Game Changer: మెగా ఫ్యాన్స్​కు నిరాశ.. వాయిదా పడ్డ 'గేమ్​ ఛేంజర్' సాంగ్

Game Changer: రామ్‌ చరణ్‌(Ram Charan) హీరోగా నటిస్తున్న తాజాగా `గేమ్‌ ఛేంజర్‌`(Game Changer) నుంచి దీపావళి(Diwali) కానుకగా ఓ పాటను విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, ఈ సాంగ్ రిలీజ్ వాయిదా(Postpone) వేసింది చిత్రబృందం.

Courtesy: twitter

Share:

Game Changer: రామ్‌ చరణ్‌(Ram Charan) హీరోగా నటిస్తున్న తాజాగా `గేమ్‌ ఛేంజర్‌`(Game Changer) నుంచి దీపావళి(Diwali) కానుకగా ఓ పాటను విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, ఈ సాంగ్ రిలీజ్ వాయిదా(Postpone) వేసింది చిత్రబృందం.

 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సౌత్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్(Game Changer)’ అనే సినిమా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో పొలిటికల్ కథాంశంతో ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే, మూవీ ప్రారంభమై చాలా కాలం అవుతున్నా పెద్దగా అప్ డేట్స్ రావట్లేదు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు. దీపావళి కానుకగా తొలి పాట 'జరగండి'(Jaragandi)ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో మెగా అభిమానులు(Mega Fans) ఫుల్ ఖుషీ అయ్యారు. ఫస్ట్ పాట ఎలా ఉంటుందోనని ఆశగా ఎదురు చూశారు. కానీ, ఇంతలోనే వారి ఆశలపై నీళ్లు చల్లింది చిత్రబృందం. ఈ పాట విడుదలను వాయిదా(Release Postpone ) వేస్తున్నట్లు ప్రకటించింది.  

వాయిదాకు కారణం ఏంటంటే?

`గేమ్‌ ఛేంజర్‌`(Game Changer) పాట వాయిదాకు గల కారణాలను వివరిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ కీలక ప్రకటన చేసింది. పలు సంస్థల మధ్య ఆడియో డాక్యుమెంటేషన్ సమస్యల కారణంగానే ‘జరగండి’(Jaragandi) పాట విడుదలను వాయిదా వేస్తున్నట్లు  ప్రకటించింది. త్వరలోనే ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపింది.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan), దర్శకుడు శంకర్(Director Shankar) అభిమానులు కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదని వివరించింది. ‘గేమ్ ఛేంజర్’ను బెస్ట్ అవుట్ ఫుట్ తో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాణ బృందం నాన్ స్టాప్ గా పని చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేసింది.

‘జరగండి’ పాటపై భారీగా అంచనాలు

వాస్తవానికి ‘జరగండి’ (Jaragandi) పాటలో ఉన్న ఇళ్లన్నీ సెట్‌ వేశారట. ఈ ఇళ్ల నిర్మాణం కోసం భారీగా ఖర్చు చేశారట. ఈ ఇళ్లలో తీసిన పాటపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ, చివరకు పాట వాయిదా పడినట్లు ప్రకటన రావడంతో అందరినీలోనూ నిరాశ కలిగింది. అయితే, ఈ పాట విడుదల వాయిదాకు(Postpone) ఇతర కారణాలు కూడా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా రిలీజ్‌(Movie Release) కు ఇంకా చాలా సమయం ఉండటంతో ఇప్పటి నుంచే ప్రమోట్ చేయడం ఎందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తుంది. ఇదే కాకుండా, ఈ పాటను మరో సింగర్ తో పాడించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత పాడిన సింగర్ వాయిస్(Singer Voice) అంతగా బాగా లేదని భావించి వేరే సింగర్ తో పాడించాలి అనుకుంటున్నారట.

 

 నిజానికి ఈ పాటపై భారీగా అంచనాలు ఉండటంతో విజువల్ వండర్(Visual wonder)గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకున్నారు. అయితే, తాజాగా రూపొందిన పాట అనుకున్న స్థాయిలో ఆకట్టుకోవడం లేదని మేకర్స్(Movie Makers) భావిస్తున్నారట. అందుకే కాస్త లేట్ అయినా, లేటెస్టుగా తీసుకురావాలని రిలీజ్ వాయిదా వేశారట. అటు ఇప్పటికే లీకైన సాంగ్‌పై ట్రోల్స్(Trolls) కూడా వచ్చాయి. దీంతో దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారట సంగీత దర్శకుడు థమన్(Thaman). ఈ పాటను రీ రికార్డ్(Re Record) చేయాలని భావిస్తున్నారట. మొత్తంగా పాటను కొత్తగా రూపొందించడానికి సమయం పట్టడంతో వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

పొలిటిక‌ల్ థ్రిల్లర్​గా ‘గేమ్‌ ఛేంజర్‌’  

‘గేమ్‌ ఛేంజర్‌’(Game Changer) మూవీ పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌(Political thriller genre)లో తెరకెక్కుతున్నది. ఈ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీ(Kiara Advani) నటిస్తోంది. తెలుగమ్మాయి అంజలి, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్‌, ఎస్‌జే సూర్య, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, జ‌య‌రాయ్‌, సునీల్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు తెర‌కెక్కిస్తున్నారు. డైరెక్టర్‌ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్నాడు.