సలార్ రచ్చ రచ్చే.. 10 రోజుల్లో రూ.625 కోట్ల కలెక్షన్లు

Salaar Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్: పార్ట్-1 సీజ్‍ఫైర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులతో దుమ్ము రేపుతోంది.

Courtesy: x

Share:

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్: పార్ట్-1 సీజ్‍ఫైర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులతో దుమ్ము రేపుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 10 రోజుల్లో ప్రపంచవ్యప్తంగా (Salaar Collection Worldwide) ఈ సినిమా రూ.625 కోట్లు వసూలు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఈ యాక్షన్ డ్రామా మూవీ సలార్ డిసెంబర్ 22న రిలీజ్ అయింది. ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ రావటంతో భారీ కలెక్షన్లు వస్తున్నాయి. సలార్ ​కు ఒక్క రోజు ముందు విడుదలైన 'డంకీ' సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ప్రదర్శన చేయలేపోయింది. దీంతో సలార్ అడ్డు లేకుండా దూసుకెళ్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ మాస్ యాక్షన్​ కోసం ఫ్యాన్స్ రిపీట్ మోడ్​తో థియేటర్లకు వెళ్తున్నారు. మధ్యలో కలెక్షన్లు నెమ్మదించినా ఈ వీకెండ్​లో వసూళ్లు మళ్లీ పుంజుకున్నాయి. 

10 రోజుల్లో రూ.625 కోట్ల కలెక్షన్లు
సలార్ సినిమా 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.625 కోట్ల గ్రాస్ కలెక్షన్ల సాధించింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. “ఖాన్సార్.. నన్ను క్షమించు! అన్‍స్టాపబుల్ సలార్ సీజ్‍ఫైర్ రూ.625కోట్ల గ్రాస్ బాక్సాఫీస్ కలెక్షన్లను (ప్రపంచవ్యాప్తంగా) దాటేసింది” అని పేర్కొంది. రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్‍బాస్టర్ అంటూ పోస్ట్ చేసింది.

దేశంలో శనివారం ఈ సినిమా రూ.12.55 కోట్లు సాధించగా, ఆదివారం రూ.15.74 కోట్లు రాబట్టిందని సినీ ట్రేడ్​ వర్గాల సమాచారం. శనివారంతో పోల్చితే ఆదివారం పదోరోజు 25.42 శాతం ఎక్కువ వసూళ్లు రాబట్టిందని తెలుస్తోంది. ఫలితంగా భారత్​లో ఈ సినిమా రూ.346.88 కోట్లు సాధించింది. ఈ సినిమా రిలీజ్​ రోజు రూ.178.7 కోట్లు కలెక్షన్లు రాబట్టిందని అంతకుముందు చిత్ర బృందం తెలిపింది. దీంతో 2023లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.

సినిమాను పెద్ద హిట్​ చేసిన అభిమానులకు ప్రభాస్​ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్​లో రెండు పార్టులుగా తెరకెక్కిన 'సలార్ పార్ట్-1 సీజ్ ​ఫైర్' డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఖాన్ సార్ అనే ఒక అండర్ వరల్డ్ సిటీ సింహాసనం కోసం మూడు ట్రైబల్ ఫ్యామిలీస్ మధ్య జరిగే యుద్ధం నేపథ్యంతో ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రీయా రెడ్డి కీలక పాత్రలు పోషించారు.