Natural Star Nani: ‘సరిపోదా శనివారం’ అంటున్న నాని..!

‘దసరా'(Dasara) తో పాన్ ఇండియా ఫేమ్ సంపాదించి, ‘హాయ్ నాన్న(Hai Nanna)’ విడుదలకు సిద్ధమౌతున్న నేచురల్ స్టార్ నాని(Natural Star Nani).. ‘అంటే సుందరానికీ’ లాంటి కల్ట్ ఎంటర్‌టైనర్‌ను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ(Director Vivek Atreya)తో మరోసారి జతకడుతున్నారు. ఈసారి మరింత కొత్తగా ప్లాన్ చేశారు. ఈ మేరకు సోమవారం ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. అలాగే టైటిల్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) వరుస […]

Share:

‘దసరా'(Dasara) తో పాన్ ఇండియా ఫేమ్ సంపాదించి, ‘హాయ్ నాన్న(Hai Nanna)’ విడుదలకు సిద్ధమౌతున్న నేచురల్ స్టార్ నాని(Natural Star Nani).. ‘అంటే సుందరానికీ’ లాంటి కల్ట్ ఎంటర్‌టైనర్‌ను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ(Director Vivek Atreya)తో మరోసారి జతకడుతున్నారు. ఈసారి మరింత కొత్తగా ప్లాన్ చేశారు. ఈ మేరకు సోమవారం ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. అలాగే టైటిల్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు.

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రకరకాల జోనర్లలో సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసిన నాని.. ప్రతీ సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. కొత్త కాన్సెప్ట్‌లను ఎంపిక చేసుకుంటున్నారు. ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే సుందరానికీ’, ‘దసరా’, ‘హాయ్ నాన్న’.. ఇలా ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకం. దర్శకుడు వివేక్ ఆత్రేయ((Director Vivek Atreya))తో ‘అంటే సుందరానికీ’ లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేసిన నాని.. ఇప్పుడు ఆ దర్శకుడితో మరోసారి చేతులు కలిపారు. ఈసారి మరో వెరైటీ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 

డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌లో నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో సినిమాను ఇటీవల ప్రకటించారు. ఇది నాని 31వ సినిమా. నిన్న ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేశారు. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌(Heroine Arul Mohan)గా నటించనున్నారు. వీరిద్దరూ ఇప్పటికే ‘గ్యాంగ్ లీడర్’(Gand Leader) సినిమాలో కలిసి నటించారు. ఇక ప్రముఖ దర్శక నటుడు ఎస్.జె.సూర్య(SJ Surya) ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా టైటిల్‌ను ఈరోజు ప్రకటించారు. అంతేకాకుండా నాని ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ వీడియోను కూడా విడుదల చేశారు.

‘సరిపోదా శనివారం’ ఫస్ట్ లుక్

‘సరిపోతుందా శనివారం’ (Saripoda Sanivaaram)అనే వైవిధ్యమైన టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టారు. అయితే, ఈ టైటిల్ వెనక పెద్ద కథే ఉందని గ్లింప్స్ ద్వారా అర్థమైంది. సాయికుమార్ వాయిస్(Sai Kumar Voice) ఓవర్‌తో వచ్చిన ఈ గ్లింప్స్ వీడియో ఆసక్తి రేపుతోంది. ‘మన పెద్దలు ఒక మాటననేవాళ్లు.. రాజుకైనా, భంటుకైనా, ఎలాంటివాడికైనా ఒకరోజు వస్తుంది.. ఆరోజు కోసం ఎన్ని రోజులైనా ఎదురుచూడాలి అని. అదే మాటని మన కొత్త తరం కుర్రాళ్లు ఇంకొంచెం మార్చి.. నీకంటూ ఒక టైమొస్తుందిరా.. అందాక మూసుకొని వెయిట్ చేయి అన్నారు. ఇప్పుడు మన కథ ఆ మాట చెప్పిన ఆ తరం వాళ్ల గురించో.. ఆ మాటను మార్చిన ఈ తరం వాళ్ల గురించో కాదు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏ తరంవాడైనా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసే ఆ ఒక్క రోజు గురించే. అలాంటి రోజు.. ఆ ఒక్క రోజు వాడికి వారానికి ఒక్కసారి వస్తే.. వాడిని ఎవరైనా ఆపాలనుకోగలరా? అనుకున్నా ఆపగలరా? శనివారం.. ప్రతీ శనివారం.. సరిపోదంటారా?’ అంటూ సాయికుమార్ పవర్‌ఫుల్ వాయిస్‌తో నాని పరిచయం అదిరిపోయింది.

ఇక ఈ గ్లింప్స్‌కు జేక్స్ బెజోయ్(Jakes Bejoy) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. మురళి జి(Mural G) సినిమాటోగ్రఫీ కూడా అదిరిపోయింది. మొత్తంగా చూసుకుంటే మరోసారి సరికొత్త కాన్సెప్ట్‌తో నాని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని ఈ గ్లింప్స్ ద్వారా అర్థమైంది. ఈ పాన్ ఇండియా మూవీని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్(DVV Entertainments) బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తు్న్నారు. రేపు ఈ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు అతిథుల మధ్యలో రేపు ‘సరిపోతుందా శనివారం’ గ్రాండ్‌గా లాంచ్ కాబోతోంది.