Payal Rajput: కీలక విషయాలు వెల్లడించిన పాయల్

RX 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) కట్టి పడేసింది. తెలుగు ప్రేక్షకులను అనే కన్నా తెలుగు యూత్ ఆడియెన్స్ ను అనడం సబబుగా ఉంటుందేమో. ఈ అమ్మడికి RX 100 సినిమా తర్వాత అంతలా పాపులారిటీ పెరిగిపోయింది. పాయల్ రాజ్ పుత్ (Payal Rajput)  నుంచి సినిమా వస్తుందంటే చాలు.. హీరో ఎవరు అని కూడా చూడకుండా పాయల్ (Payal Rajput)  పాపను చూసేందుకు ఆడియన్స్ క్యూ కడుతున్నారు. దీంతో […]

Share:

RX 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) కట్టి పడేసింది. తెలుగు ప్రేక్షకులను అనే కన్నా తెలుగు యూత్ ఆడియెన్స్ ను అనడం సబబుగా ఉంటుందేమో. ఈ అమ్మడికి RX 100 సినిమా తర్వాత అంతలా పాపులారిటీ పెరిగిపోయింది. పాయల్ రాజ్ పుత్ (Payal Rajput)  నుంచి సినిమా వస్తుందంటే చాలు.. హీరో ఎవరు అని కూడా చూడకుండా పాయల్ (Payal Rajput)  పాపను చూసేందుకు ఆడియన్స్ క్యూ కడుతున్నారు. దీంతో పాయల్ (Payal Rajput)  పెద్ద స్టార్ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. RX 100 మూవీ తర్వాత అమ్మడు తీసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో దర్శక నిర్మాతలు పాయల్ రాజ్ పుత్ (Payal Rajput)  ను పట్టించుకోవడం మానేశారు. అమ్మడికి అవకాశాల కొరత ఏర్పడింది. సోషల్ మీడియా పుణ్యమా అని పాయల్ రాజ్ పుత్ ప్రేక్షకులతో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. 

బతికించిన సోషల్ మీడియా.. 

సోషల్ మీడియా కనుక లేకపోతే పాయల్ రాజ్ పుత్ (Payal Rajput)  ను ప్రేక్షకులు ఎప్పుడో మర్చిపోయేవారు. కానీ సోషల్ మీడియా వల్ల పాయల్ (Payal Rajput)  నిత్యం తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది. సోషల్ మీడియాలో హాట్, హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. దీంతో పాయల్ (Payal Rajput)  పాపను ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. అంతే కాకుండా తన భాయ్ ఫ్రెండ్ తో కూడా పాయల్ (Payal Rajput)  హల్చల్ చేస్తుంది. ఇవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. దీంతో పాయల్ గురించి జనాలు గుర్తుంచుకుంటున్నారు. 

మంగళవారం అంటూ.. 

RX 100 తర్వాత పాయల్ (Payal Rajput)  ఆ మధ్య ఓ బోల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. RX 100 కంటే ఇందులో సీన్స్ మరీ బోల్డ్ గా ఉన్నా కానీ సినిమాలో కంటెంట్ లేకపోవడంతో ఆడియన్స్ ఆ సినిమాకు అంతగా కనెక్ట్ కాలేకపోయారు. దీంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఆ తర్వాత పాయల్ (Payal Rajput)  ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఆ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయింది. ప్రస్తుతం ఈ భామ తనకు మొదటి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో సైకలాజికల్ గ్రామీణ థ్రిల్లర్‌ మంగళవారం (Mangalavaram)లో నటించింది. మొదటి సినిమా RX 100 పూర్తైన నాటి నుంచి అజయ్ భూపతితో మరో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు అది ఇప్పటికి నెరవేరిందని పాయల్ రాజ్ పుత్ (Payal Rajput)  ప్రకటించింది. 

కథ చెప్పినపుడు నేను అదే ఫీలయ్యా.. 

డైరెక్టర్ అజయ్ భూపతి తనకు మంగళవారం (Mangalavaram) కథను నెరేట్ చేసినపుడు నేను పూర్తిగా కథలో లీనమైపోయానని అమ్మడు వెల్లడించింది. కథ చెప్పడం పూర్తైన తర్వాత వెంటనే వావ్ అని అన్నానంది. ఈ కథకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యానని, అందుకోసమే తన 100 శాతం పర్ఫామెన్స్ ఇచ్చినట్లు వెల్లడించింది. ఇది సాధారణ సినిమాలకు చాలా భిన్నంగా ఉండే సినిమా అని పాయల్ (Payal Rajput)  పేర్కొంది. దర్శకుడి దృష్టి కోణం ఎల్లప్పుడూ భిన్నంగానే ఉంటుందని నొక్కి చెప్పింది. నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునేందుకు కష్టతరమైన పాత్రలు చేసేందుకు ఇష్టపడతానని తెలిపింది. ఈ మూవీలో చాలా కష్టపడ్డట్లు పేర్కొంది. తాను ఇంతకంటే మంచి సినిమాను చేయలేనని మూవీ చేసిన తర్వాత అర్థం అయిందని అమ్మడు వెల్లడించింది. 

పాయల్ పాత్ర పేరు ఇదే.. 

ఈ మూవీలో బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput)  శైలు అనే గ్రామీణ అమ్మాయిగా నటించింది. ఈ మూవీలో శైలు ఎన్నో డేరింగ్ సీక్వెన్స్ లలో నటించింది. కథ ముందుకు వెళ్తున్న కొద్దీ డేరింగ్ గా  ఉంటుందని పాయల్ తెలిపింది. నా పాత్రకు ఉన్న బోల్డ్ మరియు భయానక సన్నివేశాలు చేయడం గురించి నేను భయపడలేదని, ఎందుకంటే అవి కథలో భాగమని తెలిపింది. నటిగా నేను అన్ని పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉండాలంది. శైలు పాత్ర చాలా అమాయకంగా ఉంటుందని వెల్లడింది. ఈ చిత్రం చేతబడి మరియు ఇతర సామాజిక నిషేధాలను గురించి కూడా వివరిస్తుంది.  ఈ మూవీ షూటింగ్ సమయంలో చాలా మంచి విషయాలు జరిగాయని, కాబట్టి చుట్టూ ప్రతికూల శక్తి ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని తెలిపింది. చాలా కష్టతరమైన విషయం గురించి కూడా అమ్మడు వెల్లడించింది. గత సంవత్సరం మధ్య వేసవిలో క్లైమాక్స్ సన్నివేశాన్ని ఆత్రేయపురం గ్రామంలో (సినిమా కథను బట్టి) చిత్రీకరించామని, అక్కడ హ్యుమిడిటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, అమ్మడు ఎటువంటి లిక్విడ్ డైట్ తీసుకోలేదట. ఫలితంగా అమ్మడికి అనారోగ్యం వాటిల్లిందని వెల్లడించింది. 

కిడ్నీల ఇన్ఫెక్షన్ 

పాయల్ రాజ్ పుత్ (Payal Rajput)  కి కిడ్నీల ఇన్ఫెక్షన్ (Infection) సోకింది. హ్యుమిడిటీ సమయంలో లిక్విడ్స్ తీసుకోకుండా పని చేయడం వలన డీ హైడ్రేషన్ (Dehydration) వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందని ఈ బ్యూటీ పేర్కొంది. ఈ మూవీ షూటింగ్ చేస్తున్నపుడే తనకు ఈ విషయం అర్థం కావడంతో వెంటనే వెళ్లి డైరెక్టర్ కు విషయం చెప్పానని ఆయన అర్థం చేసుకుని తనను వెంటనే నగరం నుంచి షూటింగ్  జరుగుతున్న గ్రామానికి వైద్యులను పిలిపించాడని బ్యూటీ (Payal Rajput)  తెలిపింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా నవంబర్ 17వ తేదీన రిలీజ్ కానుంది.