Trisha: త్రిషకు సారీ చెప్పిన మన్సూర్ అలీఖాన్

త్రిష స్పందన ఇదీ…

Courtesy: Twitter

Share:

Trisha: కోలీవుడ్‌లో(Kollywood) తాను చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపడంతో వాటికి ఫుల్‌స్టాప్ పెట్టాలని మన్సూర్ అలీ ఖాన్ (Mansoor Ali Khan) నిర్ణయించుకున్నాడు. అందుకే త్రిషకు(Trisha) సారీ చెప్పాడు. త్రిష కూడా తన సారీకి (Sorry) స్పందించింది.

ప్రస్తుతం కోలీవుడ్‌లో(Kollywood) కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న విషయం ఏంటో చాలా మందికి తెలిసింది. తన సహనటి, సీనియర్ హీరోయిన్ అయిన త్రిషపై(Trisha) సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మన్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan) చేసిన కామెంట్స్ అసభ్యకరంగా ఉండడంతో దానిని ఖండిస్తూ ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ముందుకొచ్చారు. ఆయన ఆ కామెంట్స్ చేసిన కొద్దిసేపట్లోనే వైరల్ అయ్యి.. త్రిష(Trisha) సైతం వాటికి రియాక్ట్ అయ్యింది. అంత జరిగినా తాను సారీ చెప్పనని, తాను అన్న మాటల్లో తప్పు లేదు అన్న మన్సూర్.. తాజాగా త్రిషకు(Trisha) క్షమాపణలు చెప్పాడు. బాగా ఆలోచించిన తర్వాత త్రిష కూడా.. మన్సూర్ సారీకి రియాక్ట్ అయ్యింది.

‘‘నా సహ నటి త్రిషకు సారీ’’ అంటూ తాజాగా ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు మన్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan) . ఇక మన్సూర్ చెప్పిన సారీకి (Sorry) ట్విటర్ ద్వారా రియాక్ట్ అయ్యింది త్రిష(Trisha). ‘‘తప్పులు చేయడం మానవ సహజం. క్షమించడం దైవత్వం’’ అంటూ పోస్ట్ షేర్ చేసింది ఈ సీనియర్ హీరోయిన్. ఇటీవల త్రిషపై(Trisha) చేసిన కామెంట్స్ వల్ల మన్సూర్ అలీ ఖాన్‌పై(Mansoor Ali Khan) 354ఏ (లైంగిక వేధింపులు), సెక్షన్ 509 (మహిళలను కించపరచడం) వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ కోసం పోలీసుల ముందు హాజరయ్యాడు మన్సూర్. ఆ మరుసటి రోజే త్రిషకు సారీ చెప్పి ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి త్రిష(Trisha) ‘‘తప్పు చేయడం మానవ సహజం, క్షమించడం దైవత్వం’’ అని సమాధానం ఇచ్చింది.

ఇటీవల లోకేశ్ కనకరాజ్(Lokesh Kanakaraj) తెరకెక్కించిన ‘లియో’(Leo) చిత్రంలో త్రిషతో పాటు మన్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan) కూడా కీలక పాత్రలో నటించాడు. అయితే తను నటించిన ఇంతకు ముందు సినిమాల్లోలాగా హీరోయిన్‌ను బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి రేప్ చేసే సీన్(Rape scene) ఉంటుందేమో అని ఆశించానని కానీ షూటింగ్ జరుగుతున్నంత కాలం కనీసం తనకు త్రిషను(Trisha) చూపించలేదని ఒక ఈవెంట్‌లో మన్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan) ఓపెన్ కామెంట్స్ చేశాడు. త్రిష సైతం ఈ కామెంట్స్‌కు వెంటనే రియాక్ట్ అయ్యింది. ఈ కామెంట్స్ చాలా అసభ్యకరంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. ఇలాంటి కామెంట్స్‌ను తాను ఖండిస్తున్నానంటూ, ఇక జీవితంలో మన్సూర్ అలీ ఖాన్‌తో(Mansoor Ali Khan) కలిసి నటించడం కుదరదు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

ఆయన వ్యాఖ్యలను త్రిషతో(Trisha) పాటు పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఈ వ్యవహారంపై మన్సూర్‌ అలీ ఖాన్‌కు(Mansoor Ali Khan) నోటీసు జారీ చేసింది. అందులో త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మిమ్మల్ని సంఘం సభ్యత్వం నుంచి ఎందుకు తొలగించ కూడదో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.

త్రిష ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై రియాక్ట్ అవ్వడానికి మన్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan) .. ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశాడు. తను మామూలుగా అన్న మాటల వల్ల కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారని, తనంటే ఇష్టం లేని వాళ్లు కావాలనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించాడు. అంతే కాకుండా ఈ విషయంలో సారీ చెప్పడం కుదరదు అంటూ అందరి ముందు ప్రకటించాడు. కానీ పోలీస్ విచారణకు వెళ్లి వచ్చిన తర్వాత మన్సూర్ మనసు మారిపోయినట్టుంది. అందుకే త్రిషకు(Trisha) సారీ చెప్పి ఈ వివాదాన్ని ముగించాలని అనుకున్నాడు. త్రిష కూడా పెద్దగా రియాక్ట్ అవ్వకుండా ఇన్‌డైరెక్ట్‌గా మన్సూర్‌ను(Mansoor Ali Khan) క్షమిస్తున్నట్టు పోస్ట్ పెట్టి ఈ వివాదాన్ని ముగించింది. మరి ఇప్పటికైనా ఈ విషయం గురించి సోషల్ మీడియాలో(Social Media) చర్చలు ఆగుతాయేమో చూడాలి.