రామ్ చరణ్ "Game Changer" సినిమా షూటింగ్ షురూ.. ఎక్కడో చూడండి!

Game Changer: పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్ దశలో ఉంది. తాజాగా, ఈ సినిమా గురించి లేటెస్ట్‌ షూటింగ్ అప్‌డేట్ వార్తలు వచ్చాయి.

Courtesy: Top Indian News

Share:

హైదరాబాద్: స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో  'గేమ్ ఛేంజర్' రాబోతున్న సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీమేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్ దశలో ఉంది. తాజాగా, ఈ సినిమా గురించి లేటెస్ట్‌ షూటింగ్ అప్‌డేట్ వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం గేమ్‌ ఛేంజర్‌ నయా షెడ్యూల్ షూటింగ్ నేడు హైదరాబాద్‌లో షురూ అయింది. దిల్ రాజు కెరియర్లో అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. 

'ఇండియన్ 2' సినిమాతో శంకర్ బిజీగా ఉండటం కారణంగానే  ఈ సినిమా షెడ్యూల్స్ పరంగా కాస్త ఎక్కువ గ్యాప్ నే తీసుకుంటోందట. శ్రీకాంత్‌, సముద్రఖని, ఎస్‌జే సూర్య ఇతర నటీనటులకు సంబంధించిన ముఖ్యమైన  సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాక్‌. కాగా, రాంచరణ్‌ త్వరలోనే సెట్స్‌లో జాయిన్ కాబోతున్నాడట. గేమ్‌ఛేంజర్‌లో రాజోలు భామ అంజలి, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్‌, ఎస్‌జే సూర్య, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, జ‌య‌రాయ్‌, సునీల్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌, హై టెక్నికల్ వాల్యూస్‌తో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు తెర‌కెక్కిస్తున్నారు. గేమ్‌ ఛేంజర్‌కు పాపులర్ డైరెక్టర్‌ కార్తీక్ సుబ్బరాజు కథనం అందిస్తుండగా.. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే, వచ్చే ఏడాది రాబోయే 'గేమ్ ఛేంజర్' సినిమాలో రామ్ చరణ్ లుంగీలో కనిపించనున్నట్లు సమాచారం. మరోవైపు రాంచరణ్‌ ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన డైరెక్షన్‌లో ఆర్‌సీ 16కు కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్  ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో సాయిపల్లవిని తీసుకున్నట్టు వార్తలు వస్తుండగా.. రాంచరణ్ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.