Kamal Haasan: అదిరిపోయిన కమల్ బర్త్ డే ట్రీట్

Kamal Haasan: విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Hassan) గురించి తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. కమల్ (Kamal Hassan) నుంచి సినిమా వస్తుందని అంటే ఆ సినిమాను ఎలాగైనా చూడాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కమల్ హాసన్(Kamal Hassan) కు సరైన హిట్ లేదు. దీంతో ఆయనతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ సఫర్ అయ్యారు. కానీ పోయినేడాది వచ్చిన విక్రమ్ (Vikram) మూవీ […]

Share:

Kamal Haasan: విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Hassan) గురించి తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. కమల్ (Kamal Hassan) నుంచి సినిమా వస్తుందని అంటే ఆ సినిమాను ఎలాగైనా చూడాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కమల్ హాసన్(Kamal Hassan) కు సరైన హిట్ లేదు. దీంతో ఆయనతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ సఫర్ అయ్యారు. కానీ పోయినేడాది వచ్చిన విక్రమ్ (Vikram) మూవీ కమల్ హాసన్(Kamal Hassan) తో పాటు ఆయన ఫ్యాన్స్ కు కూడా కొత్త ఊపును తీసుకొచ్చింది. ఈ సినిమాతో కమల్ లోని నటుడు ఇంకా అలాగే ఉన్నాడని మరోసారి ప్రూవ్ (Proof) అయింది. ఆ సినిమా తెచ్చిన జోష్ లో ఉన్న కమల్ (Kamal Hassan) కు చాలా రోజుల వరకు సరైన కథ దొరకలేదు. దాంతో ఆయన దాదాపు ఏడాది పాటు ఖాళీగానే సినిమాలు లేకుండా ఉన్నారు. కానీ ప్రస్తుతం కమల్ హాసన్ లెజండరీ డైరెక్టర్ మణిరత్నం (Maniratnam) తో జతకలిశారు. 

లెజండరీతో విశ్వనటుడు

విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ (Kamal Hassan) లెజండరీ డైరెక్టర్ గా పేరుగాంచిన తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Maniratnam)తో జతకట్టారు. ఆయన ప్రస్తుతం ఈ లెజండరీ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే గ్రాండ్ గా జరిగాయి. అయితే నిన్న విశ్వనటుడు కమల్ (Kamal Hassan) పుట్టిన రోజు (Birth Day) సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్ (Glimpse) రిలీజ్ చేశారు. దీంతో ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో (Social media) వైరల్ అయింది. అంతే కాక అనేక మంది ఆ గ్లింప్స్ షేర్ చేస్తూ.. విశ్వనటుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మూవీని నిర్మిస్తున్న రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పిక్చర్స్ వారు ఈ మూవీకి సంబంధించన గ్లింప్స్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. కేవలం గ్లింప్స్ మాత్రమే కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ (First look Poster) ను కూడా వదిలి విశ్వనటుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  

యోధుడిగా కమల్

కమల్ సినిమా వస్తుందంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అటువంటిది లెజండరీ డైరెక్టర్ మణిరత్నంతో కమల్ జోడీ కడుతున్నాడని తెలిస్తే అభిమానుల అంచనాలు (Expectations) తారా స్థాయికి చేరుకుంటాయి. ఈ మూవీపై కూడా  అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ మూవీలో కమల్ హాసన్ (Kamal Hassan) ఓ యోధుడిలా (Warrior) కనిపిస్తున్నారు. మోషన్ గ్లింప్స్ అభిమానులకు విజువల్ ట్రీట్‌ ఇచ్చేలా ఉంది. కమల్ హాసన్‌ ను తీవ్రమైన మరియు ఆకర్షణీయమైన యోధుని లుక్‌ లో చూపించారు. అతడు పొడవాటి జుట్టుతో నెక్ట్స్ లెవల్ లో ఉన్నాడు. ఇక ఆ పోస్టర్ లో థగ్ లైఫ్ (Thug Life) అనే క్యాప్షన్ ఉంది. 

మూడున్నర దశాబ్దాల తర్వాత మరోసారి.. 

మణిరత్నం, కమల్ హాసన్ (Kamal Hassan) కాంబో గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీరి కాంబోలో ఎన్నో హిట్ సినిమాలు (Hit Movies) వచ్చాయి. కానీ వీరు ఈ మధ్య ఎక్కువగా కనిపించలేదు. వీరి కాంబోలో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత వారు మరోమారు జతకట్టారు. ఈ చిత్రం మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రానికి థగ్ లైప్ అని నామకరణం చేశారు. పోస్టర్ చూస్తుంటేనే ఇదో యాక్షన్ మూవీ (Action movie) అని ఇట్టే అర్థం అవుతోంది. ఈ మూవీ కమల్ కు 234వ చిత్రం. 1987లో నాయకన్‌ మూవీతో ఈ ఇద్దరు చివరి సారిగా మెస్మరైజ్ చేశారు. ఆ తర్వాత వీరి కాంబోలో మూవీని ప్రేక్షకులు చూడలేకపోయారు. 

థగ్ లైఫ్ (Thuglife) టీజర్‌ లో కమల్ హాసన్‌ ను రంగరాయ శక్తివేల్ నాయకన్ అనే గ్యాంగ్‌స్టర్‌ గా పరిచయం చేశారు. ఈ చిత్రంలో హాసన్ పొడవాటి జుట్టుతో ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు. టీజర్ తోనే అంచనాలను పెంచేసిన ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

క్యాస్ట్ అండ్ క్రూ ఇదే..

లెజండరీ డైరెక్టర్ మణిరత్నం, పాన్ ఇండియా స్టార్ కమల్ హాసన్ (Kamal Hassan) కాంబోలో మూవీ వస్తుందంటే అందులో ఎవరు నటిస్తున్నారనే క్యూరియాసిటీ అందిరిలో కామన్ గా ఉంటుంది. ఈ థగ్ లైఫ్ (Thug life) మూవీలో కమల్ హాసన్ (Kamal Hassan) సరసన త్రిష నటిస్తుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ మరియు మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్ (Kamal Hassan) మరియు మణిరత్నం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ (AR Rahman) స్వరాలు సమకూరుస్తున్నాడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నాడు. కేవలం త్రిష మాత్రమే కాకుండా స్టార్ నటుటు జయం రవి, మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా ఈ మూవీలో భాగం అయ్యారు. ఈ మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ (Makers) ప్రకటించారు. 2024లో రిలీజ్ కాబోయే ప్రతిష్టాత్మక చిత్రాలలో థగ్ లైఫ్ కూడా ఒకటి. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత సూపర్ స్టార్ ఏస్ డైరెక్టర్ కలవడంతో ఈ మూవీ పక్కా హిట్ అవుందని అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.