Kajal: అటువంటి కథలే కాజల్ కు కావాలట..

కొత్త జర్నీని స్టార్ట్ చేసిన చందమామ

Courtesy: twitter

Share:

Kajal: టాలీవుడ్ లో కాజల్ (Kajal) అగర్వాల్ గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడో చందమామ సినిమాతో తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పెళ్లయి.. కొడుకు పుట్టినా కానీ జోరు చూపిస్తూనే ఉంది. పెళ్లికి ముందు గ్లామర్ పాత్రల వైపు మొగ్గు చూపిన ఈ ముద్దుగుమ్మ పెళ్లయి పిల్లాడు పుట్టిన తర్వాత హీరోయిన్ సెంట్రిక్ పాత్రల వైపు అడుగులేస్తోంది. ఇలా అడుగులేసి మొన్నటికి మొన్న హిట్ కొట్టింది. కాజల్ (Kajal) కన్ను ప్రస్తుతం లేడీ సెంట్రిక్ మూవీలపై పడినట్లు టాక్ వినిపిస్తోంది. 

భగవంత్ తో మొదలెట్టిన కాజల్

కాజల్ (Kajal)  అగర్వాల్ అంటే గ్లామర్ పాత్రలు రొమాంటిక్ పాత్రలే జనాలకు గుర్తొస్తాయి. అమ్మడు ఇంత వరకు అటువంటి పాత్రలనే చేసింది. కానీ తాజాగా ఈ బ్యూటీ తన మనసును మార్చుకున్నట్లు తెలుస్తోంది. నందమూరి నటసింహం బాలయ్య నటించిన సూపర్ హిట్ మూవీ భగవంత్ కేసరితో (Bhagavant Kesari) ఈ బ్యూటీ తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కొన్ని రకాల పాత్రలు మాత్రమే చేయాలని ఈ బ్యూటీ (Beauty) ఫిక్స్  అయినట్లు తెలుస్తోంది. కేవలం ఫీమేల్ సెంట్రిక్ పాత్రలనే చేయాలని అమ్మడు టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే వరుసగా అటువంటి పాత్రలు ఉండే సినిమాలకే ఓటేస్తోంది. మొన్నటికి మొన్న వచ్చిన భగవంత్ కేసరి మూవీలో కూడా చందమామది హీరోయిన్ (Heroine) రోల్  అయినా కానీ అందులో గ్లామర్ డోస్ (Glamour Dose) ఉండదు. కేవలం నటనకు మాత్రమే స్కోప్ ఉంటుంది. ఇక ఈ క్యారెక్టర్ చూసినపుడే అంతా కాజల్ ఇక నుంచి గ్లామర్ పాత్రలకు దూరం కానుందని అంతా అంచనాకు వచ్చారు. 

సత్యభామతో మరో మారు రిపీట్

భగవంత్ కేసరిలో పేరుకే హీరోయిన్ అయినా కాజల్ (Kajal)  క్యారెక్టర్ లో అసలు గ్లామర్ డోస్ అన్నదే కనిపించదు. ఇక ఇప్పుడు అమ్మడు లేడీ సెంట్రిక్ మూవీ సత్యభామ (Satyabhama) చేస్తోంది. ఈ మూవీలో కూడా కాజల్ (Kajal)  ది లీడ్ రోలే. ఈ మూవీ మొత్తం కాజల్ చుట్టూతే తిరగనుందని సమాచారం. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ (Heroine Oriented) మూవీ అని పోస్టర్ చూస్తే మనకు ఇట్టే తెలిసిపోతుంది. కాజల్ ఇంతవరకు ఇటువంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయలేదు. తెలుగు నాట ఆమెకిదే తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కావడం విశేషం. 

అటువంటివే కావాలి.. 

కాజల్(Kajal)  తనకు లేడీ ఓరియెంటెడ్ కథలే కావాలని అంటోందట. కాజల్(Kajal)  వద్దకు వెళ్లే దర్శకులు కూడా లేడీ ఓరియెంటెడ్ కథలతోనే అమ్మడిని ఇంప్రెస్ (Impress) చేసేందుకు ట్రై చేస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. కాజల్(Kajal)  తొలి నాళ్లలో అంత మెస్మరైజ్ చేయకపోయినా కానీ అమ్మడికి మగధీర (Magadheera) సినిమా వచ్చిన తర్వాత లక్కే మారిపోయింది. మగధీర సినిమా ఈ బ్యూటీ లైఫ్ మార్చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మగధీర కు ముందు కాజల్(Kajal) .. మగధీర తర్వాత కాజల్ అనేలా పరిస్థితి మారిపోయిందంటే మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అమ్మడు తన వద్దకు వచ్చిన అన్ని కథలను ఎంపిక చేసుకోకుండా నిదానంగా ఆ కథలను వింటోందని తెలుస్తోంది. కథ బాగున్నా కానీ ఆ కథకు తాను న్యాయం చేయగలుగుతానని కాజల్ నమ్మితేనే వారితో సినిమా చేస్తోందని టాక్. 

ఇప్పటికే అనేక మంది స్టార్లతో

కాజల్ (Kajal)  టాలీవుడ్ (Tollywood) లో ఉన్న అనేక మంది స్టార్లతో ఇప్పటికే నటించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత అవుతుంది. కాజల్ (Kajal)  ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కానీ ప్రస్తుతం అమ్మడు పెళ్లి చేసుకుని పిల్లాడికి తల్లి కావడంతో గ్లామర్ రోల్స్ కాకుండా హీరోయిన్ సెంట్రిక్ రోల్స్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు నాట హీరోయిన్ సెంట్రిక్ మూవీలకు కూడా డిమాండ్ బాగానే ఉంది. తెలుగులో ఇప్పటికే అనేక హీరోయిన్ సెంట్రిక్ మూవీలు అలరించాయి. తెలుగులో టాప్ హీరోయిన్లలా చలామణి అవుతున్న చాలా మంది ఇప్పటికే హీరోయిన్ సెంట్రిక్ కథలతో సినిమాలు చేశారు. అందుకోసమే ఇప్పుడు కాజల్ (Kajal)  కూడా ఈ రూట్ లో వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి సినిమాలు చేస్తే తనలోని ప్రతిభ (Talent) మరింత బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. స్టార్ హీరో సినిమాలో చేస్తే కేవలం గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. అదే హీరోయిన్ సెంట్రిక్ సినిమా అయితే పరిస్థితి వేరేలా ఉంటుందని కాజల్ భావిస్తున్నట్లు వినకిడి. కాగా ఈ సినిమాలకు సక్సెస్ రేట్ (Success Rate) కూడా బాగానే ఉంటుంది. ఇవైతే సేఫ్ అని కాజల్ డిసైడ్ అయినట్లు టాక్. తెలుగులో ఇప్పటికే, అనుష్క (Anushka) 'అరుంధతి' మరియు 'భాగమతి' వంటి హిట్‌ లతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటే ముందు గుర్తుకు వచ్చేలా చేసుకుంది. అంజలి (గీతాంజలి), కీర్తి సురేష్ (Keerthy Suresh) (మహానటి) మరియు రష్మిక (Rashmika)  (రెయిన్‌బో) వంటి చిత్రాలను ఆల్రెడీ చేసి ఉన్నారు. ఇంకా వీరు మాత్రమే కాకుండా అనేక మంది తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక ఇప్పుడు కాజల్(Kajal)  వంతు వచ్చింది.