Vanitha Vijay Kumar: వనితా విజయ్ కుమార్ మీద దాడి..మొహంపై గాయాలు..!

బిగ్ బాస్ షోలే కారణమా

Courtesy: Twitter

Share:

Vanitha Vijay Kumar: తాజాగా వనిత విజయ్ కుమార్(Vanitha Vijay Kumar).. తన ముఖంపై ఉన్న గాయాలను చూపిస్తూ తనపై దాడి చేశారు అంటూ ఒక పోస్ట్ షేర్ చేసిన విషయం తెలిసిందే. అసలు విషయంలోకి వెళ్తే తన కూతురు జోవికా(Jovica) ప్రస్తుతం తమిళంలో బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss Season 7)లో కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. అక్కడ ఈమె అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ ఆంటోనీతో(Pradeep Antony) వైరం పెంచుకుంది. ఇక వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ప్రదీప్ ఆంటోనీ(Pradeep Antony) అభిమానులు వనిత విజయ్ కుమార్(Vanitha Vijay Kumar). పై దాడి చేసినట్లు సమాచారం. వనిత విజయ్ కుమార్ తన కూతురు జోవికాకు అండగా నిలుస్తూ ప్రదీప్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తుండగా ఆయన అభిమానులు ఈమెపై ఇలా దాడి(Attack) చేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో నవంబర్ 25న తనపై దాడి జరిగిందని ఆమె సోషల్ మీడియా(Social Media) ద్వారా వెల్లడించింది. ఆ ఫొటోలను కూడా ఆమె ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇక పోతే తాజాగా తన ముఖానికి అయిన గాయాలను ఆమె చూపిస్తూ ఆటను కేవలం ఆటలాగే చూడాలి.. ఇలా శారీరకంగా హింసకు పాల్పడడం సమంజసం కాదు అంటూ కామెంట్లు చేసింది. దీనికి బిగ్ బాస్ స్టార్ ప్రదీప్ ఆంటోనీ(Bigg Boss star Pradeep Antony) అభిమాని అని తెలుస్తోందని, అతన్ని విచారిస్తే అన్ని విషయాలూ బయటికొస్తాయని చెప్పింది. "రాత్రి బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ చెప్పి నేను డిన్నర్ కోసం బయటకు వచ్చాను. మా అక్క సౌమ్య ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్న కారు తీయడానికి వస్తుండగా.. రాత్రి 11సమయంలో.. ఆ చీకట్లోనుంచి ఓ వ్యక్తి కనిపించాడు. నీకు రెడ్ కార్డ్ (Red Card) గుర్తుందా" అంటూ కొట్టాడని వనిత విజయ్ కుమార్(Vanitha Vijay Kumar) ఆవేదన వ్యక్తం చేసింది. రెడ్ కార్డ్(Red Card) వివాదంలో మీ సపోర్ట్ కూడా ఉందంటూ ఆ వ్యక్తి పారిపోయాడని ఆమె వెల్లడించింది. దీంతో తన ముఖంపై రక్తం వచ్చిందని, అలా అరుస్తూ ఏడ్చానని వనిత చెప్పింది.

అప్పటికి అర్థరాత్రి ఒంటిగంట అయిందన్న ఆమె.. వెంటనే తన అక్కకు ఫోన్ చేశానని, ఆమె పోలీసులకు కంప్లయింట్ (Police Complaint) చేయమని సలహా ఇచ్చిందని చెప్పింది. కానీ తాను అంతగా వారిని నమ్మనందున వారికి చెప్పలేదంది. అప్పుడు హాస్పిటల్ వెళ్లి.. ట్రీట్మెంట్ తర్వాత ఇంటికెళ్లానని తెలిపింది. తనపై ఎవరు దాడి చేశారో తెలియదని, కానీ అతను పిచ్చివాడిలా నవ్విన నవ్వును తాను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానని వనిత తెలిపింది. ప్రస్తుతం తాను రెస్ట్ తీసుకుంటున్నానని, ఈ స్థితిలో తెర ముందుకు రావడం సాధ్యం కాదని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన పోస్ట్ కి పలువురు నెటిజెన్లు మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్(Bigg Boss Season 7) నుంచి రెడ్ కార్డ్ అందుకున్న ప్రదీప్ అంటోనీ(Pradeep Antony) తన ఎక్స్ ద్వారా తన అభిప్రాయాన్ని షేర్ చేస్తూ ఆమెకు క్షమాపణ తెలిపారు.

ఆయన వనిత విజయ్ కుమార్ తో(Vanitha Vijay Kumar) చిట్ చాట్(Chit Chat) చేసిన వాట్సాప్ మెసేజ్ ల స్క్రీన్ షాట్ (Screen Shot)షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు. నా కంటెస్టెంట్‌లలో ఎవరికీ వ్యతిరేకంగా నేను వ్యవహరించలేదు. నిజంగా నాకు ఏమీ తెలియదు నేను ఎవరితోనూ విరుద్ధంగా మాట్లాడలేదు. ముఖ్యంగా వనిత విజయ్ కుమార్(Vanitha Vijay Kumar) మీకు ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ నేను మీ పై జరిగిన దాడికి చింతిస్తున్నాను.. విశ్రాంతి తీసుకోండి.. జోవిక చాలా తెలివైనది.. ఆమె తనంతట తానుగా గెలవగలదు. ఆమెకు మీ సహాయం అవసరం లేదు అంటూ ప్రదీప్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఇక ప్రదీప్ అంటోనీ(Pradeep Antony) విషయానికి వస్తే ఇటీవల నటుడిగా మారిన ఈయన మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత కోలీవుడ్ లో(Kollywood) ఎంతోమంది నటుల తో కలిసి పని చేసిన ఈయన తమిళనాడులోని చెన్నైలో పుట్టి పెరిగారు. విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీని పొందిన ప్రదీప్ అంటోని(Pradeep Antony) స్క్రిప్ట్ రైటింగ్ , ఆర్ట్ డైరెక్షన్, కాన్సెప్ట్యులైజేషన్ విభాగాలలో అద్భుతమైన ప్రతిభ కలిగి ఉన్నారు. ఇతను అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే కాదు అంతకుమించి అద్భుతంగా పాటలు కూడా పాడగలరు. అంతేకాదు మంచి డాన్సర్ కూడా. వనిత విజయ్ కుమార్ పై జరిగిన దాడికి క్షమాపణలు కోరుతూ చేసిన పోస్ట్ పై నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.