Cinema: జవాన్ దర్శకుడు నిర్మిస్తున్న నాలుగు కొత్త చిత్రాలు

వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా..

Courtesy: Twitter

Share:

Cinema: జవాన్ (Jawan) సినిమా (Cinema) గురించి ప్రత్యంగించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా జవాన్ (Jawan) సినిమా (Cinema) దర్శకుడు అట్లీ (Atlee) తన కొత్త బ్యానర్ లో మరో నాలుగు కొత్త చిత్రాలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే అందులో మొదటిది, వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నట్లు సమాచారం.

దర్శకుడు నిర్మిస్తున్న నాలుగు కొత్త చిత్రాలు:

షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో తన తాజా చిత్రం జవాన్ (Jawan) వైభవంతో దూసుకుపోతున్న దర్శకుడు అట్లీ (Atlee), ఆపిల్ స్టూడియోస్ కోసం తన నిర్మాణ సంస్థ A కింద 4 చిత్రాలను నిర్మించాలనే తన ప్రణాళికల గురించి బయట పెట్టాడు. నిర్మాతగా తన తదుపరి చిత్రం వరుణ్ ధావన్ హిందీ సినిమా (Cinema) దీనికి టెంపరరీగా VD18 అని పిలుస్తున్నట్లు చిత్రనిర్మాత ఇటీవలి ఇంటర్వ్యూలో వెల్లడించారు, ఇందులో కీర్తి సురేష్, వామికా గబ్బి కూడా ఉన్నారు. అంతేకాకుండా, రెండు తమిళ చిత్రాలు మరియు ఒక తెలుగు చిత్రం కూడా లైన్ లో ఉన్నట్లు, త్వరలో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.

దర్శకుడు అట్లీ (Atlee) వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో తాను ఒక చిత్రాన్ని ఎలా నిర్మిస్తున్నాడో వెల్లడించాడు. తనను వెంటాడుతున్న దుర్మార్గాల నుండి తన కుటుంబాన్ని రక్షించడానికి ఒక డిసిపి ప్రయాణించి తనను తాను మార్చుకునే కథాంశంతో చిత్రం తెరకు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది.

చిత్రం అట్లీ (Atlee) 2016 బ్లాక్బస్టర్ చిత్రం థెరికి బాలీవుడ్ రీమేక్ అని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి, ఇందులో తలపతి విజయ్, సమంతా రూత్ ప్రభు మరియు అమీ జాక్సన్ ప్రధాన పాత్రలలో నటించారు.

అంతేకాకుండా, అట్లీ (Atlee) తన ప్రొడక్షన్స్లో మరో మూడు ప్రాజెక్ట్లు లైన్లో ఉన్నాయని, వాటిలో రెండు తమిళ భాషలో మరియు మరొకటి తెలుగు భాషా చిత్రం అని ధృవీకరించారు. చిత్రాలకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటనలు తర్వాత మాత్రమే వెలువడే అవకాశం ఉంది.

రిలీజ్ అయిన జవాన్ సినిమా విశేషాలు:

ఇటీవల రిలీజైన జవాన్ (Jawan) సినిమా (Cinema) బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఇందులో సౌత్ ఇండియా స్టార్స్ ఎంతోమంది కనివిందు చేస్తారు. షారుక్ (Shah Rukh Khan) తన అభిమానులకు ఒక ప్రత్యేకమైన సినిమా (Cinema) అందించడమే కాకుండా, భారత దేశంలో వ్యవస్థలో జరుగుతున్న కొన్ని అంశాలను తీసుకుని తెరకెక్కిన సినిమా (Cinema) బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రతాపాన్ని నిరూపించుకుంటుంది జవాన్ (Jawan). 'జవాన్ (Jawan)' సినిమా (Cinema), భారతీయ వ్యవస్థలోని ఉన్న అనేకమైన లొసుగులను ఎత్తిచూపుతూ సామాజిక రంగంలోకి ధైర్యంగా దూసుకుపోతుంది. అయితే షారుక్ ఖాన్ (Shah Rukh Khan) తన సినీ కెరీర్లో ఇప్పటివరకు చేసిన సినిమా (Cinema)లతో పోలిస్తే ఇది ప్రత్యేకమైన సినిమా (Cinema) అంటున్నారు ఫాన్స్. జవాన్ (Jawan) లో చూపించిన ఒక ప్రత్యేకమైన సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది, సన్నివేశం వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది అని చెప్పుకోవచ్చు. వీడియో ద్వారా, ఖాన్ తమ ఓటును కులం, మతం మరియు ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయకండి అని, కేవలం విద్యా, వైద్యం, ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ఉండేలా ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అంటూ, జవాన్ (Jawan) సినిమా (Cinema)లో షారుక్ (Shah Rukh Khan) చెప్పిన డైలాగ్ లు వైరల్ గా మారుతున్నాయి. జవాన్ (Jawan) సినిమా (Cinema)లో చెప్పిన డైలాగ్ తాలూకా క్లిప్, సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

జవాన్ (Jawan) సినిమా (Cinema)లో మరో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది సౌత్ ఇండియా సూపర్ స్టార్ నయనతార. ఒక పోలీస్ ఆఫీసర్ గా అదే విధంగా శారీలో కూడా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) పక్కన ఆకట్టుకుంది. జవాన్ (Jawan) సినిమా (Cinema)తో నయనతార బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఇందులో షారుఖ్ ఖాన్ సరసన నటించి ఆకట్టుకుంది. సినిమా (Cinema)లో నయనతారే కాకుండా విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా కూడా నటించారు.