Koffee With Karan show: మాట్లాడకపోతే బాగుండు అనుకున్న కార్తీక్ ఆర్యన్

ఇంతకీ దేని గురించి మాట్లాడాడు..?

Courtesy: Twitter

Share:

Koffee With Karan show: సారా అలీ ఖాన్ (Sara), కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) మళ్లీ కలిసిపోయారేమో అనే రెడ్డిట్ ప్లాట్ఫారం ద్వారా అనిపించినప్పటికీ, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) మాట్లాడిన మాటలు మరోలా వినిపిస్తున్నాయి. ఇటీవలి కాఫీ విత్ కరణ్ (Koffee With Karan show) ఎపిసోడ్‌లో, కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్, సారా (Sara) మరియు అనన్య పాండే (Ananya Panday) అతని గురించి చర్చించినందుకు కార్తీక్ నిజానికి కొంచెం అప్సెట్ అయినట్లు కూడా కనిపిస్తోంది.

ఇంతకీ దేని గురించి మాట్లాడాడు..?: 

ఫిల్మ్ కంపానియన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కార్తీక్ తన వ్యక్తిగత జీవితాన్ని గురించి అడగడం అయితే జరిగింది. ముఖ్యంగా కాఫీ విత్ కరణ్ (Koffee With Karan show)‌లో అతని పేరు ప్రస్తావించడానికి సంబంధించి కార్తిక ఆర్యన్ మాట్లాడాడు. అంతేకాకుండా అతను పరోక్షంగా మీడియా మేత కూడా ఒక రకంగా కోప్పడ్డాడు. తనకు తెలియకుండానే తన వ్యక్తిగత విషయాల్లో హైలెట్ అవడం గురించి మాట్లాడాడు. అంతే కాకుండా తన గురించి కాఫీ విత్ కరణ్ (Koffee With Karan show) షో లో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్, తన గురించి మాట్లాడకుండా ఉండి ఉంటే బాగుండేది అని కూడా ప్రస్తావించాడు. 

కరణ్ జోహార్ సారా (Sara) మరియు అనన్య పాండే (Ananya Panday)లను కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) గురించి నేరుగా అడిగారు. వారు ఒకప్పుడు ఒకే వ్యక్తితో డేటింగ్ చేసినందున, ఒకరితో ఒకరు స్నేహంగా ఉండటం సులభం కాదు కదా అని అడిగారు. సారా (Sara) ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకుంది, అదేవిధంగా సాధారణంగా డేటింగ్, బ్రేకప్‌ల గురించి మాట్లాడింది. ఏది ఏమైనప్పటికీ తమకి తెలియకుండా తమ గురించి బహిరంగంగా మాట్లాడినందుకు కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) ఒకరకంగా బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. 

షో గురించి మాట్లాడిన నాచురల్ స్టార్ నాని..: 

చాలామంది బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా చాలా భాషల నుంచి కూడా, ఎంతోమంది పాపులర్ స్టార్ కాఫీ విత్ కరణ్ (Koffee With Karan show)లో కనిపిస్తూ ఉంటారు. ప్రత్యేకించి చెప్పాలంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి సమంత వెళ్లిన సమయంలో షో గురించి పలు వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ఒక షోలో మాట్లాడిన నాచురల్ స్టార్ నాని (Nani), తనకి కాఫీ విత్ కరణ్ (Koffee With Karan show) నుంచి పిలుపు వస్తే ఎలా స్పందిస్తాడో చెప్పడం జరిగింది. 

 

నాని (Nani) గురించి ఆయన వైవిధ్యమైన నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ప్రతి ఒక్కరి మనసుల్ని దోచుకుని ఇప్పుడు హాయ్ నాన్న సినిమాతో మరొకసారి మన ముందుకు రాబోతున్నాడు నాచురల్ స్టార్ నాని (Nani). నాచురల్ స్టార్ నాని (Nani) తనకి ఒకవేళ కాఫీ విత్ కరణ్ (Koffee With Karan show) నుంచి పిలుపు వస్తే ఎలా స్పందిస్తాడో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆ షో గురించి తెలుసుకున్న నాని (Nani), ఒకవేళ తనకి ఆఫర్ వస్తే వద్దనే చెప్తాను అంటున్నాడు. ఎందుకంటే తాను సినిమాల గురించి ప్రత్యేకంగా మాట్లాడడానికి అసలు వెనకాడనప్పటికీ, తన పర్సనల్ లైఫ్ గురించి, కొన్ని విలువల గురించి తనకు జాగ్రత్తలు ఉన్నాయని వివరించాడు నాని (Nani). అంతేకాకుండా తను ప్రత్యేకించి కరన్ను పర్సనల్గా కలిసి మాట్లాడుతానని కూడా వెల్లడించారు. ఇలా నాచురల్ స్టార్ నాని (Nani) తనకి కాఫీ విత్ కరణ్ (Koffee With Karan show) నుంచి పిలుపు వస్తే నో చెప్తానంటూ వెల్లడించాడు. 

ఏది ఏమైనప్పటికీ, ఒకరి వ్యక్తిగత విషయాలను మరొకరు టీవీ షోల ద్వారా బయట పెట్టడం, తమకు తెలియకుండానే తమ జీవితాలలో జరిగే కొన్ని వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించడం అనేది కొంతమందికి నచ్చలేదని ఈ విషయాల ద్వారా మనం స్పష్టంగా చూడొచ్చు.