Kamal Haasan: జూనియర్ ఎన్టీఆర్ కు థాంక్స్ చెప్పిన కమల్ హాసన్

Kamal Haasan: కమల్ హాసన్ (Kamal Haasan), భారతీయ సినిమా (Cinema) లెజెండరీ ఫిగర్, ఇటీవల సినీ రంగంలో 64 సంవత్సరాలను పూర్తి చేస్తూ, ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. తన అసమానమైన ప్రతిభ, క్రాఫ్ట్ పట్ల అంకితభావం, దిగ్గజ నటుడు తరాల నటులు, చిత్రనిర్మాతలకు ప్రేరణగా నిలిచాడు. కళత్తూర్ కనమ్మ (1960)తో బాలనటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన కళాకారుడు కమల్ హాసన్ (Kamal Haasan), చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఇటీవల నవంబర్ 7న పుట్టినరోజు […]

Share:

Kamal Haasan: కమల్ హాసన్ (Kamal Haasan), భారతీయ సినిమా (Cinema) లెజెండరీ ఫిగర్, ఇటీవల సినీ రంగంలో 64 సంవత్సరాలను పూర్తి చేస్తూ, ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. తన అసమానమైన ప్రతిభ, క్రాఫ్ట్ పట్ల అంకితభావం, దిగ్గజ నటుడు తరాల నటులు, చిత్రనిర్మాతలకు ప్రేరణగా నిలిచాడు. కళత్తూర్ కనమ్మ (1960)తో బాలనటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన కళాకారుడు కమల్ హాసన్ (Kamal Haasan), చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఇటీవల నవంబర్ 7న పుట్టినరోజు జరుపుకున్న కమల్ హాసన్ (Kamal Haasan) కు ఎంతోమంది అభిమానులు, సినీ నటులు తమదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 

జూనియర్ ఎన్టీఆర్ కు థాంక్స్: 

లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ (Kamal Haasan) తన పుట్టినరోజు సందర్భంగా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు.. జూనియర్ ఎన్టీఆర్ (NTR) కు కృతజ్ఞతలు తెలుపుతూ, తన ట్వీట్‌లో “లవ్ యువర్ వర్క్” అని షేర్ చేశారు.  తనకు, చాలా మంది ఇతర నటులకు, కమల్ హాసన్ (Kamal Haasan) ప్రత్యేకమైన నటనను నేర్పుతూనే ఉంటారని జూనియర్ ఎన్టీఆర్ (NTR) ఆశాభావం వ్యక్తం చేశారు. కమల్ హాసన్ (Kamal Haasan) కు, ఎన్టీఆర్ (NTR) కు మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణ ఆధారంగా, కమల్ మరియు ఎన్టీఆర్ (NTR) రాబోయే కొత్త చిత్రం గురించి చేతులు కలిపారు అనే పుకార్లను మళ్లీ రేకెత్తించింది. వాళ్ళిద్దరూ కలిసి త్వరలోనే  సినిమా (Cinema) తీయబోతున్నారు అంటూ సమాచారం కూడా అందింది. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రాబోతున్న..కొత్త చిత్రంలో కమల్ హాసన్ (Kamal Haasan), ఎన్టీఆర్ (NTR) కూడా పాలుపంచుకోబోతున్నట్లు సమాచారం.

ప్రభాస్..‘ప్రాజెక్ట్ కె’లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించిన తర్వాత, జాతీయ అవార్డు గెలుచుకున్న కమల్ హాసన్ (Kamal Haasan) ఇతర పెద్ద చిత్రాలలో కూడా అలాంటి పాత్రలు చేయచ్చు. అతను అలాంటి పాత్రల కోసం ప్రతి చిత్రానికి రూ. 80 నుండి 100 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే జూనియర్ ఎన్టీఆర్ (NTR) 31వ చిత్రంలో కూడా ప్రత్యేకమైన పాత్ర కోసం కమల్ హాసన్ (Kamal Haasan) నటించే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి.

భారతీయుడు-2తో మరోసారి అలరించనున్న కమల్ హాసన్: 

ఇటీవల, ఇండియన్ 2 (Indian-2)కి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కమల్ హాసన్ (Kamal Haasan) ఈ చిత్రంలో డిజిటల్‌గా డి-ఏజ్డ్‌గా కనిపించబోతున్నారు అని. దీనికి కారణం దర్శకుడు ఎస్ శంకర్ (Shankar) చేసిన ఓ ట్వీట్ జనాలను ఆలోచింపజేస్తోంది. ఈమధ్య సినిమా (Cinema)ల్లో విఎఫ్ఎక్స్లు కొత్తేమి కాదు, శంకర్ (Shankar) గారి ట్వీట్‌ సాంకేతికత విషయానికి వస్తే, శంకర్ (Shankar) దృష్టి ఎంత పెద్దదైతే అంత మంచి ఫలితం వస్తుందని మనందరికీ తెలుసు, రోబో సినిమా (Cinema)లు తీసింది కూడా ఆయనే కదా,  మీకు గుర్తు ఉండే ఉంటుంది రజిని (Rajinikanth) శివాజీ సినిమా (Cinema) లో ఓ పాటలో కూడా తెల్లగా కనిపించడానికి ఒక తెల్లమ్మాయి చర్మరంగుతో టెక్నాలజీ సాయం తో మార్పులు చేసి తెరపై చూపించారు.. అందువల్ల, ఆ ట్వీట్ లో “లోలా VFX LA వంటి అధునాతన సాంకేతికతను స్కాన్ చేస్తోంది” అని రాసే సరికి ఇండియన్ 2 (Indian-2) కోసం కొత్త ప్రయోగాలు చేస్తున్నారేమో అనే సందేహం వస్తోంది. ఇలాగే మరిన్ని కొత్త కొత్త ప్రయోగాలతో కమల్ హాసన్ (Kamal Haasan) మరిన్ని చిత్రాలతో, తెలుగు (Telugu) ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుందాం. 

అంతేకాకుండా ఇటీవల..ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఏస్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam)తో సినిమా (Cinema) తీయడం అనేది రెండు తెలుగు (Telugu) రాష్ట్రాల్లో కూడా ఆసక్తిని రేకెత్తించింది. ఈ ప్రత్యేకమైన సినిమా (Cinema) గురించి పరిశ్రమ జనాలు మాట్లాడుకుంటున్నారు. మణిరత్నం (Mani Ratnam)తో కమల్ హాసన్ (Kamal Haasan) జతకట్టడం సినీ పరిశ్రమలోనే కాకుండా.. తెలుగు (Telugu) ప్రేక్షకులలో కొంత ఆసక్తిని రేకెత్తించింది. ఎందుకంటే వారి మునుపటి చిత్రం ‘నాయకుడు’ 1980 లలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారీ కలెక్షన్లు చూసింది.