్షన్ (Reception)  అరేంజ్ చేసింది. 

ఓటీటీలోకి పెళ్లి వేడుక.. 

సెలబ్రెటీల (Celebrity) పెళ్లి అంటే అందరిలో ఒక రకమైన క్యూరియాసిటీ (Curiocity) ఉంటుంది. ఆ క్యూరియాసిటీయే ఇప్పుడు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల (Varun Tej- Lavanya)కు కలిసి రానుందని టాక్ నడుస్తోంది. వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఈ జంట తమ పెళ్లి వీడియోను (Marriage Video) ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంకు విక్రయించినట్లు తెలుస్తోంది. నెట్‌ ఫ్లిక్స్ (Netflix) ఇండియా వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి (Varun Tej- Lavanya) వివాహ వీడియో యొక్క ప్రత్యేక ప్రసార హక్కులను పొందిందని వినికిడి. ఈ స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ 8 కోట్ల రూపాయలను చెల్లించినట్లు సమాచారం. ఈ వార్త అభిమానులలో ఉత్కంఠను రేకెత్తించింది, వారి పెళ్లి ఎలా జరిగిందనే ఎగ్జైట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఓటీటీ ప్లాట్ ఫాం  నెట్‌ ఫ్లిక్స్ నుంచి కానీ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి (Varun Tej- Lavanya) నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

గతంలో కూడా.. 

ఇలా సెలబ్రెటీల పెళ్లి వీడియోలు ఓటీటీలో దర్శనం ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇటువంటి వేడుకలు ఓటీటీలో దర్శనం ఇచ్చాయి. గతంలో నయనతార (Nayanatara) మరియు విఘ్నేష్ శివన్‌ ల పెళ్లికి సంబంధించిన వేడుకను కూడా కొనుగోలు చేసిందని వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఇందుకు సంబంధించిన వేడుక మాత్రం స్ట్రీమ్ కాలేదు. వీరి కాంట్రాక్ట్ మధ్య ఏదో సమస్య తలెత్తడం వల్లే ఇలా జరిగిందని వార్తలు వచ్చాయి. 

మరోరకంగా ముందుకొచ్చిన హన్సిక

దేశముదురుతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా మంది అగ్రహీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న హన్సిక (Hansika) కూడా తన పెళ్లి వీడియోను ఓటీటీలోకి విడుదల చేసింది. తన వివాహ డాక్యుమెంటరీ, లవ్ షాదీ డ్రామాను ప్రకటించి అందర్నీ సర్ ప్రైజ్ చేసింది. ఇది డిస్నీ+ హాట్‌స్టార్‌లో (Hotstar) ప్రసారం చేయబడింది. ఈ భామ డిసెంబర్ 4వ తేదీన తన ప్రియుడిని (Lover) వివాహం చేసుకుంది. ఈ వీడియోను చాలా మంది హాట్ స్టార్ వేదికగా తిలకించారు. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి వీడియో కూడా ఓటీటీలోకి వస్తుందని చాలా మంది ఈగర్ గా వెయిట్ (Wait) చేస్తున్నారు. 

అబద్దమని కూడా చెప్పని నెట్ ఫ్లిక్స్

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల (Varun Tej- Lavanya) పెళ్లి వీడియో నెట్ ఫ్లిక్స్ లోకి రానుందని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇంత ఘోరంగా వైరల్ అయినపుడు ఆ వార్త అబద్దం అయితే నెట్ ఫ్లిక్స్ ఖండించేది. కానీ నెట్ ఫ్లిక్స్ మాత్రం ఈ వార్తలను ఖండించలేదు. నెట్ ఫ్లిక్స్ తో పాటు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి (Varun Tej- Lavanya) జంట కూడా ఈ వార్తలను తోసిపుచ్చలేదు. దీంతోనే ఫ్యాన్స్ ఈ వార్తల్లో ఎంతో కొంత నిజం ఉందని అనుకుంటున్నారు. అవి తప్పుడు వార్తలు అయితే ఈ జంట ఖండించేదని కానీ ఖండించలేదంటే నిజం అవుతాయని అంతా అంటున్నారు. 

ట్విస్ట్ ఇచ్చిన ప్రతినిధి

నెట్ ఫ్లిక్స్ కానీ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి (Varun Tej- Lavanya) కానీ ఈ వార్తలను ఖండించలేదని అంతా సంబరపడిపోయేలోపే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి తరఫున వారి ప్రతినిధి (Spokesperson) ఈ వార్తలపై స్పందించారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం అని తెలిపారు. ఇందులో ఎటువంటి నిజం లేదని, ఇవి పూర్తిగా ఊహాజనిత వార్తలు అని అతడు ఖండించాడు.

గ్రాండ్ లుక్ లో జంట..  

వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి (Varun Tej- Lavanya) కొన్ని చిత్రాలలో హీరో హీరోయిన్లుగా నటించారు. వీరు చాలా రోజుల పాటు డేటింగ్ లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు జూన్ 2023 లో నిశ్చితార్థం (Engagement) చేసుకున్నారు. నవంబర్ 1, 2023న ఇటలీలోని టస్కానీలో దగ్గరి బంధువుల సమక్షంలో ఒక్కటయ్యారు. ఈ జంట పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. వరుణ్ తేజ్ మనీష్ మల్హోత్రా  (Manish malhotra) డిజైన్ చేసిన క్రీమ్-గోల్డ్ షేర్వానీని ధరించగా, లావణ్య త్రిపాఠి అదే డిజైనర్ డిజైన్ చేసిన కాంచీపురం చీరను ధరించింది. వీరి వివాహానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ జంట వివాహ రిసెప్షన్ నవంబర్ 5, 2023 న హైదరాబాద్‌ లో జరిగింది. ఈ ఈవెంట్ కు తెలుగు చిత్రసీమలోని అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.