నితిన్ దేశాయ్ ఆత్మహత్య కేసులో ఎడిల్‌వీస్ గ్రూప్ చైర్మన్‌పై ఎఫ్‌ఐఆర్

ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య ఆరోపణలపై మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ పోలీసులు శుక్రవారం ఎడిల్‌వీస్ గ్రూప్‌కు చెందిన ఐదుగురిపై మరియు కంపెనీ చైర్మన్ రాషెష్ షాపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో కేయూర్ మెహతా, స్మిత్ షా, ఆర్‌కే బన్సాల్, జితేంద్ర కోట్రీ పేర్లు ఉన్నాయి. రుణం చెల్లించాలంటూ దేశాయ్ ను నిందితులు వేధించారని అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. Edelweiss ARC, ఒక ప్రకటనలో, రుణ రికవరీ […]

Share:

ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య ఆరోపణలపై మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ పోలీసులు శుక్రవారం ఎడిల్‌వీస్ గ్రూప్‌కు చెందిన ఐదుగురిపై మరియు కంపెనీ చైర్మన్ రాషెష్ షాపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో కేయూర్ మెహతా, స్మిత్ షా, ఆర్‌కే బన్సాల్, జితేంద్ర కోట్రీ పేర్లు ఉన్నాయి.

రుణం చెల్లించాలంటూ దేశాయ్ ను నిందితులు వేధించారని అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. Edelweiss ARC, ఒక ప్రకటనలో, రుణ రికవరీ కోసం దేశాయ్‌పై ఎటువంటి అనవసరమైన ఒత్తిడి తీసుకురాలేదని ఖండించారు

ఎఫ్ఐఆర్ కాపీ ప్రకారం, బాధితుడు నితిన్ దేశాయ్ తన స్టూడియో బాగా  నడుస్తున్నప్పుడు, ఎడెల్వీస్ తనకు పెద్ద రుణం ఇచ్చిందని ఆరోపించారు. కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత వ్యాపారం కుప్పకూలిన తర్వాత రుణం తిరిగి చెల్లించాలని నిందితుడు 57 ఏళ్ల దేశాయ్‌ను వేధించాడని అతని భార్య ఫిర్యాదు చేసింది అని  పోలీసులు తెలిపారు.

నితిన్ దేశాయ్ ఆత్మహత్యకు అప్పులే కారణం… 

2005లో ముంబై శివార్లలోని కర్జత్ లో అతడు ఎన్డీ స్టూడియోస్ ఓపెన్ చేశాడు. 52 ఎకరాల్లో విస్తరించిన ఈ స్టూడియోలో ఎన్నో సినిమా సెట్లు వేశారు. జోధా అక్బర్ సినిమా కూడా ఈ స్టూడియోలోనే తీశారు.

 20 ఏళ్లుగా బాలీవుడ్‌లో ఫేమస్ ఆర్ట్ డైరక్టర్‌గా ఉన్న నితిన్ దేశాయ్ ఆత్మహత్య బాలీవుడ్‌ను షాక్ కు గురిచేసింది. నితిన్ మరణంతో సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే, అప్పుల భారంతో నితిన్ ఒత్తిడి ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. 

నితిన్ చంద్రకాంత్ దేశాయ్ చెల్లించాల్సిన మొత్తం అప్పు రూ. 252 కోట్లు..అయితే 2016, 2018 సంవత్సరాల్లో నితిన్ సీఎఫ్ఎం ఫైనాన్స్ సంస్థ నుంచి మొత్తం రూ.180 కోట్లను అప్పుగా తీసుకున్నారట. దీని కోసం  42 ఎకరాల స్థలం, ఇతర ఆస్తులను తాకట్టు పెట్టారు అని తెలుస్తుంది.

ఈ మొత్తాన్ని ఆయన సకాలంలో తిరిగి చెల్లించలేకపోవడంతో సీఎఫ్ఎం సంస్థ ఈ అప్పు రికవరీ చేసే బాధ్యతను ఎడల్‌వీస్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ సంస్థకు అప్పగించింది.దీంతో ఎడల్‌వీస్ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా అప్పు రికవరీ ప్రక్రియ ప్రారంభించేందుకు ట్రిబ్యునల్‌ అనుమతించింది. 

నితిన్ మొత్తం 252 కోట్లు బాకీ పడ్డట్టు ఈ విచారణలో వెలుగులో కి వచ్చింది..ఆయన  పని చేసిన ఎన్నో చిత్రాలకు జాతీయ అవార్డులు రాగా.. వ్యక్తిగతంగా ఆయన నాలుగు సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గానే కాకుండా దర్శకుడి గా, నిర్మాత గా కూడా పని చేశారు. మరాఠీ భాషలో ఆయన సినిమాలు చేశారు.  అలాగే కొన్ని సినిమాలో నటించారు కూడా..  అయితే కరోనా తర్వాత నుంచి ఆయన చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి చేయలేదు. స్టార్ హోదాలో ఉన్న ఆయన ఇలా 57 ఏళ్ళ వయసు లో ఆత్మహత్య చేసుకోవడం తో బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. 

ఆత్మహత్య కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే దాని పై కారణాలు ఇంకా తెలియలేదు. అయితే అప్పుల బాధ తో, ప్రస్తుతం ఆఫర్లు లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని పలువురు  భావిస్తున్నారు.

అయితే దేశాయ్ భార్య నేహా దేశాయ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఖలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 306 , 34 కింద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో ఎడెల్‌వీస్ ఛైర్మన్ రాషెష్ షా, కంపెనీ అధికారి స్మిత్ షా, కెయూర్ మెహతా అనే మరో వ్యక్తి, ఎడెల్‌వీస్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి చెందిన ఆర్‌కె బన్సాల్, మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్‌గా ఎన్‌సిఎల్‌టి నియమించిన జితేందర్ కొఠారీ పేర్లు ఉన్నాయని పోలీసు అధికారి తెలిపారు.