Suriya: సూర్యతో నటించకపోవడానికి కారణం అదే..

తనకు ఉన్న భయాన్ని భయటపెట్టిన కార్తి

Courtesy: Twitter

Share:

Suriya: కార్తి (Karthi)  అవడానికి తమిళ హీరోనే అయినా కానీ ఈ హీరోకు తెలుగు (Telugu)లో ఫాలోయింగ్ ఎక్కువే. అతడు కెరీర్ (Career) తొలినాళ్ల నుంచే తెలుగులో మార్కెట్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక కార్తి (Karthi) సోదరుడు సూర్య (Suriya)కు కూడా తెలుగులో చాలా మార్కెట్ ఉంది. కేవలం వీరిద్దరు మాత్రమే కాకుండా చాలా మంది తమిళ హీరోలు (Tamil Heros) తెలుగు నాట మంచి మార్కెట్ ను  కలిగి ఉన్నారు. కానీ తెలుగు హీరోలకు మాత్రం తమిళంలో పెద్ద మార్కెట్ క్రియేట్ కాలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. కార్తి (Karthi) సినిమా వస్తుందంటే ఏదో తమిళ హీరో సినిమా రిలీజ్ అయినట్లు ఉండదు. వాతావరణం తెలుగు స్ట్రెయిట్ సినిమానే (Straight Movie) రిలీజ్ అవుతుందని అన్నట్లు ఉంటుంది. అటువంటి కార్తి (Karthi) మొన్న మరో మూవీతో వచ్చి హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇక సూర్య సినిమాలకు తెలుగులో ఉన్న డిమాండ్ వేరుగా ఉంటుందనే చెప్పాలి. 

ఓ స్టార్ సినిమాలా.. 

సూర్య (Suriya) సినిమా రిలీజ్ అవుతుందని అంటే ఓ తెలుగు టాప్ స్టార్ సినిమా రిలీజ్ అయితే ఎంత హంగామా ఉంటుందో సూర్య (Suriya) సినిమాకు అంత హంగామా ఉండడం సహజం. ఇప్పటికే సూర్య తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు. ప్రస్తుతం కార్తి కూడా తనదైన మార్క్ నటనతో తెలుగు ప్రేక్షకులను దగ్గర అవుతున్నారు. ఈ ఇద్దరు స్టార్లు (Stars) డైరెక్ట్ తమిళ సినిమాలు చేసి ఇక్కడ డబ్ చేసి రిలీజ్ చేసినా అవి ఇక్కడ రికార్డు వసూళ్లను (Collections) సాధిస్తున్నాయి. ఇంతటి గొప్ప స్టార్స్ అయిన వీరు బ్రదర్స్ అనే విషయం కొంత మందికి తెలియదు. వీరు ఒకే తల్లికి పుట్టిన తోబుట్టువులు (Brothers). అవడానికి బ్రదర్సే అయినా కానీ వీరు ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోకుండా ఉంటారు. అందుకోసమే వీరి ప్రొఫెషనల్ లైఫ్ చాలా సాఫీగా సాగుతూ ఉంటుందని అనేక మంది కామెంట్ చేస్తారు. 

సూర్యతో అందుకే చేయలేదు.. 

కార్తి (Karthi)  తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ని రోజుల పాటు తన సోదరుడు సూర్య (Suriya)తో ఎందుకు కలిసి నటించలేదనే విషయాన్ని వెల్లడించాడు. ఒండ్రాగా ఎంటర్‌ టైన్‌ మెంట్ యూట్యూబ్ చానెల్‌ లో ప్రసారమవుతున్న 'ఉరైయాడల్ అండ్ స్టఫ్...' ఇంటర్వ్యూలో దర్శకుడు గౌతమ్ వాసుదేవన్ (Vasudev menon) మీనన్ తో కలిసి కార్తి(Karthi) పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఇన్ని రోజులు సూర్యతో (Suriya) కలిసి ఎందుకు నటించలేదో వెల్లడించాడు. సూర్య వంటి ప్రతిభావంతమైన యాక్టర్ తో ఇంత వరకు ఎందుకు నటించలేదో వెల్లడించాడు. బహుముఖ ప్రతిభ ఉన్న సూర్యతో నటించడం తనకు భయంగా అనిపించిందని కార్తి తెలిపారు. సూర్య ఇప్పటికే జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నాడు. 

గుడ్ న్యూస్ చెప్పిన కార్తి

ఈ ఇంటర్వ్యూలో (Interview) కార్తి గుడ్ న్యూస్ చెప్పారు. తాను త్వరలోనే తన అన్నయ్యతో స్క్రీన్ (Screen) ను షేర్ చేసుకోనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు తమ ఇద్దన్నీ సాటిస్ఫై చేసే కథ (Story) తమ వద్దకు రాలేదని వెల్లడించాడు. ఇద్దరం కలిసి త్వరలోనే ఓ మంచి సినిమాతో మీ ముందుకు వస్తామని వెల్లడించాడు. ప్రేక్షకులను మరింత ఎక్కువగా సాటిస్ఫై చేసేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. మంచి స్టోరీ దొరికితే ఇద్దరం కలిసి యాక్ట్ చేయనున్నట్లు వెల్లడించాడు. ఈ న్యూస్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చేది అయినప్పటికీ ఇంకా వీరికి తగిన స్టోరీ మాత్రం దొరకలేదు. 

కంగువను ముగించిన సూర్య

టాలెంటెడ్ యాక్టర్ సూర్య (Suriya) ఇటీవలే పీరియాడికల్ పాన్ ఇండియన్ మూవీ కంగువ (Kanguva) షూటింగ్ ముగించారు. ఇదో యాక్షన్ డ్రామా (Action Drama). అంతే కాకుండా సూర్య తనకు సూరరై పొట్రు (ఆకాశమే నీ హద్దురా) వంటి హిట్ మూవీని అందించిన లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో (Sudha Kongara) కలిసి ఓ మూవీని చేస్తున్నాడు. ఈ మూవీకి ఇంకా పేరు ఖరారు కాలేదు. ఈ మూవీకి సూర్య-43 అనే పేరును ఖరారు చేశారు. అంతే కాకుండా సూర్యకు ఎంతో పేరును తీసుకొచ్చిన విక్రమ్ మూవీలోని రొలెక్స్ (Rolex) అనే పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాత్ర విక్రమ్ మూవీలో కేవలం చివర్లో క్యామియో రోల్ గా వస్తుంది. కానీ ఆ పాత్రతోనే ఒక మూవీని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీ కూడా చేసేందకు సూర్య ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కార్తి (Karthi) విషయానికి వస్తే కార్తి ఇటీవలే జపాన్ (Japan) అనే కామెడీ మూవీని రిలీజ్ చేశాడు. అంతే కాకుండా కార్తి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన ఖైదీ మూవీకి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశాడు. ఈ మూవీ ఇంకా కొద్ది రోజుల్లో పట్టాలెక్కనుంది. అలాగే కార్తి తన 26వ చిత్రం కోసం ప్రముఖ దర్వకుడు నలన్ కుమారసామితో జత కట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు ఎవరికి వారు వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి ఈ ఇద్దరు స్టార్ల వద్దకు ఏ డైరెక్టర్ (Director) కథను తీసుకొస్తాడో.. ఆ మూవీ ఎప్పుడు కంప్లీట్ (Complete) అవుతుందో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అతి త్వరలోనే వీరి కాంబోలో (Combo) మూవీ చూడాలని ఆశ పడుతున్నారు.

Tags :