Kajal: కాజల్ సత్యభామ టీజర్ విడుదల

దుమ్ము దులిపిన కాజల్ అగర్వాల్..

Courtesy: Twitter

Share:

Kajal: తెలుగు సినీ ప్రేక్షకులకు కాజల్ అగర్వాల్ (Kajal) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పటివరకు తీసిన అన్ని సినిమా (film)లలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. కాజల్ (Kajal) తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఎక్కువగా హీరోయిన్ (Heroine) ఓరియంటెడ్ సినిమా (film)లకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాజల్ నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా (film), సత్యభామ (Satyabhama) టీజర్ (Teaser) ఇటీవల విడుదలైంది.

 

కాజల్ సత్యభామ టీజర్ విడుదల: 

 

క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న "సత్యభామ (Satyabhama)"లో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్ సత్యభామ (Satyabhama) పాత్రలో పవర్ ఫుల్ పాత్రను పోషిస్తోంది. ఔరుమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి "మేజర్" దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పణలో సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన టీజర్ (Teaser)‌లో, "సత్యభామ (Satyabhama)" పాత్ర పోషించిన కాజల్ అగర్వాల్ దుమ్మురేపింది. కాజల్ అగర్వాల్ పోషించిన సత్యభామ (Satyabhama)కు, ఒక యువతి ప్రాణాలను కాపాడలేకపోవడం వెంటాడుతుంది. టీజర్ (Teaser) లో కనిపించిన విధంగా, న్యాయం కోసం ఆమె తపన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది, కేసు ఆమె నియంత్రణకు మించినదని అధికారులు నొక్కి చెప్పారు. అధైర్యపడకుండా, సత్యభామ (Satyabhama) నరకాసురుడిని ఓడించే లక్ష్యంతో ఆ యువతిని చంపిన హంతకుల కోసం అన్వేషణను ప్రారంభించింది. సుమన్ చిక్కాల దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర తదితరులు పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమా (film)లో మనం చూడొచ్చు. 

 

కొత్త పాత్రలకే తన ఓటు: 

 

గ్లామ్ కాజల్ అగర్వాల్ (Kajal) తన కెరీర్‌లో ప్రస్తుతం వైవిద్య పాత్రలకే ఓటు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నిర్మాత తిక్క మోహన్ ఇటీవల చెప్పిన ఒక హీరోయిన్ (Heroine) ఓరియంటెడ్ సినిమా (film)కి ఓకే చెప్పేసినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సినిమా (film)లో ఒక కొత్త పాత్రలో ప్రత్యేకంగా కనిపించేందుకు కాజల్ (Kajal) తన మేకోవర్ చేంజ్ చేసుకోబోతున్నట్లుగా, ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో ఆవేశంగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

 

శ్రీకృష్ణుడు భార్య సత్యభామ (Satyabhama) పౌరాణిక కథ నుండి ప్రేరణ పొందిన 'సత్యభామ (Satyabhama)' టైటిల్‌ను జస్టిఫై చేస్తూ, సవాళ్లను ఎదుర్కోవటానికి ధైర్యంగా ఉండే నవతరం సత్యభామ (Satyabhama)గా చిత్రీకరించబోతున్నాము అని చెప్పాడు నిర్మాత. వాస్తవానికి నవంబర్‌లో దీపావళి సందర్భంగా టీజర్ (Teaser)‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేసిన విధంగా టీజర్ (Teaser) విడుదల చేసి అదరగొట్టారు కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ (Kajal) రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ మరియు మహేష్ బాబు వంటి సూపర్ స్టార్‌లతో నటించిన తర్వాత ఇప్పుడు హీరోయిన్ (Heroine) ఓరియంటెడ్ ఎంటర్‌టైనర్‌తో అభిమానులను ఆకట్టుకోవడానికి వచ్చేస్తుంది. 

 

కాజల్ అగర్వాల్ సినీ ప్రస్థానం:

 

ఈమె 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం సినిమా (film)లో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయింది. ఈమె 2009లో హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజతో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రం (Movie)తో నటించింది. ఈమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా (film) ఇదే. మళ్ళీ అదే సంవత్సరం హీరో రామ్ పోతినేనితో కలిసి గణేష్,అల్లు అర్జున్తో ఆర్య-2 లో నటించింది. తర్వాత 2010లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ లో హీరోయిన్ (Heroine) గా మెప్పించింది. తర్వాత జూనియర్ ఎంటీయార్ తో బృందావనంలో సమంతతో పాటుగా నటించింది. తరువాత ప్రభాస్ హీరోగా వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా (film)లో నటించారు. 2010లో ఈమె తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీ సరసన నా పేరు శివ చిత్రం (Movie)లో నటించి తమిళ చిత్రరంగ ప్రవేశం చేసింది. 2012లో పూరీజగన్నాథ్ దర్శకత్వంలో బిజినెస్ మాన్ సినిమా (film)లో నటించారు. సూర్య సరసన మాట్రన్ అనే తమిళ సినిమా (film)లో నటించింది.

ఇంతకుముందు, కాజల్ (Kajal) మహేష్ బాబు (బిజినెస్‌మెన్), ఎన్టీఆర్ జూనియర్ (టెంపర్), అల్లు అర్జున్ (ఆర్య), రామ్ చరణ్ (మగధీర) వంటి బిగ్గెస్ట్ స్టార్‌లతో కలిసి పని చేసి, 10 సంవత్సరాలలో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి హీరోయిన్ (Heroine)‌గా ఎదిగింది.