Bhagavanth kesari: హిందీలో నేనే డబ్బింగ్ చెప్పుకున్నా..

భగవంత్ కేసరిపై బాలకృష్ణ తాజా అప్‌డేట్

Courtesy: Twitter

Share:

Bhagavanth Kesari: నందమూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) కాంపౌండ్‌ నుంచి వచ్చిన చిత్రం భగవంత్ కేసరి (Bhagavanth Kesari). అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌(Box office) వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్ అందించాడు బాలకృష్ణ.

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి'(Bhagavanth Kesari) చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ కా షేర్ గా నిలిచింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) హీరోయిన్ గా శ్రీలీల (Sreeleela) కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంసలు అందుకొని అఖండ విజయం సాధించింది.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్ అందించాడు బాలకృష్ణ. 

 మేకర్స్‌ హైదరాబాద్‌లో(Hyderabad) గ్రాండ్ సక్సెస్‌ మీట్ (Grand Success Meet) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ(Nandamuri Balakrishna) మాట్లాడుతూ.. . భగవంత్‌ కేసరి త్వరలోనే హిందీలో కూడా సందడి చేయనుందని చెప్పాడు. నాన్న, నేను కొత్త విషయాలపై ప్రయోగాలు చేయడమంటే ఇష్టపడతాం. హిందీలో నా పాత్రకు నేనే డబ్బింగ్(Dubbing) చెప్పుకున్నా. తొలిసారి హిందీలో(Hindi) డబ్బింగ్‌ చెప్పుకున్నా. హిందీ భాషలో నా కమాండింగ్‌ లెవల్ ఎలా ఉంటుందో మీరు త్వరలోనే చూస్తారని చెప్పుకొచ్చాడు. 

తెలుగులో హిట్టయినట్టుగానే బాలీవుడ్ లో (Bollywood) కూడా సినిమా పెద్ద హిట్టవుతుందని అంటున్నారు బాలయ్య. ‘భగవంత్ కేసరి' (Bhagavanth Kesari) రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్(Success Celebrations) నిర్వహించింది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఈ వేడుకల్లో ముఖ్యఅతిధిగా పాల్గొని చిత్ర బృందానికి షీల్డ్స్ అందించారు.

 గతంలో హిందీ ప్రేక్షకులను పెద్దగా ఫోకస్ చేయని ఆయన ఈసారి వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. మధ్య వయస్కుడైన మేనమామ, మేనకోడళ్ల కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం యాక్షన్ సన్నివేశాలతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఖర్చులు భరించి లాభసాటిగా ఉండాలంటే బాలకృష్ణ(Balakrishna) హిందీ రీజియన్‌లో రూ. 5 కోట్లకు పైగా సంపాదించాల్సి ఉందని హిందీ డిస్ట్రిబ్యూటర్ ఒకరు తెలిపారు.

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్‌ (Kajal Aggarwal) ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటించగా.. శ్రీలీల(Sreeleela) కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రంతో బాలీవుడ్ యాక్టర్‌ అర్జున్ రాంపాల్(Arjun Rampal) తొలిసారి టాలీవుడ్‌(Tollywood) ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ మూవీని షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది నిర్మించగా.. ఎస్‌ థమన్‌ సంగీతం అందించాడు. భగవంత్‌ కేసరి నుంచి విడుదల చేసిన గణేశ్‌ ఆంథెమ్‌, ఉయ్యాలో ఉయ్యాలా (Uyyala Uyyala Song) నెట్టింట మంచి వ్యూస్ రాబడుతూ.. అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాయి.

నార్త్ ఇండియాలో(North India) తెలుగు యాక్షన్ చిత్రాలను ఇష్టపడుతున్నప్పటికీ బాలకృష్ణ గతంలో నటించిన 'లెజెండ్,'(Legend) 'అఖండ,'(Akhanda) 'వీరసింహారెడ్డి'(Veera Simha Reddy) వంటి హిట్ సినిమాలు హిందీలో డబ్ కాకపోవడం ఆశ్చర్యకరం. అతని కొత్త చిత్రం 'భగవంత్ కేసరి' కథా-ఆధారిత విధానంతో హిందీ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుందని అతను నమ్ముతున్నాడని సూచన. అందుకే అతని మునుపటి సినిమాలు బాలీవుడ్‌లో(Bollywood) పెద్దగా దృష్టిని ఆకర్షించలేదు.

రవితేజ ముంబైలో తన 'టైగర్ నాగేశ్వరరావు'(Tiger Nageswara Rao) సినిమా ప్రమోషన్‌లో చురుగ్గా ఉన్నాడు. అయితే, షారుక్ ఖాన్(Shahrukh khan), సన్నీ డియోల్(Sunny Deol) మరియు సల్మాన్ ఖాన్(Salman khan) వంటి ప్రముఖ బాలీవుడ్ తారలు యాక్షన్-ప్యాక్డ్ సినిమాలతో తిరిగి వస్తున్నందున, హిందీ ప్రేక్షకులు ఈ మధ్య తెలుగు చిత్రాలపై అంతగా ఆసక్తి చూపడం లేదని గమనించబడింది. అటువంటి పోటీ దృష్టాంతంలో ప్రేక్షకులను ఆకర్షించడం బాలకృష్ణకు ఇది ఒక ముఖ్యమైన సవాలుగా ఉంది.