అనుకోకుండా బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన జాన్వీ కపూర్..!

Janhvi Kapoor: కాఫీ విత్ కరణ్ 8 తదుపరి ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమో వచ్చింది. జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ఈ ఎపిసోడ్‍కు గెస్టులుగా వచ్చారు. వారిని రిలేషన్‍షిప్స్, డేటింగ్ గురించి సమాచారం రాబట్టేందుకు కరణ్ జోహార్ చాలా ప్రయత్నించారు.

Courtesy: IDL

Share:

బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ ప్రేమ వ్యవహారం గత కొంతకాలంగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్న విషయం తెలిసిందే. తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో ఆమె డేటింగ్ చేస్తున్నారని వినిస్తోంది. అయితే ఏనాడు కూడా తన ప్రియుడు గురించి ఏనాడు గురించి అధికారికంగా వెల్లడించలేదు. ఈ రూమర్లకు ఊతమిచ్చేలా కొన్ని కార్యక్రమాల్లో కలిసికట్టుగా కనిపించారు జాన్వీ, పహారియా. వారిద్దరూ లవ్‍లో మునిగితేలుతున్నారంటూ రూమర్స్ గట్టిగా వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై ఇద్దరూ మౌనం దాలుస్తూ వచ్చారు. అయితే, తాజాగా జాన్వీ కపూర్ తన సోదరి ఖుషి కపూర్‌తో కలిసి ‘కాఫీ విత్ కరణ్ 8’ టాక్‍షోలో పాల్గొన్నారు. కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహిస్తున్న ఈ పాపులర్ షోలో పహారియాతో తన రిలేషన్ గురించి జాన్వీ పొరపాటున హింట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

కాఫీ విత్ కరణ్ 8 తదుపరి ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమో వచ్చింది. జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ఈ ఎపిసోడ్‍కు గెస్టులుగా వచ్చారు. వారిని రిలేషన్‍షిప్స్, డేటింగ్ గురించి సమాచారం రాబట్టేందుకు కరణ్ జోహార్ చాలా ప్రయత్నించారు. ప్రశ్నలు అడిగారు. జాన్వీ కపూర్ డేటింగ్ చేసిన ముగ్గురి పేర్లు చెప్పాలని ఖుషిని అడిగారు కరణ్. అయితే, జాన్వీ చెప్పొద్దు అంటూ ఖుషిని ఆపింది.

ఆ తర్వాత “నీ ఫోన్ స్పీడ్ డయల్‍‍ లిస్టులో ఉన్న ముగ్గురు ఎవరు” అని జాన్వీ కపూర్‌ను కరణ్ అడిగారు. దీంతో జాన్వీ తొందరలో ఆన్సర్ చెప్పారు. “పప్పా (బోనీ కపూర్), ఖుషి, షిక్కు” అని జాన్వీ చెప్పేశారు. వీరిలో షిక్కూ అంటే శిఖర్ పహారియానే. షిక్కు అని జాన్వీ బ్లష్ అయ్యారు. పొరపాటు చెప్పేశానే అనేలా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. విషయం బయటపడిందనేలా కరణ్ కూడా గట్టిగా నవ్వుతూ అటు తిరిగారు. శిఖర్ పహారియా నంబర్ తన ఫోన్ స్పీడ్ డయల్‍లో ఉందని చెప్పడంతో అతడి డేటింగ్‍ను జాన్వీ దాదాపు కన్ఫార్మ్ చేసినట్టయింది. అందులోనూ అతడి పేరు చెప్పాక ఆమె సిగ్గు పడిన విధానం చూస్తే విషయం అర్థమవుతోందని కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడే శిఖర్ పహారియా.

ఇదిలా ఉండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా ద్వారా జాన్వీ కపూర్ తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ కూతురిగా ఆమె నటిస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. నందమూరి కల్యాణ్ రామ్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.