Rashmika డీప్ ఫేక్ వీడియో కేసులో నలుగురు అనుమానితుల అరెస్టు

రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో కేసులో తాజాగా ఢిల్లీ పోలీసులు ఇప్పుడు నలుగురు అనుమానితులను పట్టుకున్నారు. నలుగురు అనుమానితులను పట్టుకున్న పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.

Courtesy: IDL

Share:

ఇటీవల రష్మిక మందన్నాకు సంబంధించిన ఓ డీప్ ఫేక్ వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియా మొత్తం రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో గురించే రచ్చ అయింది. ఈమెది వచ్చిన తర్వాత మరెంతో మంది హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే,  ఆ కేసులో తాజాగా ఢిల్లీ పోలీసులు ఇప్పుడు నలుగురు అనుమానితులను పట్టుకున్నారు. నలుగురు అనుమానితులను పట్టుకున్న పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.  

ఆ వీడియోను అప్ లోడ్ చేసింది ఈ నలుగురు నిందితులే అని భావిస్తున్నప్పటికీ.. వీడియోను క్రియేట్ చేసింది మాత్రం వీళ్లు కాదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. కీలక కుట్రదారుడి కోసం వేట కొనసాగుతోందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ సాయంతో వీడియోను సృష్టించారని, వారిని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు వివరించారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సంస్థలు ఇచ్చిన వివరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే డీప్ ఫేక్ వీడియోను నిందితులు వారి ఖాతాల నుంచి తీసేయడంతో, కీలక నిందితులను పట్టుకోవడం సమస్యగా మారింది.


రష్మిక మందన్నాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోకు సంబంధించిన కేసు నమోదు చేసిన నెల రోజులు అవుతున్నా ఇంకా అసలు నేరస్తులు దొరక్కపోవడం గమనార్హం. ముఖ్యంగా నటి రష్మికా మందన్నా డీప్ ఫేక్ వీడియోపై ఢిల్లీ మహిళా కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలని కోరింది. నవంబర్ 6వ తేదీన రష్మిక మందన్నాకు సంబంధించిన ఈ మార్ఫింగ్ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఈ విషయాన్ని గుర్తించిన రష్మిక సోషల్ మీడియో వేదికగా వీడియో చేసి ఆవేదన వ్యక్తం చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కు చెందిన అనేక మంది సెలబ్రిటీలు కూడా ఈ ఘటనపై స్పందించారు. కేవలం సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ నాయకులు కూడా నోరు విప్పారు. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. రష్మకకు అండగా ఉంటామని చెబుతూ అంతా తమ గళం వినిపించారు. తరువాత, దిల్లీ పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మరియు డీప్‌ఫేక్ కేసుపై దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు సాంకేతిక విశ్లేషణ జరుగుతోందని కూడా వారు తెలిపారు.అయితే ఈ కేసు నడుస్తుండగానే... బాలీవుడ్ హాట్ బ్యూటీస్ ఆలియా భట్, కరీనా కపూర్ లకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.